Papikondalu Tour: పాపికొండలు విహారయాత్ర ప్రారంభం.. బయల్దేరిన తొలి బోటు
- గోదావరి వరదలతో జులైలో నిలిపివేసిన పాపికొండలు టూర్..
- ఇవాళ్టి నుంచి తిరిగి ప్రారంభం..
- గండి పోశమ్మ ఆలయం వద్ద బోటింగ్ పాయింట్ నుంచి బయల్దేరిన తొలి బోటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Papikondalu Tour: పాపికొండలు విహారయాత్ర టూరిస్టులను ఎంతగానో కట్టిపడేస్తుంది.. ఈ ప్రదేశాన్ని శ్రీరాముడు మరియు సీతాదేవి వనవాస సమయంలో సందర్శించారని నమ్ముతారు. కొండలు, లోయ మరియు జలపాతాల వీక్షణను ఆస్వాదించడమే కాకుండా, పర్యాటకులు క్యాంపింగ్ మరియు ట్రెక్కింగ్ వంటి కార్యక్రమాలతో ఈ టూరు ఎంతో అనుభూతిని కలిగిస్తుంది.. అయితే, గోదావరి వరదలు కారణంగా జులైలో నిలిపివేసిన పాపికొండలు విహారయాత్ర.. ఇవాళ్టి నుంచి తిరిగి ప్రారంభమైంది. ఏపీ టూరిజం శాఖకు చెందిన ఒక బోటు.. ప్రైవేట్ ఆపరేటర్లకు సంబంధించిన మరో 14 బోట్లు అందుబాటులోకి వచ్చాయి.
Read Also: IND vs NZ: రెండో ఇన్సింగ్స్లో న్యూజిలాండ్ ఆలౌట్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?
Also Read
- Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
దేవీపట్నం మండలం గండి పోశమ్మ ఆలయం వద్ద ఉన్నర బోటింగ్ పాయింట్ నుంచి ఇవాళ ఒక టూరిస్ట్ బోట్ పర్యాటకులను తీసుకుని పాపికొండల పర్యటనకు బయల్దేరింది.. ప్రకృతి సోయగాలు కనువిందు చేసే పాపికొండలు వద్దకు తీసుకు వెళ్లేందుకు రాజమండ్రి నుంచి పెద్దలకు 1250 రూపాయలు… పదేళ్లలోపు చిన్నారులకు వెయ్యి రూపాయలు టికెట్ గా ఖరారు చేశారు. రాజమండ్రిలోని పర్యాటకశాఖ కార్యాలయం నుంచి ఉదయం 7:30 కు వాహనంలో గండి పోశమ్మ ఆలయం వద్దకు తీసుకెళ్తారు. ఉదయం 9 గంటలకు గోదావరిలో పర్యాటకుల బోటు ప్రారంభమై సాయంత్రం ఐదున్నరకు తిరిగి చేరుకుంటుంది. సుమారు 75 కిలోమీటర్ల మేర గోదావరిలో ప్రయాణం సాగనుంది. నిన్న పర్యాటక బోట్లకు ట్రైల్ రన్ నిర్వహించారు. అనుకోని ప్రమాదం జరిగితే ఎలా స్పందించాలో మాక్ డ్రిల్ నిర్వహించారు. బోటు సిబ్బందికి శిక్షణ ఇచ్చిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!