ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఇవాళ జరుగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరుగనుంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా దీపావళి నుంచి మహిళలకు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ పథకం విధి విధానాలకు ఆమోద ముద్ర వేయనుంది. కేంద్రం అమలు చేస్తున్న ఉజ్వల పథకం లబ్ధిదారులు, పథకానికి అర్హుల ఎంపిక, ఆర్థిక భారం వంటి అంశాల పైన చర్చించి అర్హుల ఎంపికపైన తుది నిర్ణయం తీసుకోనుంది.
* రష్యా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ.. బ్రిక్స్ సమ్మి్ట్లో భాగంగా నేడు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు.. ఐదేళ్ల తర్వాత తొలిసారిగా బ్రిక్స్ సమ్మిట్‌లో జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్న ప్రధాని మోడీ. * నేడు వయనాడ్ లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్న ప్రియాంకా గాంధీ.. హాజరుకానున్న మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, రేవంత్‌రెడ్డి తదితర నేతలు.. * అమరావతి: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. […]
పదిహేను రోజుల్లో మేం ఒక డ్రోన్ పాలసీని తెస్తామని ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. అమరావతిలో జరుగుతోన్న దేశంలోనే అతిపెద్ద డ్రోన్ సమ్మిట్ 2024ను కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుతో కలిసి ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 15 రోజుల్లోనే డ్రోన్ పాలసీ తీసుకొస్తాం.. ఓర్వకల్లు, కర్నూలు ప్రాంతంలో ఒక డ్రోన్ తయారీ కేంద్రంగా తీసుకురావాలన్నారు.. అన్ని ప్రధాన నగరాలకు కర్నూలు-ఓర్వకల్లు హబ్ దగ్గరలో ఉంటుందన్నారు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మెటాతో కీలక ఒప్పందం చేసుకుంది.. సర్టిఫికెట్ల కష్టాలకు టాటా చేబుతూ.. వాట్సాప్‌లోనే సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా ముందడుగు వేస్తోంది సర్కార్..
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మానవత్వం చాటుకున్నారు. మంత్రి రవి కుమార్.. చిలకలూరిపేటలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి ఒంగోలు వెళ్తున్నారు.. ఒంగోలులో జరిగే జెడ్పీ సమావేశానికి మంత్రి గొట్టిపాటి వెళ్తున్న సమయంలో త్రోవగుంట ఫ్లై ఓవర్ పై ఓ ప్రమాదం జరిగింది.
దేశంలోనే అతిపెద్ద డ్రోన్ సమ్మిట్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభం అయ్యింది.. మంగళగిరిలో డ్రోన్-2024 సమ్మిట్‌ను కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడుతో కలిసి ప్రారంభించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీలో భారత్ దూసుకుపోతోందన్నారు..
కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. తరగతులు ప్రారంభమై వారం గడవక ముందే జూనియర్లకు ర్యాగింగ్ వేధింపులు మొదలయ్యాయి. మీసాలు, గడ్డాలు తీసేసుకోవాలని సీనియర్ల హుకుం చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క
బద్వేల్ పట్టణంలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన ఇంటర్ బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రేపు కడప జిల్లాలో పర్యటించనున్న ఆయన.. బద్వేల్ పట్టణంలో హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చనున్నారు..
బెజవాడలో మందుబాబులు హల్చల్ చేశారు.. మద్యం తాగి కారు నడిపి విధ్వంసం సృష్టించారు.. భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో బబ్బులు గ్రౌండ్ దగ్గరకు కిట్టు, అరుణ్ మద్యం సేవించి కారు నడుపుతూ వచ్చాడు.. మద్యం మత్తులో కారు ఎలా నడుపుతున్నాడో కూడా తెలియని పరిస్థితిలో.. దంపతులను ఢీకొట్టాడు.. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యే ప్రయత్నం చేశారు.. ఇక, అడ్డుకున్న పోలీసులతో.. వాగ్వాదానికి దిగారు.