నేను నచ్చకపోతే ఐదేళ్లు తర్వాత వదిలేయండి.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
నేను నచ్చకపోతే ఐదేళ్లు తర్వాత నన్ను వదిలేయండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నా నియోజకవర్గాన్ని కాపాడుకోకపోతే నాకు డిప్యూటీ సీఎం పదవి ఎందుకు? అని ప్రశ్నించారు.. నేను నచ్చకపోతే ఐదేళ్లు తర్వాత నన్ను వదిలేయండి కామెంట్ చేసిన ఆయన.. అయితే, 15 ఏళ్లు తక్కువ కాకుండా కూటమి ఉండాలని ఆకాక్షించారు.. నా లాంటి వాడు రోడ్డు మీదకి వస్తే నిద్రాహారాలు మానేస్తారు.. ఆడ పిల్లలను వేధించడం మగతనం కాదు.. పిచ్చ పిచ్చ వేషాలు వేస్తే తొక్కి నారా తీస్తాను.. పిఠాపురంలో ఈవ్ టీజింగ్ కనిపించకూడదు అని హెచ్చరించారు. వీఐపీ ట్రీట్ మెంట్ ఆగి కామన్ మెన్ ట్రీట్మెంట్ మొదలు అవ్వాలి.. ఆరు నెలలు హాని మూన్ పీరియడ్ ఆగిపోయింది.. పిఠాపురం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు మొదలు పెడతాను అన్నారు పవన్ కల్యాణ్.. గుండాలు చంపేస్తాను అంటారు.. కానీ, ఆకు రౌడీలకు నేను భయపడను.. మందు పాతరలు పెట్టిన పరవాలేదు అని అడవులకి వెళ్లాను.. తెగించాను అంటే పిచ్చగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.. ప్రతి జిల్లాకి వస్తాను.. అది పిఠాపురం నుంచే మొదలు పెడతాను అని ప్రకటించారు.. విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఇలానే ఉంటుందన్నారు.. మొత్తం అవినీతి అయిపోయింది.. తగ్గించే ప్రయత్నం జరుగుతుందన్నారు.. మొత్తం నిర్మూలించలేం.. అయితే, ప్రేమ అయినా.. గొడవ అయినా సిద్ధమే అని వెల్లడించారు.. అయితే, తిరుపతి ఘటన నేపథ్యంలో.. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడానికి కూడా మనస్సు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరోవైపు పాల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ప్రముఖపాత్ర వహించాలి అన్న పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..
కోడిపందాలకు సై.. ఏర్పాట్లలో పందెం రాయుళ్లు..!
పల్లెలకు అప్పుడే సంక్రాంతి శోభ వచ్చేస్తోంది.. సెలవులు రావడంతో.. ఉన్న పట్టణాన్ని వదిలి.. సొంత ఊళ్లకు పయనం అవుతున్నారు.. మరోవైపు.. పందాల పండుగకు రంగం సిద్దమవుతుంది. నెలల తరబడి చంటిబిడ్డల్లా సాకిన పందెం పుంజులను బరిలో దించేందుకు ముహూర్తం దగ్గర పడటంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి అతిధులు ఇప్పటికే గ్రామాలకు చేరుకుంటున్నారు.. వీరితో పాటు పందాలపై మోజున్న జూదగాళ్ళంతా గోదావరి బాట పట్టారు. పెద్ద మొత్తంలో పందేలు కాసేందుకు సై అంటే సై అంటున్నారు.. ఇదే సమయంలో కూటమి నేతల మద్య పందాల నిర్వాహణ పోటి పెంచుతోంది. దేశవిదేశాల నుంచి అతిధులు తరలివచ్చే సమయం కావడంతో పందెం బరుల నిర్వాహణ ఇపుడు ప్రెస్టీజియస్‌గా మారిపోయింది. దీంతో ఒకరిని మించి మరోకరు పందాల నిర్వాహణపై ఫోకస్ పెట్టారు. గతంలో చిన్న చిన్న బరులే ఉండే ప్రాంతంలో ఇపుడు పెద్దపెద్ద స్టేడియాలను తలపించే విధంగా రంగం సిద్దమవుతుంది. గతంలో కంటే ఇపుడు పందాల జోరు సోషల్ మీడియాలో సైతం హల్ చల్ చేయడంతో గోదావరిజిల్లాలకు పందెం రాయుళ్ళ రాక పెరగబోతున్నట్టు అంచనా.. గతంలో కేవలం జిల్లాకు సంబందించిన వారు.. సొంతూళ్ళకు వచ్చిన వారే ఎక్కువ పందాలు ఆడటానికి చూడటానికి వచ్చేవారు.. ఇపుడు సీన్ మారుతోంది. ప్రధాన ప్రాంతాల్లో రెండు మూడు బరులు నిర్వహించేందుకు సన్నా హాలు చేస్తున్నారు. పందెం రాయుళ్లను ఆకర్షించేందుకు భారీ ఎల్.