మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ ఎమ్మెల్యేలు అభివృద్ధి వైపు దృష్టి పెడుతుండగా... అనుచరగణం మాత్రం చెలరేగుతోందని, కొంతమంది వ్యవహార శైలి వల్ల జనంలో నెగెటివ్ రిమార్క్స్ పడుతున్నాయని అంటున్నారు. ఇటీవల చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్... తన గెలుపులో కీలక పాత్ర పోషించిన ఓనేతను దూరం పెట్టినట్టు సమాచారం
ఆంధ్రప్రదేశ్ రాజధాని “అమరావతి” అభివృద్ధికి ఈ ఏడాది చివరకల్లా రూ. 15 వేల కోట్లు రుణం ఇవ్వనున్నారు.. “ప్రపంచ బ్యాంకు”, “ఏసియా డెవలప్ మెంట్ బ్యాంకు” (ఏడీబీ)లు సంయుక్తంగా రూ. 15 వేల కోట్లు రుణం అందించనున్నాయి.. “అమరావతి” అభివృద్ధికి రుణ మంజూరుపై ఈ రోజు ఢిల్లీలో రెండు బ్యాంకుల ఉన్నతాధికారులతో ఏపీ ఉన్నతాధికారుల చర్చలు సుదీర్ఘంగా సాగాయి..
గెలిచాక ఎమ్మెల్యే ఇంటూరి ఓ గ్రూపును దూరం పెడుతున్నారనే టాక్ గట్టిగానే వినిపిస్తుందట నియోజకవర్గంలో. సొంత పార్టీ క్యాడర్‌ను పక్కన పెట్టి తన మనుషుల్ని మండలానికో ఇంచార్జ్‌గా నియమించుకున్నారట. అక్కడ ఎంతటి నాయకులైనా వారు చెప్పినట్లు నడుచుకోవాల్సిందేనట. ఇంటూరి పెట్టిన మనుషులకు తెలియకుండా... చీమ చిటుక్కుమనడానికి వీల్లేదన్నది లోకల్ టాక్. అదే సమయంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరారవును టార్గెట్ చేస్తూ కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో సొంత పార్టీ కార్యకర్తలే పోస్టింగులు పెట్టడం నియోజకవర్గంలో చర్చనీయంశమైంది.
విజయవాడ, విశాఖ, తిరుపతిని ఎడ్యుకేషన్ హబ్‌లుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విజయవాడలో జరిగిన జాతీయ విద్యాదినోత్సవం వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో టీచర్లను అవమానించారని.. బ్రాందీ షాపుల ముందు నిలబెట్టారని విమర్శించారు.
స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047పై పారిశ్రామిక వేత్తలతో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.. అవకాశాల కల్పనతో సంపద సృష్టిస్తామన్నారు.. విజన్-2047 లక్ష్యాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై పారిశ్రామిక దిగ్గజాలతో మేధోమథనం నిర్వహించారు సీఎం చంద్రబాబు.. రానున్న రోజుల్లో 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రభుత్వ ప్రణాళికలు అమలు చేసి ఫలితాలు సాధించాలని సూచించారు..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్షంలో పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు.. జనసేన కండువా కప్పుకున్నారు.. విజయవాడ సిటీ నుంచి పలువురు కార్పొరేటర్లు , జగ్గయ్య పేట, ధర్మవరం, అనంతపురం ప్రాంతాల నుండి వైసీపీకి గుడ్‌బై చెప్పి వచ్చిన నేతలు.. జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
ఏపీ ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో 2024-25కి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.. రూ. 2,94,427.25 కోట్లతో కూడిన వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీ ముందు పెట్టారు.. అయితే, వైసీపీ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ఏపీ బడ్జెట్‌పై సెటైర్లు వేశారు.. ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టిందన్న ఆయన.. ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల వరకు బడ్జెట్ ప్రవేశ పెట్టలేదు.. ఏపీ ప్రజలకు బడ్జెట్ గండికోట రహస్యంగా మారిందని దుయ్యబట్టారు..
మరో రెండు పథకాల అమలు కోసం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాం అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి.. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు.. గత ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు..
ఐఎండీ సూచనల ప్రకారం నైరుతి బంగాళాఖాతంలోని ఆవర్తనం ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇది తదుపరి రెండు రోజుల్లో పశ్చిమ దిశగా నెమ్మదిగా తమిళనాడు / శ్రీలంక తీరాల వైపు కదిలేందుకు అవకాశం ఉందన్న ఆయన.. మరోవైపు నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర నుండి పశ్చిమమధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు.. దీని ప్రభావంతో రేపటి నుంచి మూడు రోజుల పాటు అంటే ఈ నెల 12,…