Papikondalu Tour: పాపికొండల పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అధికారులు.. దీంతో.. నాలుగు నెలల తర్వాత పాపికొండల పర్యటన తిరిగి ప్రారంభం కానుంది.. పాపికొండల పర్యటనలు పునః ప్రారంభించాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.. అందులో భాగంగానే ఎస్‌డీఆర్ఎఫ్ టీంతో మాక్ డ్రిల్ నిర్వహించారు.. ఈ సందర్భంగా రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ మాట్లాడుతూ.. పాపికొండల పర్యటనలు శనివారం నుండి మొదలుకానున్నాయని.. అందులో భాగంగానే పాపికొండల బోట్లను తనిఖీ చేసిన అనంతరం మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని వెల్లడించారు..
గోదావరి నదిపై బోటు ఏ విధంగా డ్రైవ్ చేయాలని.. అదేవిధంగా ప్రమాదవశాత్తు గోదావరిలో పర్యాటకులకు ప్రమాదం జరిగితే.. వారిని ఏ విధంగా రక్షించాలి అనే అంశంపై ఎస్‌డీఆర్ఎఫ్ బృందంతో మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని తెలిపారు రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ.. వాతావరణం సహకరిస్తే శనివారం నుంచే పాపికొండల పర్యటనలు మొదలవుతాయని పేర్కొన్నారు.. అయితే, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో.. నేటి నుండి ప్రారంభంకానున్నాయి పాపికొండలు విహారయాత్రలు.. నాలుగు నెలల విరామం తర్వాత పాపికొండలు విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టూరిజం శాఖ.. ఈ న్యూస్ తెలియడంతో.. విహారయాత్రకు బయలుదేరివెళ్తున్నారు పర్యాటకులు.. దేవీపట్నం మండలం పోశమ్మ గండి నుండి బయలుదేరనున్నాయి పర్యాటకుల బోట్లు.. దీంతో.. పర్యాటకులతో సందడిగా మారింది దేవీపట్నం మండలం పోశమ్మ గండి ప్రాంతం..