ఈ.డి స్క్రీన్లు, ప్రత్యేక ఆఫర్లతో పాటు పెద్ద ఎత్తున వినోద కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే పందెంరాయుళ్ళ కోసం ఇప్పటికే ఈ నిర్వాహకులు రూమ్‌లన్ని బుక్ చేసేశారు. బరిలతోపాటు వేదికలు, కార్ పార్కింగ్‌కు కూడా ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాయుకుల మద్య పోటితో పెద్ద బరులు సిద్దమవుతున్న వేళ చిన్న బరులకు పందేంరాయుళ్లు వస్తారా లేదా అన్న సందేహం నిర్వాహకుల్లో మొదలయ్యాయి. ఇప్పటికే పందాల నిర్వాహణకు స్థానిక నేతలకు ఎంతో కొంత ముట్టజెప్పిన చోటామోటా నిర్వాహకులుసైతం భారీ ఏర్పాట్లపై దృష్టిపెట్టారు.
మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ప్రకటన..
తెలంగాణలో త్వరలో జరగనున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అంజిరెడ్డిని నియమించింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కొమురయ్యను నియమించారు. అలాగే.. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి సరోత్తం రెడ్డిని నియమించింది తెలంగాణ బీజేపీ. త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం అప్రమత్తమైంది. కాగా.. ఓటు హక్కు కోసం మొత్తం 28వేల మందికి పైగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు దరఖాస్తు చేసుకోగా, పరిశీలన అనంతరం మొత్తం 22,554 మంది ఓటర్లతో ముసాయిదా ఓటర్ల జాబితాను ఫైనల్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అవమానించడం కరెక్ట్ కాదు..
కేటీఆర్, బండి సంజయ్‌లపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాను ఏ విధంగా గౌరవించాలో కేటీఆర్ నేర్చుకోవాలని అన్నారు. బండి సంజయ్ కేంద్రమంత్రి హోదాలో ఉండి ఇన్వెస్ట్‌గేట్ ఏజెన్సీని అవమానిస్తున్నాడని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అవమానించడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రూపొందించిన ధరణిలో ఉన్న సమస్యలకు పరిష్కారం కల్పించేందుకు ప్రభుత్వం భూభారతిని తీసుకొచ్చారని అన్నారు. సంక్రాంతి కానుకగా భూభారతిని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశామని జీవన్ రెడ్డి తెలిపారు. భూభారతి చట్టాన్ని ఆమోదించినందుకు గవర్నర్‌కు ధన్యవాధాలు చెప్పారు. ధరణి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. భూభారతిలో ఆపిల్ చేసుకొనే అవకాశం ఉంది.. సాగు కాలం కూడా పెట్టారని అన్నారు. రెవిన్యూ కోర్టు ఏర్పాటు చేశారని తెలిపారు. గత ప్రభుత్వం అమలు చేసిన ధరణిలో ఇవి ఏవి లేవని అన్నారు. గత ప్రభుత్వంలో వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థ లేకుండా పోయింది.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థ వస్తుందని పేర్కొన్నారు.
