భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేందుకు కసరత్తు.. ఆ ప్రాంతానికి మినహాయింపు..!
భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచడంపై కసరత్తు ప్రారంభించింది ప్రభుత్వం.. వచ్చే నెల (ఫిబ్రవరి) 1వ తేదీ నుంచి భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉందట.. అధికారులు, ప్రజాప్రతినిధుల సూచనలతో ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందట.. అయితే, అమరావతి ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచే విషయంలో మినహాయింపు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందట.. భూముల మార్కెట్ విలువ, బుక్ విలువ మధ్య బాగా ఎక్కువ తేడా గుర్తించింది ప్రభుత్వం.. బుక్ విలువ పెంచి రిజిస్ట్రేషన్ రేట్లు నిర్ణయించాలనే ఆలోచలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది.. వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్, ఇతర డెవలప్‌మెంట్ అవసరాల కోసం నిబంధనలు మరింత సులభతరం చేయనుంది ప్రభుత్వం.. వచ్చే నెల 1వ తేదీ నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. రిజిస్ట్రేషన్ పెంపు అంశంపై త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా స్పష్టత ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.. ఒకవేళ పూర్తి కసరత్తు జరగకపోతే మరి కొన్ని రోజుల పాటు ఆలస్యం అయ్యే అవకాశం ఉందనే చర్చ కూడా సాగుతోంది.
ఏపీకి రండి.. ఇండస్ట్రియల్ పార్క్‌లు, డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టండి..
దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ వరుసగా వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు.. రాష్ట్రంలో ఉన్న అవకాశాలు.. పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులను వివరిస్తూ.. పెట్టుబడులతో రండి అని ఆహ్వానిస్తున్నారు.. తాజాగా, టెమాసెక్ హోల్డింగ్స్ భారత స్టాటజిక్ ఇనిషియేటివ్ హెడ్ రవి లాంబాతో సమావేశం అయ్యారు ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. శరగవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో టెమాసెక్ గ్రూపు అనుబంధ సంస్థ క్యాపిటా ల్యాండ్ ద్వారా ఇండస్ట్రియల్ పార్కులు, డాటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.. ఏపీ ఇండస్ట్రియల్ క్లస్టర్‌లలో REIT మోడల్ లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయమన్నారు.. వైజాగ్, తిరుపతి నగరాల్లో కమర్షియల్ స్పేస్ ఏర్పాటు చేయాలని అడిగారు లోకేష్.. అనుబంధ సంస్థ సెంబ్ కార్ఫ్ తో కలసి రెన్యువబుల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానించారు మంత్రి లోకేష్.. విశాఖ, తిరుపతిలో సెమా టెక్ టెలీమీడియా ద్వారా డేటా సెంటర్లు, డాటా సెంటర్ పార్కుల ఏర్పాటుకు సహకరించమని కోరారు.. ఏపీలో మూడు అతిపెద్ద ఇండస్ట్రియల్ కారిడార్లు, 20 ఇండస్ట్రియల్ క్లస్టర్లు ఉన్నాయని.. పవర్ ట్రాన్స్ మిషన్ ను బలోపేతం చేయడం, గ్రిడ్ స్థిరత్వాన్ని మెరుగుపర్చడం, బ్యాకప్ కోసం సెంబ్ కార్ప్ ఇండియా ద్వారా పెట్టుబడులు పెట్టాలని కోరారు.. ఇక, రాబోయే మూడేళ్లలో భారత ఫైనాన్షియయల్ సర్వీసెస్, హెల్త్ కేర్ రంగాల్లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నామన్నారు టెమాసిక్ హోల్డింగ్ హెడ్ లాంబా.. 2028 నాటికి క్యాపిటా ల్యాండ్ ద్వారా భారత రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులను రెట్టింపు చేయాలని అనుకుంటున్నాం అన్నారు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచర ఎగ్జిక్యూటివ్ లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు..
