తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంలో సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. రాజకీయాల కోసం దేవుడిని రోడ్డు మీదకి లాగారన్న ఆమె.. ప్రజలు తిరుమలకు వచ్చి ఇప్పుడు లడ్డూ తీసుకోవాలా..? తినాలా..? వద్దా..? అని అలోచిస్తున్నారు... అడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందా లేదా అని సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ప్రజలందరూ కూడా భయంతో ఉన్నారన్నారు.. ఏపీ, తెలంగాణ ప్రజలు ఎవరు దీనిని నమ్నరు.. కానీ, ఇతర ప్రాంతాల ప్రజలు నమ్ముతున్నారని పేర్కొన్నారు రోజా..
వైఎస్ జగన్.. తిరుమల పర్యటన వాయిదా పడటానికి ప్రభుత్వమే కారణం అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. వైఎస్ జగన్ తిరుమల పర్యటన వాయిదా పడటంపై స్పందించిన ఆయన.. దీనికి ప్రభుత్వమే కారణం అన్నారు.. నిన్న తిరుమలలో ఉన్న వాతావరణం ప్రజలందరూ గమనించారు.. జగన్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు నోటీసులు ఇచ్చారు.. అన్యమతస్తులు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలని బోర్డులు పెట్టారు.. జగన్ పర్యటన రద్దు అవగానే బోర్డులు తీసేశారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.. దీని కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసింది.. ప్రజల నుంచి సలహాల స్వీకరణ కోసం స్వర్ణాంధ్ర @ 2047 పేరుతో పోర్టల్ ఏర్పాటు చేశారు.. ఏపీ అభివృద్ధి సలహాల కోసం పోర్టల్ ప్రారంభించింది ప్రణాళిక విభాగం.
కవిత్వమే ఆయుధంగా మూఢాచారాలపై తిరగబడిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా.. సంఘ సంస్కరణే లక్ష్యంగా ఆ మహనీయుడు సృష్టించిన సాహిత్యం ఎప్పటికీ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోదుంటే అతిశయోక్తి కాదు.. తెలుగు సాహితీ లోకంలో ఆయన దిగ్గజ వ్యక్తిగా నిలిచిపోతారు..
టాలీవుడ్లో సంచలనం సృష్టించిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారంలో మరో కొత్త ట్విస్ట్ వచ్చిచేరింది.. బాధితురాలపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఫిర్యాదు చేశారు జానీ మాస్టర్ భార్య సుమలత. కొరియోగ్రాఫర్ గా పని చేయడం కోసం నా భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో పేధింపులకు గురి చేసిందని తన ఫిర్యాదులో పేర్కొంది..
తొమ్మిరోజుల పాటు.. 11 రోజుల పాటు.. 15 రోజుల పాటు.. ఇలా పూజలు అందుకున్న వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేశారు భక్తులు.. అయితే, ఈ సారి గాజువాకలో ఏర్పాటు చేసిన 75 అడుగుల బెల్లం వినాయకుడిని ఈ రోజు నిమజ్జనం చేయనున్నారు..
వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో గందరగోళం నెలకొన్నట్టుగా తెలుస్తోంది.. ఓవైపు సెయిల్‌లో స్టీల్ ప్లాంట్ విలీనం అంటూ లీకులు వచ్చిన కొద్ది సేపటికే.. పిడుగులాంటి నిర్ణయం తీసుకుంది యాజమాన్యం.. ప్రైవేటీకరణ లేదని ప్రకటిస్తూనే ఉద్యోగులపై వేటు వేసింది.. తాజా నిర్ణయంతో స్టీల్ ప్లాంట్‌లో పనిచేసే నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఔట్ కానున్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి.. కేంద్రం ఏ చేయబోతోంది. ప్రైవేటీకరిస్తాం అని ఇప్పటికే చెప్పిన కేంద్రం.. ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిందా.. ప్రైవేటీకరణకు బదులుగా.. మరో ఆప్షన్‌ను ట్రై చేస్తోందా.. ఇప్పుడివే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్ మనుగడకు శాశ్వత పరిష్కారంపై కేంద్రం దృష్టిపెట్టింది.
తిరుమల లడ్డూ వివాదంపై ఏర్పాటైన సిట్.. రంగంలోకి దిగేసింది. ఇవాళ తిరుపతిలో విచారణ జరుపనుంది. దీంతో.. ఎవరిని ప్రశ్నిస్తారు.. ఎవరెవరిపై కేసులు నమోదు చేస్తారనే అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. తిరుమల శ్రీవారి ప్రసాదం.. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్టు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.