దారుణం.. కుక్కను కారుతో ఢీకొట్టి చంపిన డిజిటల్ కంటెంట్ క్రియేటర్
రోజురోజుకు మనుషుల్లో మానవత్వం పోతుంది. మనిషి.. మనిషిగా ఉండడం లేదు. జాలి, దయ ఉండాల్సింది పోయి.. క్రూరత్వం పెరిగిపోతోంది. చదువులేనివాడు మూర్ఖంగా ప్రవర్తించాడంటే బుద్ధిలేనివాడు అనుకోవచ్చు. కానీ చదువుకున్నోళ్లు పది మందికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి.. దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఇదంతా ఎందుకంటారా? బెంగళూరులో డిజిటల్ కంటెంట్ క్రియేటర్.. అత్యంత నీచంగా ప్రవర్తించాడు. రోడ్డుపై సేదదీరుతున్న మూగజీవంపైకి కారు ఎక్కించి హతమార్చాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెంగళూరులోని జేనీ నగర్‌కు చెందిన 35 ఏళ్ల డిజిటల్ కంటెంట్ క్రియేటర్ ఎస్‌యూవీ కారుతో వీధి కుక్కను ఢీకొట్టి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని పారవేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేసి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీలో ఉన్న కారు ఓనర్‌ను గుర్తించారు. నిందితుడు జేపీనగర్‌లోని శేఖర్ లేఅవుట్ నివాసి అయిన మంజునాథ్ వెంకటేష్‌గా గుర్తించారు. జంతు హక్కుల కార్యకర్త ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీడియోలో మంజునాథ్ ఉద్దేశ పూర్వకంగా కుక్కపైకి దూసుకెళ్లినట్లు స్పష్టంగా కనిపించింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జిన్‌పింగ్ గుజరాత్ పర్యటన వెనక చరిత్ర.. వెల్లడించిన ప్రధాని మోడీ..
ప్రధాని నరేంద్రమోడీ, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో తన తొలి పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోడీ కీలక విషయాలను వెల్లడించారు. 2017లో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ తన సొంత ఊరు గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో పర్యటించడం వెనక ఉన్న చరిత్రను వెల్లడించారు. భారత చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉన్న చైనా పండితుడు ‘‘హుయాత్సాంగ్’’తో ఉన్న సంబంధాన్ని తెలిపారు. 2014లో ప్రధానిగా తాను పదవీ స్వీకరించిన తర్వాత జిన్‌పింగ్‌తో మర్యాదపూర్వకం సమావేశం జరిగింది. ‘‘నేను 2014లో ప్రధానమంత్రి అయినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా మర్యాదపూర్వకంగా కలిశారు, అందులో ఆయన భారతదేశానికి రావాలనుకుంటున్నట్లు చెప్పారు. నేను ‘మీకు స్వాగతం, మీరు తప్పక సందర్శించాలి’ అని అన్నాను’’ ఆయన గుజరాత్‌లోని తన సొంత ఊరు వాద్‌నగర్ సందర్శించాలనుకుంటున్నట్లు చెప్పారని ప్రధాని మోడీ ఈ రోజు తెలిపారు.
“పుతిన్ నన్ను కలవాలనుకుంటున్నారు”.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనను కలవాలని అనుకుంటున్నారని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తమ ఇద్దరి మధ్య సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రంప్ గురువారం తెలిపారు. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రారంభమైంది. అయితే, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పుతానని పలుమార్లు ట్రంప్ అన్నారు. ఈ నేపథ్యంలోనే మరి కొన్ని రోజుల్లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ సమయంలోనే పుతిన్‌లో మీటింగ్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పుతిన్ నన్ను కలవాలని అనునకుంటున్నాడు. మేము ఏర్పాట్లు చేస్తున్నాము.’’ అని ట్రంప్ ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లోని తన మార్-ఏ-లాగో రిసార్ట్‌లో రిపబ్లికన్ గవర్నర్లతో జరిగిన సమావేశంలో అన్నారు. మనం ఈ యుద్ధాన్ని ముగించాలని వ్యాఖ్యానించాడు.
మతిపోగొట్టే ఫీచర్లతో షావోమీ కొత్త ప్యాడ్ 7.. ధర ఎంతంటే?
