Ram Gopal Varma: ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్లు.. నేడు హైకోర్టులో విచారణ
- ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు దర్శకుడు ఆర్జీవీ..
- నేడు హైకోర్టులో ఆర్జీవీ పిటిషన్లపై విచారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Gopal Varma: వివాదాల సినీ దర్శకులు రామ్‌గోపాల్ వర్మ దాఖలు చేసిన ముందుస్తు బెయిల్ పిటిషన్లపై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది.. తనపై అనకాపల్లి, గుంటూరు జిల్లాల్లో నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్లు వేశారు వర్మ.. సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌పై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులతో ఆర్జీవీపై కేసులు నమోదు అయ్యాయి..
Read Also: CM Revanth Reddy: హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన.. షెడ్యూల్ ఇదే..
Also Read
- Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
- CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
- AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
ఇక, ఇదే వ్యవహారంలో ఆర్జీవీపై ప్రకాశం జిల్లా మద్దిపాడులో కేసు నమోదు అయ్యింది.. అయితే, ఆ కేసును క్వాష్ చేయాలని రామ్‌గోపాల్ వర్మ.. హైకోర్టును ఆశ్రయించినా ఊరట దక్కలేదు.. విచారణకు హాజరుకావాల్సిందేనని తేల్చిచెప్పింది హైకోర్టు.. కానీ, ఈ కేసులో మూడు రోజుల క్రితం పోలీసుల విచారణకు హాజరు కావాల్సిన ఆర్జీవీ డుమ్మా కొట్టాడు.. వారం రోజుల గడువు కోరారు.. దీంతో.. ఈ నెల 25న విచారణకు రావాలంటూ మరోసారి రామ్‌గోపాల్ వర్మకు నోటీసులు పంపించారు పోలీసులు.. అయితే, ఈ లోపుగానే హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఆర్జీవీ.. ఇక, ఈ వివాదం ఇక్కడితో అయిపోయిందుకోవడానికి వీలులేదు. ఆర్జీవీపై మరిన్ని ఫిర్యాదులు అందుతున్నాయి. కడప, అనకాపల్లిలో కొత్తగా కంప్లైంట్లు నమోదయ్యాయి. ఫిర్యాదుదారుల నుంచి కంప్లైంట్ రావడంతో విచారణకు రావాలంటూ వర్మకు పోలీసులు నోటీసులు పంపించారు. అయితే.. తనకు వారం రోజులపాటు సమయం కావాలంటూ తన తరఫున న్యాయవాదులతో పోలీసులను రిక్వెస్ట్ చేశారు ఆర్జీవీ.. ఇక, తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగించే అవకాశం కూడా ఉందని.. ముందస్తు బెయిల్ పిటిషన్‌లో ఆర్జీవీ పేర్కొన్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!