ఏపీపీఎస్సీ.. గ్రూప్-2 మెయిన్స్ ను రీషెడ్యూల్ చేస్తూ ఈ రోజు ఓ ప్రకటన విడుదల చేసింది.. పాత షెడ్యూల్ ప్రకారం 2025 జనవరి 5వ తేదీన గ్రూప్ -2 మెయిన్స్ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. 2025 ఫిబ్రవరి 23వ తేదీకి గ్రూప్ -2 మెయిన్స్ వాయిదా వేసినట్టు ప్రకటించింది ఏపీపీఎస్సీ.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను http://psc.ap.gov.in సందర్శించాలని పేర్కొంది ఏపీపీఎస్సీ..
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా.. ఇప్పుడు ప్రముఖ సంస్థ రిలయన్స్ ఏపీలో భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది.. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - రిలయన్స్ మధ్య ఒప్పందం కుదిరింది.. ఆంధ్రప్రదేశ్ లో రూ.65 వేల కోట్ల భారీ పెట్టుబడులపై రిలయన్స్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది..
హైదరాబాద్ వేదికగా భక్తి టీవీ కోటి దీపోత్సవం అంగరంగవైభవంగా సాగుతోంది.. ఇప్పటికే మూడు రోజుల కార్యక్రమాలు దిగ్విజయంగా సాగగా.. నాల్గో రోజు విశేష కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.. కార్తిక మాసంలో ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.. ఇక, ఈ రోజు అలంపురం జోగులాంబ కల్యాణం కన్నులపండుగగా సాగనుంది..
కూటమి శాసన సభాపక్ష సమావేశం ముగిసింది.. అయితే, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసన సభాపక్ష భేటీలో ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. 150 రోజుల పాలనలో చేసిన అన్ని అంశాలపై చర్చ సాగింది.. మంత్రులు.. ఎమ్మెల్యేలకు అన్ని విషయాలలో సహకరించాలని సూచించారు.. ఎమ్మెల్యేలు అందరూ హుందాగా ఉండటం అలవాటు చేసుకోవాలన్న ఆయన.. ప్రతిపక్షం లేదని నిర్లక్ష్య ధోరణి వద్దు అని ఎమ్మెల్యేలను హెచ్చరించారు..
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైవీ సుబ్బారెడ్డి.. అయితే, ప్రతి కార్యకర్తకు మేం అండగా నిలబడతాం అన్నారు.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 57 మంది సోషల్ యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించారు.. 12 మంది కార్యకర్తల ఆచూకీ తెలియడం లేదన్నారు.
నేను 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను.. కానీ, ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అన్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు.. అసెంబ్లీలో ఈ రోజు స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వర్క్ షాప్ నిర్వహించారు.
వాళ్లకు బాధ్యత లేదు.. కానీ, మనకు ఉంది.. మనం ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దాం అని సూచించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. బడ్జెట్ సమావేశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన ఉండాలన్నారు.. ప్రభుత్వం తెచ్చే బిల్లులు, పాలసీలపై ప్రతి ఎమ్మెల్యే అధ్యయనం చేయాలని సూచించారు. పబ్లిక్ గవర్నెన్స్ లో ఎమ్మెల్యేలనూ భాగస్వామలను చేస్తాం.. ప్రజలు మనపై అనేక ఆశలు పెట్టుకున్నారు.. నమ్మకం పెట్టుకున్నారు.. ప్రజల నమ్మకం మేరకు వారి సమస్యలపై సభలో చర్చించాలి. అర్థవంతమైన చర్చలకు సభ వేదిక కావాలని సూచించారు.
పోసాని కృష్ణ మురళిపై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన నేతలు.. వైసీపీ హయాంలో పోసాని ఇష్టంవచ్చినట్టు మాట్లాడారని.. అయితే, తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. జనసేన అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆయన కుటుంబ సభ్యులను కించపరిచేలా పోసాని మాట్లాడరని మండిపడ్డారు
మాజీ ఎంపీ, సిట్టింగ్ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు వైసీపీకి గుడ్బై చెప్పబోతున్నారన్న వార్త ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కలకలం రేపుతోంది. కేవలం పార్టీ మారడంతోనే సరిపెట్టకుండా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది.