Ram Gopal Varma: ఆర్జీవీ పిటిషన్లపై విచారణ వాయిదా.. అన్ని కలిపి ఒకేసారి..!
- ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ..
- తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా..
- అన్ని బెయిల్ పిటిషన్లు ఒకేసారి విచారిస్తామన్న కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Gopal Varma: సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ దాఖలు చేసిన రెండు ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్ తో కలిపి వచ్చే మంగళ వారం విచారణ చేస్తామని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది.. అయితే, ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాల్లో తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు దర్శకుడు వర్మ.. అయితే, గురువారం రోజు కూడా వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపి తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసిన విషయం విదితమే.. దీంతో.. ఆర్జీవీ దాఖలు చేసిన అన్ని బెయిల్ పిటిషన్లపై విచారణ మంగళవారం చేపట్టనుంది ఏపీ హైకోర్టు..
Read Also: Gold Rate Today: వరుసగా ఐదవ రోజు షాకిచ్చిన బంగారం ధర.. నేడు రూ.870 పెరిగింది!
Also Read
- AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
కాగా, తనపై అనకాపల్లి, గుంటూరు జిల్లాల్లో నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని తాజాగా హైకోర్టులో ఆర్జీవీ పిటిషన్లు దాఖలు చేసిన విషయం విదితమే.. సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌పై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులతో ఆర్జీవీపై కేసులు నమోదు అయ్యాయి.. ఇక, ఇదే వ్యవహారంలో ఆర్జీవీపై ప్రకాశం జిల్లా మద్దిపాడులో కేసు నమోదు అయ్యింది.. అయితే, ఆ కేసును క్వాష్ చేయాలని రామ్‌గోపాల్ వర్మ.. హైకోర్టును ఆశ్రయించినా ఊరట దక్కలేదు.. విచారణకు హాజరుకావాల్సిందేనని తేల్చిచెప్పింది హైకోర్టు.. కానీ, ఈ కేసులో మూడు రోజుల క్రితం పోలీసుల విచారణకు హాజరు కావాల్సిన ఆర్జీవీ డుమ్మా కొట్టాడు.. వారం రోజుల గడువు కోరారు.. దీంతో.. ఈ నెల 25న విచారణకు రావాలంటూ మరోసారి రామ్‌గోపాల్ వర్మకు నోటీసులు పంపించారు పోలీసులు.. అయితే, ఈ లోపుగానే హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఆర్జీవీ.. ఇక, ఈ వివాదం ఇక్కడితో అయిపోయిందుకోవడానికి వీలులేదు. ఆర్జీవీపై మరిన్ని ఫిర్యాదులు అందుతున్నాయి. కడప, అనకాపల్లిలో కొత్తగా కంప్లైంట్లు నమోదయ్యాయి. ఫిర్యాదుదారుల నుంచి కంప్లైంట్ రావడంతో విచారణకు రావాలంటూ వర్మకు పోలీసులు నోటీసులు పంపించారు. అయితే.. తనకు వారం రోజులపాటు సమయం కావాలంటూ తన తరఫున న్యాయవాదులతో పోలీసులను రిక్వెస్ట్ చేశారు ఆర్జీవీ..
తాజావార్తలు
-
Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
-
Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
-
Ather Konarc S: ఫుల్ ఛార్జ్‌తో 161KM రేంజ్.. 3.5kWh బ్యాటరీ, రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
ట్రెండింగ్
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!