Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వరుసగా పలువురు నేతలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు.. ఇప్పటికే పలువురు కీలక నేతలు, ప్రజాప్రతినిధులు.. టీడీపీ, జనసేన, బీజేపీ గూటికి చేరారు.. ఇక, ఈ రోజు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్షంలో పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు.. జనసేన కండువా కప్పుకున్నారు.. విజయవాడ సిటీ నుంచి పలువురు కార్పొరేటర్లు , జగ్గయ్య పేట, ధర్మవరం, అనంతపురం ప్రాంతాల నుండి వైసీపీకి గుడ్‌బై చెప్పి వచ్చిన నేతలు.. జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
Read Also: Bandi Sanjay: అందరినీ సమాన స్థాయికి తీసుకురావడానికి కృషి చేస్తాం..
ఇక, ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఏ మాత్రం ఆశ లేని పరిస్థితిలో రాజకీయాలకు వచ్చాం.. అధికారం ఉంటుందని, ఆశతో పార్టీ పెట్టలేదని స్పష్టం చేశారు. సిద్ధాంతాల కోసం పనిచేసే నాయకులంతా కలిసి, రాష్ట్రానికి అండగా నిలబడాలని పార్టీ పెట్టామన్న పవన్.. కష్టాల కొలిమిలో కలసి నడిచాం.. పార్టీని పూర్తిస్థాయిలో నిర్మించడానికి, దశాబ్ద కాలం పట్టిందన్నారు.. ఇప్పుడు ఏ పార్టీ నుండి మీరు వచ్చినా, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం కలిసి నడవాలని సూచించారు.. ఈ రోజు శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టామన్నారు.. రాష్ట్రంలో టీడీపీకి, కేంద్రంలో బీజేపీకి ఉన్న పాలన అనుభవానికి తోడు జనసేన రాజకీయ శక్తి చేదోడువాదడుగా ఉంటుందని పేర్కొన్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..