Off The Record: అనుకుంటాంగానీ…, రాజకీయాల్లోనే సెంటిమెంట్లు ఎక్కువగా పండుతుంటాయి. ఒక్కసారి నెగెటివిటీ డవలప్ అయితే చాలు… ఎంత ఉన్నత పదవి అయినా… తీసుకోవడానికి భయపడుతుంటారు నాయకులు. సరిగ్గా అటువంటిదే ఇప్పుడు వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతోందట. ఆ సీటే అత్యంత కీలకమైన విశాఖ జిల్లా అధ్యక్షపదవి. ఆరు అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో పార్టీ మీద అధ్యక్షుడిదే ఆజమాయిషీ. అధికారంలో వుంటే ఎమ్మెల్యేలతో సమానంగా… ఆ మాటకొస్తే… ఇంకాస్త ఎక్కువే గౌరవం లభిస్తుంది. కానీ…ఆ పేరు చెబితేనే హడలెత్తిపోతుంటారు నేతలు. దీనికి ప్రధాన కారణం నెగెటివ్ సెంటిమెంట్. గత ఐదున్నరేళ్ళలో విశాఖ జిల్లా అధ్యక్షులైన వాళ్ళే ఇందుకు ఉదాహరణ అంటున్నారు. ఇటీవల పార్టీ పరంగా కొన్ని కీలక మార్పులు చేసింది పార్టీ అదిష్టానం. గాజువాక ఇన్చార్జ్ గా వున్న గుడివాడ అమర్నాథ్ ను చోడవరానికి బదిలీ చేసింది. మాజీమంత్రి కోరిక మేరకే చోడవరం కేటాయించారని ప్రచారం. ఐతే, విశాఖ జిల్లా అధ్యక్షుడు అయి మూడు నెలలు తిరక్క ముందే స్ధాన చలనం నెగెటివ్ సెంటిమెంట్లో భాగమేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
Read Also: IND vs ENG: అర్ష్‌దీప్ సింగ్ ఆట అదుర్స్.. యువ క్రికెటర్ పేరిట కొత్త రికార్డు
గతంలోనూ ఈ సీటెక్కిన నేతలకు ఇటువంటి చేదు అనుభవాలే ఎదురయ్యాయట. విశాఖ అర్బన్ అధ్యక్షుడుగా సుదీర్ఘ కాలం పనిచేసిన వంశీకృష్ణ యాదవ్…..తూర్పు నియోజకవర్గం నుంచి 2014లో పోటీ చేసి ఓడిపోయారు. 2019లో సీటిచ్చేందుకు హైకమాండ్ అంగీకరించలేదు. మేయర్ పీఠం ఖాయం అనుకున్నా ఆఖరి నిముషంలో చేజారిపోయింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి లభించినా అంతర్గత విభేదాల కారణంగా వైసీపీతో పదేళ్ళ బంధం తెంచేసుకున్నారు వంశీ. మరో సీనియర్ నేత పంచకర్ల రమేష్ బాబుది ఇదే సీన్. పెందుర్తి టిక్కెట్ ఆశించి వైఎస్సార్సీపీలో చేరిన ఆయనకు పార్టీ ఆఖరి నిముషంలో ఝలక్ ఇచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ కే అవకాశం ఇవ్వాలని నిర్ణయించడంతో పోటీ చేసే అవకాశం లేకుండాపోయింది. ఇది విశాఖ జిల్లా పార్టీ అధ్యక్ష కుర్చీ ఎఫెక్ట్ అనే ప్రచారం జరిగింది. ఇక నగర పార్టీ బాధ్యతలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్ వ్యాపార కారణాలతో అజ్నాత వాసం చేయాల్సి వచ్చింది.సెంటిమెంట్లకు ఎక్కువ ప్రా ధాన్యత ఇచ్చే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా పీఠం బాధితుడే. ఆయన హయాంలో జోష్ తెచ్చే ప్రయత్నం జరిగినప్పటికీ వ్యక్తిగత వివాదాలు ఇబ్బంది పెట్టాయి. రాజకీయంగా ఓటమి అంటే ఎరుగని అవంతికి తొలిసారి ఘోరమైన అనుభవం తప్పలేదు. ఎన్నికల తర్వాత ఆరు నెలలు స్తబ్ధత పాటించిన మాజీమంత్రి.. ఇటీవలే ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వీళ్ళలో పీఠం ఎఫెక్ట్ గట్టిగా తగిలినప్పటికీ పార్టీ పరంగా గుర్తింపు, అవకాశాలు పొందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు.
Read Also: CM Chandrababu: మూడో రోజు కీలక సమావేశాలు.. బిల్‌గేట్స్‌తో చంద్రబాబు భేటీ..
అందరికంటే.. ఎక్కువగా.. దురదృష్టం వెంటాడింది కోలాగువురులునే. 2014లో వైసీపీ తరపున అదృష్టాన్ని పరీక్షించుకున్నా ఓటమి తప్పలేదు. చట్ట సభలో అడుగుపెట్టాలనే కోలా ఆశ ఒక్క ఓటుతో కనుమరుగైపోవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత డీసీసీబీ అధ్యక్ష అవకాశం వచ్చినా.. రాజకీయంగా కోలా ప్రయాణం దాదాపు ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ కొన్ని అనుభవాలు మాత్రమే అయినా… అధ్యక్ష పీఠంపై నెగెటివ్ సెంటిమెంట్‌ను డవలప్ చేయడానికి కారణం అయ్యాయంటున్నారు. ప్రస్తుత ప్రెసిడెంట్ అమర్నాథ్ సైతం తాత్కాలిక బాధ్యతల్లోనే కొనసాగుతున్నారు. విశాఖకు 60 కిలోమీటర్ల దూరంలో వున్న చోడవరం వెళ్లి రావడం, ఇక్కడ సిటీలో పార్టీ నాయకత్వానికి అందుబాటులో వుండటం ఏక కాలంలో సాధ్యం కాకపోవచ్చు. ఈ క్రమంలో కొత్త ముఖాల కోసం వెతుకుతున్నప్పటికీ పెద్దగా ఆసక్తికనబరచడం లేదని తెలుస్తోంది. దీంతో పీఠం సెంటిమెంట్ దెబ్బ మామూలుగా లేదనే కామెంట్లు వైసీపీ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తున్నాయి.