APPSC: వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన తేదీలను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్‌కమిషన్ (ఏపీపీఎస్సీ).. 8 పోటీ పరీక్షలకు సంబంధించి.. తేదీలను వెల్లడించారు.. కంప్యూటర్ బేస్డ్ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది ఏపీపీఎస్సీ.. ఇక, ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన పరీక్షల తేదీలు.. ఆ పరీక్షల వివరాలను ఓసారి గమనిస్తే..
Read Also: PM Modi: జిన్‌పింగ్ గుజరాత్ పర్యటన వెనక చరిత్ర.. వెల్లడించిన ప్రధాని మోడీ..
* అసిస్టెంట్ డైరెక్టర్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్ పోస్టులకు.. ఏప్రిల్ 28న టౌన్ ప్లానింగ్ 1. ఏప్రిల్ 29న టౌన్ ప్లానింగ్ 2 పరీక్ష..
* మెడికల్ అండ్ హెల్త్ లైబ్రేరియన్ పోస్టులకు ఏప్రిల్ 27వ తేదీన సబ్జెక్టు పేపర్.. ఏప్రిల్ 28న జనరల్ స్టడీస్..
* అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు.. ఏప్రిల్ 28న జనరల్ స్టడీస్.. ఏప్రిల్ 30న సబ్జెక్టు పేపర్ 1 అండ్ 2..
* అసిస్టెంట్ డైరెక్టర్.. వెల్ఫేర్ అండ్ డీజేబుల్డ్ ట్రాన్స్ జెండర్ పోస్టులకు ఏప్రిల్ 27న సబ్జెక్ట్ పేపర్ 1.. ఏప్రిల్ 28న పేపర్ 2..
* ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీసు అసిస్టెంట్ కెమిస్ట్ పోస్టుకు ఏప్రిల్ 28, 29 తేదీల్లో పరీక్షలు
* ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ సర్వీస్ లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్టుకు ఏప్రిల్ 28న పరీక్షలు
* ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబర్డినేట్ సర్వీస్ లో ఏఎస్ఓలకు ఏప్రిల్ 28, 29 తేదీల్లో పరీక్షలు
* ఏపీ ఫిషరీ సర్వీస్ లో ఫిసరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టుకు ఏప్రిల్ 28, 30 తేదీల్లో పరీక్షలు