Andhra Pradesh: స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047 టాస్క్ ఫోర్స్ కమిటీ తొలి భేటీ.. 15 శాతం వృద్ధి రేటు టార్గెట్..
- స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047 టాస్క్ ఫోర్స్ కమిటీ తొలి భేటీ..
- 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు..
- అవకాశాల కల్పనతో సంపద సృష్టిస్తామన్న సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047పై పారిశ్రామిక వేత్తలతో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.. అవకాశాల కల్పనతో సంపద సృష్టిస్తామన్నారు.. విజన్-2047 లక్ష్యాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై పారిశ్రామిక దిగ్గజాలతో మేధోమథనం నిర్వహించారు సీఎం చంద్రబాబు.. రానున్న రోజుల్లో 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రభుత్వ ప్రణాళికలు అమలు చేసి ఫలితాలు సాధించాలని సూచించారు.. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 13.5 శాతం వృద్ధి రేటు సాధించాం.. ఇప్పుడు 15 శాతం వృద్ధి రేటు సాధిస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు..
Read Also: Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. ఇప్పటి వరకు ఎవరెన్నిసార్లు టైటిల్ గెలుచుకున్నారంటే
Also Read
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047పై సచివాలయంలో పారిశ్రామిక వేత్తలతో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది.. టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండగా.. కో ఛైర్మన్ గా టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ ఉన్నారు.. ఇక, సచివాలయంలో జరిగిన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, సీఐఐ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పారిశ్రామిక రంగ ప్రముఖులు హాజరయ్యారు.. అయితే, పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని టాటా గ్రూప్, ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. టాటా గ్రూప్ సంస్థల ఛైర్మన్ చంద్రశేఖరన్, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మధ్య జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు..
Today, I chaired the first meeting of the Taskforce on Economic Development for Swarna Andhra Pradesh@2047, alongside @TataCompanies Executive Chairman, Mr. N. Chandrasekaran. This Taskforce unites industry giants from diverse sectors to help shape a visionary blueprint for AP’s… pic.twitter.com/TeLRAfDfUS
— N Chandrababu Naidu (@ncbn) November 11, 2024
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు