* ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ ఉదయం 10.30 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..
* నేడు కూడా ఢిల్లీలోనే సీఎం రేవంత్‌రెడ్డి.. కుమారస్వామి సహా పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న రేవంత్.. ఇవాళ రాత్రి ఢిల్లీ నుంచి సింగపూర్‌కు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
* హైదరాబాద్: నేడు ఈవీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్.. ఉదయం 10.30 గంటలకు ఈడీ ఎదుట హాజరుకానున్న కేటీఆర్.. ఫార్ములా-ఈ కేసులో ఇప్పటికే నోటీసులు జారీ చేసిన ఈడీ.. ఇప్పటికే అరవింద్‌కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిలను ప్రశ్నించిన ఈడీ అధికారులు
* ఢిల్లీలో రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు.. నేడు, రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం.. ఈ నెల 18 వరకు నామినేషన్ల పరిశీలన.. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 20 వరకు గడువు
* వరంగల్: నేటి నుండి వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో క్రయవిక్రయాలు.. సంక్రాంతి పండగ నేపథ్యంలో ఐదు రోజుల సెలవు అనంతరం నేటి నుంచి పునః ప్రారంభంకానున్న ఏనుమాముల వ్యవసాయ మార్కెట్.. రైతులు తమ పంట సరుకులను మార్కెట్ కు తీసుకువచ్చి అమ్మకాలు జరుపుకోవచ్చని సూచిస్తున్న అధికారులు..
* ప్రకాశం : మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి టంగుటూరు మండలం తూర్పు నాయుదుపాలెం లోని క్యాంప్ కార్యాలయంలో ఉంటారు..
* మంత్రి గొట్టిపాటి రవికుమార్ చిలకలూరిపేట లోని ఆయన నివాసంలో ఉంటారు..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ నెల్లూరులో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నేడు ఏలూరు జిల్లా అభివృద్ధిపై ఇంఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష.. సమావేశంలో పాల్గొననున్న మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జిల్లా అధికారులు
* తిరుమల: శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనం.. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ చేస్తున్న టీటీడీ.. ఇవాళ్టితో దర్శన టోకెన్లు జారి పూర్తి అయ్యే అవకాశం.. 19వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్లు జారి చేస్తున్న టీటీడీ
* శ్రీ సత్యసాయి : హిందూపురం శ్రీ పేట వెంకటరమణ స్వామి దేవాలయంలో స్వామివారి కల్యాణోత్సవం
* అనంతపురం : గుత్తి మండలం తొండపాడు బోలికొండ రంగనాథ స్వామి ఆలయంలో టెంకాయల బహిరంగ వేలం పాట.
* నంద్యాల: బనగానపల్లెలో ఆధునీకరించిన షాదీఖానాను నేడు ప్రారంభించనున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
* నంద్యాల: నేడు శ్రీశైలంలో 6వరోజు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.. యాగశాలలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల పూర్ణాహుతి, త్రిశూలస్నానం.. సాయంత్రం సద్యసం, నాగవల్లి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలికిన ధ్వజపటం ధ్వజవరోహణ.. రేపటితో శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగింపు.