TDP: టీడీపీ సభ్యత్వ నమోదు క్యాంపెయిన్ ప్రారంభం అయ్యింది.. తొలి సభ్యత్వాన్ని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకోవడంతో.. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. అయితే, రూ.100 సభ్యత్వంతో రూ. 5 లక్షల మేర బీమా సౌకర్యం కల్పించేలా సభ్యత్వ కార్యక్రమాన్ని రూపొందించింది తెలుగు దేశం పార్టీ. అంతేకాదు.. రూ. లక్షతో శాశ్వత సభ్యత్వం పొందేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.. పార్టీ కార్యకర్తలకు లబ్ది చేకూరేలా ప్రణాళికలు సిద్ధం చేస్తూ వస్తుంది టీడీపీ..
Read Also: Munugode: రైతుపై దాడి చేసిన మునుగోడు ఏఎస్ఐ..
11 గంటల 59 నిమిషాలకు తొలి సభ్యత్వం తీసుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా తొలి సభ్యత్వం కార్డు అందుకున్నారు చంద్రబాబు.. 100 రూపాయలు చెల్లించి తొలి సభ్యత్వం ఉండవల్లి గ్రామ అధ్యక్షుడు నుంచి నమోదు చేయించుకున్నారు చంద్రబాబు.. మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంలో తన సభ్యత్వాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రెన్యువల్ చేసుకున్నారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుండి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది.. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. టీడీపీకి కార్యకర్తలే బలం అన్నారు.. ప్రాణాలు అడ్డుపెట్టి మొన్నటి ఎన్నికల్లో టీడీపీని కార్యకర్తలు గెలిపించారన్న ఆయన.. వైసీపీ నేతలు బూత్ లోకి వచ్చి కొడుతున్న కార్యకర్తలు అలానే నిలబడి పార్టీని గెలిపించారని గుర్తుచేశారు.. అందరూ సీరియస్ గా తీసుకుని సభ్యత్వ నమోదు రికార్డు స్థాయిలో అయ్యేలా చూడాలని పిలుపునిచ్చారు ఎంపీ లావు కృష్ణదేవరాయలు.