Tirupati Stampede: వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జ్యూడిషియల్ విచారణకు కమిషన్ ను నియమించింది. రిటైర్డ్ జడ్జి సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో జ్యూడిషియల్ విచారణ జరగనుంది… తిరుపతి పద్మావతి పార్క్ దగ్గర ఈ నెల 8న జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయారు.. వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్లు ఇచ్చే విషయంలో తొక్కిసలాట జరిగింది.. సీఎం చంద్రబాబు ఈ సంఘటనలో సీరియస్ అయ్యారు.. కొంతమంది అధికారుల బదిలీ కూడా జరిగింది.
Read Also: Noise ColorFit Pro 6: AI ఫీచర్లతో నాయిస్ న్యూ స్మార్ట్ వాచ్‌లు.. ధర ఎంతంటే?
తొక్కిసలాట సంఘటనకు సంబంధించి ప్రభుత్వం జ్యూడిషియల్ విచారణకు నిర్ణయం తీసుకుంది.. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? ఈ ఘటనకు కారణాలు ఏంటి..? బాధ్యతా రాహిత్యంగా ఎవరు ఉన్నారు..? అనేది విచారణలో తేలనుంది.. ఆరు నెలల కాలంలో విచారణ నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. తిరుమల తిరుపతి అంశంపై ఇప్పటికే అనేక రకాలుగా చర్చ జరుగుతోంది. దీంతో తొక్కిసలాట తర్వాత మరింత చర్చనీయాంశంగా టీటీడీ మారింది.. జ్యూడిషియల్ విచారణ తర్వాత ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాలి.
Read Also: Farooq Abdullah: బంగ్లాదేశ్‌ని నిందించలేము.. సైఫ్ అలీ ఖాన్ ఘటనపై ఫరూఖ్ అబ్దుల్లా..
కాగా, ఈ నెల 8న తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల జారీ కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన ఘటన తీవ్ర కలకలం రేపుతుండగా.. ఈ ఘటనపై జ్యూడీషియల్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం.. ఏపీ హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఎం.సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో జ్యుడిషియల్ విచారణ జరగనుంది.. ఆరు నెలల్లో విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది.. విచారణ జరిపేందుకు అన్ని రకాల అధికారాలను కమిషన్ కు ఇచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ విజయానంద్..