PAC Chairman Election: పీఏసీ ఎన్నిక.. చైర్మన్‌గా జనసేన ఎమ్మెల్యే..!
- నేడు అసెంబ్లీ కమిటీ హాల్లో పీఏసీ సభ్యత్వాలకు ఓటింగ్..
- సభ జరిగే సమయంలోనే బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్..
- టీడీపీ తరపున నామినేషన్లు వేసిన ఏడుగురు సభ్యలు..
- జనసేన తరపున పులవర్తి రామాంజనేయులు నామినేషన్..
- బీజేపీ తరపున నామినేషన్ వేసిన విష్ణు కుమార్‌రాజు..
- వైసీపీ తరపున నామినేషన్ వేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..
- పీఏసీ చైర్మన్‌గా జనసేన ఎమ్మెల్యే పులవర్తి ఎన్నికయ్యే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PAC Chairman Election: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పీఏసీ చైర్మన్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న వైసీపీ కూడా… పీఏసీ చైర్మన్ పదవికి నామినేషన్ వేయడంతో… ఆసక్తి నెలకొంది. ఇవాళ అసెంబ్లీ కమిటీ హాల్లో పీఏసీ సభ్యత్వాలకు ఓటింగ్ జరుగుతుంది. సభ జరిగే సమయంలోనే బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహిస్తారు. టీడీపీ తరపున ఏడుగురు సభ్యులు నామినేషన్లు వేశారు. జనసేన తరపున పులవర్తి రామాంజనేయులు.. బీజేపీ తరపున విష్ణుకుమార్‌రాజు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే… పీఏసీ ఛైర్మన్‌గా జనసేన ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు ఎన్నికయ్యే అవకాశం ఉంది.
Read Also: Maoist Attack: వాజేడులో దారుణం.. ఇద్దరిని గొడ్డలితో నరికి చంపిన మావోలు..
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడం అనవాయితీగా వస్తోంది. వైసీపీ హయాంలో పీఏసీ ఛైర్మన్‌గా పయ్యావుల కేశవ్ పనిచేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో… పీఏసీ ఛైర్మన్ పదవికి తమకు ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. పీఏసీ చైర్మన్ పదవికి వైసీపీ తరపున ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ కూడా వేశారు. అయితే… ఆ పదవికి వైసీపీ దక్కే అవకాశం లేదు. పీఏసీ సభ్యుడిగా ఎన్నిక కావాలన్నా, చైర్మన్ కావాలన్నా… 20 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. కానీ… అసెంబ్లీలో వైసీపీకి సంఖ్యా బలం లేదు. 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటంతో… పీఏసీ చైర్మన్ పదవి దక్కదని కూటమి నేతలు చెప్తున్నారు. దీంతో.. జనసేనకు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..