కార్తిక సోమవారము శుభవేళ ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి కల్యాణం చూసే మహా భాగ్యాన్ని కల్పిస్తోంది భక్తి టీవీ.. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో ‘కోటి దీపోత్సవం’ దిగ్విజయంగా కొనసాగుతోంది. దీపాల పండగలో ఇప్పటికే రెండు రోజులు పూర్తి కాగా.. వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఇక, నేడు కోటి దీపోత్సవంలో మూడవ రోజు. అందులోనూ కార్తిక సోమవారం కాబట్టి..
ప్రజలు మిమ్మల్ని గెలిపించింది శాసనసభకు రావడానికే.. కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శాసన సభకు రాకుండా పారిపోతున్నారని ఎద్దేవా చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. ఇక, గుంతల్లో చిడతల బేరం పేరుతో మీడియాలో కథనాలు వస్తున్నాయి.. గడిచిన ఐదు సంవత్సరాలకే రోడ్లు ఎలా ఉన్నాయో ప్రజలకు తెలుసు అన్నారు..
వైఎస్ జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.. అయితే, ఈ నెల 22వ తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాం.. అసెంబ్లీ సమావేశాలు సీరియస్ గా జరగాలి అన్నారు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.. సమగ్ర శిక్షా ఉద్యోగులకు సమ్మె కాలపు వేతనాలు విడుదల చేసిందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్.. ఈ మేరకు అంగీకారం తెలిపారు ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్..
అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు పడినట్టు అయ్యింది.. అమరావతి నిధుల ప్రతిపాదనపై ప్రంపచబ్యాంకు, ఏడీబీ, హడ్కో రుణాలపై ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది.. ప్రపంచ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు.. ఈ భేటీలో కేంద్ర, రాష్ట్ర అధికారులతో పాటు ప్రపంచబ్యాంకు, ఏడీబీ, హడ్కో బ్యాంకు అధికారులు పాల్గొన్నారు..
రాబోయే రోజుల్లో రెండు, మూడు విమానాలు వచ్చే అవకాశం ఉందన్నారు సీఎం చంద్రబాబు.. పచ్చదనం, జలాల మధ్య శ్రీశైలంలో సీ ప్లేన్ చాలా అందంగా ఉందన్న ఆయన.. భారత్ లో మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నాం అన్నారు.. అయితే, సీ ప్లేన్, బోట్లు, రోడ్డు రవాణాను లింక్ చేస్తేబాగుంటుందన్నారు సీఎం
విశాఖ నగరంలో గంజాయి పంట కలకలం రేపింది.. కేజీహెచ్ లేడీస్ హాస్టల్ వెనుక ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి పండిస్తున్నారు కొంతమంది యువకులు.. గత రెండేళ్లుగా గంజాయి పండిస్తు మత్తుకు బానిసలుగా మారారు.. ఏజెన్సీ నుండి తీసుకొచ్చి ఇక్కడ పండిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.. గంజాయి సేవించి మిగిలిన వాటిని నగరంలో స్టూడెంట్స్ కి విక్రయిస్తున్నారు గంజాయి గ్యాంగ్.. పక్కా సమాచారంతో గుట్టురట్టు చేశారు విశాఖపట్నం వన్ టౌన్ పోలీసులు.
భవిష్యత్ అంతా పర్యాటకానిదే అన్నారు సీఎం చంద్రబాబు.. భవిష్యత్లో ఏ యిజం ఉండదు.. టూరిజం ఒక్కటే ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో తొలిసారి పర్యాటకంగా ‘సీ ప్లేన్’ వినియోగం ఏపీ నుంచి ఆరంభం కానుందన్నారు..