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ షావోమీ మార్కెట్ లో తన సత్తా చాటుతోంది. ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ ఫీచర్లతో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ను రూపొందిస్తూ మార్కెట్ లోకి రిలీజ్ చేస్తుంది. దీంతో షావోమీ ఉత్పత్తులకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతోంది. ఇప్పుడు మరో కొత్త ప్యాడ్ ను లాంఛ్ చేసింది. మతిపోగొట్టే ఫీచర్లతో షావోమీ ప్యాడ్ 7 ను నేడు దేశీయ మార్కెట్ లోకి విడుదల చేసింది. ఏఐ ఫీచర్లు, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ తో రూపొందించిన ఈ న్యూ ప్యాడ్ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. మరి షావోమీ ప్యాడ్ 7 ధర ఎంత? ఫీచర్లు తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. షావోమీ ప్యాడ్ 7 ఫీచర్ల విషయానికి వస్తే.. 11.2 అంగుళాల LCD డిస్ల్పేతో వస్తుంది. 3.2K రిజల్యూషన్ తో వస్తుంది. ప్యాడ్ కు బ్యాక్ సైడ్ 13MP, సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అందించారు. ఇందులో స్నాప్ డ్రాగన్ 7+ జన్ 3 ప్రాసెసర్ అమర్చారు. ఏఐ రైటింగ్, సబ్ టైటిల్స్, ఏఐ క్రియేషన్ వంటి ఏఐ ఫీచర్లు ఈ ప్యాడ్ లో అందించారు. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది. ఈ కొత్త ప్యాడ్ లో 8,850 mAh బ్యాటరీని అందించారు. 45w ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.
అనుష్క ‘ఘాటీ’ మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్న రానా ?
అనుష్క శెట్టి తన ముద్దు పేరు స్వీటి. ఈ పేరుతో పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. కెరీర్ మొదట్లో గ్లామర్ డాల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. అరుంధతి సినిమా తర్వాత తను పంథా మార్చుకుంది. ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో ‘ఘాటి’ అనే సినిమా చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ చిత్రం ‘వేదం’ తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై అనుష్క నాలుగో సినిమా చేస్తుంది. అనుష్క బర్త్ డే సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ అదిరిపోయిందనే చెప్పాలి. ఇందులో అనుష్క పాత్ర స్టన్నింగ్ అండ్ రూత్ లెస్ అవతార్‌ను ప్రజెంట్ చేసింది. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇప్పటికే దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైంది. ఇక వచ్చే షెడ్యూల్ లో ఈ సినిమా క్లైమాక్స్ ను షూట్ చేయడానికి సన్నాహాలు చేసున్నారు దర్శకుడు క్రిష్. ఈ క్లైమాక్స్ షూట్ ను జనవరి చివరలో తీసే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం అనుష్క మలయాళంలో ఓ సినిమా చేస్తుంది. ఆ సినిమాతో పాటు ఘాటీ సినిమాలో మాత్రమే అనుష్క నటిస్తోంది. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ తో అంచనాలు పెంచేశారు. అనుష్క లోని మాస్ యాంగిల్ ని మరోసారి ఆవిష్కరించనున్నారు డైరెక్టర్ క్రిష్.
మరోసారి జతకట్టనున్న సీతారామం జంట.. ఈ సారి వేరే లెవల్
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి తనయుడు ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. దుల్కర్ సల్మాన్ కి తెలుగు ఇండస్ట్రీ బాగా అచ్చివచ్చింది. తెలుగులో తను సినిమా చేశాడంతే కచ్చితంగా హిట్టే అన్న సెంటిమెంట్ ఏర్పడింది. మహానటి, సీతారామం తర్వాత గతేడాది విడుదల అయిన లక్కీ భాస్కర్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. చిన్నగా తెలుగులో తన మార్కెట్ పెంచుకుంటూ ఇక్కడ స్టార్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు దుల్కర్ సల్మాన్. ప్రజెంట్ దుల్కర్ సల్మాన్ పవన్ సాధినేని దర్శకత్వంలో ఆకాశంలో ఒక తార సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ సాయి పల్లవిను తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఐతే దుల్కర్ తో మృణాల్ సూపర్ హిట్ జోడీ అనిపించుకుంది. సీతారామం సినిమా కథ కథనాలతో పాటు దుల్కర్, మృణాల్ జంట ఆకట్టుకుంది. అందుకే మళ్లీ ఆ కాంబోలో ఒక సినిమా చూడాలని అభిమానులు కోరుతున్నారు. మృణాల్ కూడా తెలుగులో మూడు సినిమాలు చేయగా రెండు సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాయి. ప్రస్తుతం ముద్దుగుమ్మ అడివి శేష్ తో డెకాయిట్ అనే సినిమా చేస్తుంది. ఐతే దుల్కర్ సల్మాన్, మృణాల్ కలిసి నటిస్తే చూడాలని వారి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.