Makara Sankranti Brahmotsavam: శ్రీశైలంలో రేపటితో ముగియనున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.. నేటి విశేష కార్యక్రమాలు ఇవే..
- రేపటితో శ్రీశైలంలో ముగియనున్న మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు..
- నేడు శ్రీశైలంలో 6వ రోజు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Makara Sankranti Brahmotsavam: శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల వైభవంగా జరుగుతున్నాయి.. బుధవారం ఐదోవరోజు శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి రావణవాహనాదీశులై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరిమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుండి అర్చకులు వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో రావణవాహనంలో ఆవహింపజేసి అర్చకస్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విద్యుత్ దీప కాంతుల నడుమ ప్రధాన ఆలయ రాజగోపురం గుండా రావణవాహనాదీశులైన శ్రీస్వామి అమ్మవార్లను ఊరేగింపుగా బాజా బజంత్రీల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవంలో విహరించారు..
Read Also: CM Revanth Reddy: తెలంగాణకు నీటి కేటాయింపులు విషయంలో బలమైన వాదనలు వినిపించాలి..
Also Read
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
ఇక, రేపటితో శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగియనున్నారు.. నేడు శ్రీశైలంలో 6వ రోజు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో విశేష కార్యక్రమాలు జరగనున్నాయి.. యాగశాలలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల పూర్ణాహుతి, త్రిశూలస్నానం నిర్వహించనున్నారు.. సాయంత్రం సద్యసం, నాగవల్లి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలికిన ధ్వజపటం ధ్వజవరోహణ నిర్వహిస్తారు.. కాగా, శ్రీశైలంలో వైభవంగా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి.. మరోవైపు, శ్రీశైలం ఆలయంలో జరిగే పూజలపై అర్చకులకు ఆలయ ఈవో శ్రీనివాసరావు మోమో ఇచ్చారు.. ఆలయంలో నిత్యపూజ కైంకర్యాలు, ఉత్సవాలలో ఏర్పాట్లపై వివరణ కోరుతూ వైదిక సిబ్బందికి మెమో ఈవో శ్రీనివాసరావు మోమో ఇచ్చారు. ఇటీవల జరిగిన అరుద్రోత్సవం రోజున ఆలయంలో ఏకాంత జరిగే పూజలలో హారతికి ఈవోను అంతరాలయం నుండి హారతి దర్శనానికి అర్చకులు అనుమతించకపోవడంతో ఆలయంలో జరిగే పూజలపై వివరణ కోరారు. దీనిపై అర్చకులు ఈవోను కలసి వివరంగా చెప్పారు. ఎంకాంత జరిగే సేవలలో అర్చకులు తప్ప ఎవరూ రాకూడదని ఏకాంత పూజలకు అర్చకులు మినహా ఇతరులు వెళ్లడం మంచిది కాదని ఈవోకు అర్చకులు తెలియజేసారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!