Cyclone Dana: దానా తూఫాన్ తీవ్ర రూపం దాల్చింది.. తీవ్ర తూఫాన్ గా మారి ముంచుకొస్తుంది.. రేపు వేకువజామున తీరం దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ముంచుకొస్తున్న తీవ్ర తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది.. రేపు వేకువజామున పూరీ-సాగర్ ఐలాండ్స్ మధ్య భితార్కానికా మరియు ధమ్రా సమీపంలో తీరం దాటనుంది. ప్రస్తుతానికి పారాదీప్ కు 280 కిలోమీటర్లు.. సాగర్ ఐలాండ్స్ కు 370 కిలో మీటర్లు.. ధమ్రాకు 310 కిలోమీటర్ల దూరంలో దానా తీవ్ర తుప్‌న్ కేంద్రీకృతం అయిఉంది.. దానా దాటికి అన్ని ప్రధాన ఓడరేవుల్లో ఇప్పటికే రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు..తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 120 కిమీ వేగంతో ఈదురు గాలులు భీభత్సమ్ సృష్టించనున్నాయి..
మరోవైపు దానా తీవ్ర తుఫాన్ ఎఫెక్ట్‌తో తూర్పు కోస్తా రైల్వే అప్రమత్తమైంది.. ఈ రోజు విశాఖ నుండి భువనేశ్వర్, కోక్‌కతావైపు బయలుదేరే 42 రైళ్లు రద్దు రద్దు చేసింది.. ఇక, రేపు 26 ట్రైన్స్ రద్దు చేసినట్టు తూర్పుకోస్తా రైల్వే ప్రకటించింది.. తుఫాన్ తీవ్రతను బట్టి మరిన్ని రైళ్లు రద్దు చేసే ఆవకాశం ఉందంటున్నారు అధికారులు.. అయితే, రైళ్లు రద్దు చేయడంతో స్టేషన్ వద్ద పడిగాపులు కాస్తున్నారు ప్రయాణికులు..