రాజధాని అమరావతికి మరో గుడ్ న్యూస్.. హడ్కో కీలక నిర్ణయం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో నిలిచిపోయిన రాజధాని అమరావతి నిర్మాణ పనులను పునఃప్రారంభించింది.. ఇప్పటికే కొన్ని పనులకు ప్రియార్టీ ప్రకారం సీఆర్‌డీఏ అనుమతి ఇవ్వడంతో శరవేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి.. ఈ తరుణంలో రాజధాని అమరావతి ప్రాంతానికి మరో శుభవార్త అందింది.. రాజధాని నిర్మాణానికి 11 వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేసేందుకు హడ్కో నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు.. ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల విడుదలకు అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు.. అమరావతి నిర్మాణం కోసం హడ్కో ద్వారా 11 వేల కోట్ల రూపాయల రుణం కోసం సంప్రదింపులు జరిపాం.. హడ్కో నిర్ణయంతో రాజధాని పనులు వేగవంతం అవుతాయని వెల్లడించారు.. మరోవైపు.. అమరావతితో పాటు టిడ్కో ఇళ్ల నిర్మాణానికి నిధులు విడుదలకు హడ్కో బోర్డు నిర్ణయం తీసుకుంది.. 4400 కోట్ల ఋణం కింద టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ఇవ్వాలని హడ్కో నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు.
ఈ రైల్వే స్టేషన్లకు ‘ఈట్ రైట్ స్టేషన్’గా 5స్టార్ రేటింగ్..
విజయవాడ రైల్వే స్టేషన్ FSSAI నుండి ‘5 స్టార్ ఈట్ రైట్ స్టేషన్’ సర్టిఫికేట్ పొందింది.. విజయవాడ రైల్వే స్టేషన్ అత్యుత్తమ పరిశుభ్రత మరియు సురక్షితమైన ఆహార పద్ధతులను అమలు చేసినందుకు భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ (FSSAI) నుండి ప్రతిష్టాత్మకమైన ‘ఈట్ రైట్ స్టేషన్’ ధృవీకరణను పొందింది. పూర్తి పరిశుభ్రత, క్వాలిటీ, వాడే ప్రతీ ఆహార పదార్దంలోనూ ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవడం, స్టాండర్డ్ ప్రకారం ఉండాల్సిన అన్ని ప్రమాణాలను అనుసరించడం ప్రధానంగా ఇక్కడ గుర్తించాలి.. దాదాపు ఆరు నెలలపాటు జరిగిన పలు ఆడిట్‌ల అనంతరం, పూర్తిస్ధాయి శిక్షణ తరువాత FSSAI అధికారులు ఈట్ రైట్ స్టేషన్‌గా 5 స్టార్ రేటింగ్ ను ఇచ్చారు.. ఇప్పటి వరకూ రెండు తెలుగు రాష్ట్రాలలో విజయవాడ, అన్నవరం, గుంటూరు, నాంపల్లి, నడికుడి రైల్వెస్టేషన లకు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఈట్ రైట్ స్టేషన్లుగా 5 స్టార్ సర్టిఫికేట్ వచ్చింది… ప్రధానంగా రైలులో ప్రయాణించే ప్రతీ ప్రయాణికుడూ రైల్వే స్టేషన్‌లో వెయిటింగ్ లో ఉంటారు.. అలాంటిది విజయవాడ ద్వారా దాదాపు రోజుకు 4 లక్షలకు పైగా ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు.. అలాంటి చోట కచ్చితంగా వెయిటింగ్ లో ఉండే ప్రయాణికులు లక్షల్లోనే ఉంటారు.. పూర్తిస్ధాయిలో అన్నీ పరిశీలించిన తరువాత ప్రతీ ఒక్కరిని పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చి, స్టాండర్డ్ లను పూర్తిగా పాటించేలా చేసి, ఈట్ రైట్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేశారు విజయవాడ రైల్వేస్టేషన్ అధికారులు.. పలు విధాలుగా ఆడిట్ నిర్వహించిన FSSAI అధికారులు విజయవాడ రైల్వేస్టేషన్ కు 5 స్టార్ రేటింగ్ ఇస్తూ ఈట్ రైట్ స్టేషన్ గా సర్టిఫికేట్ ఇచ్చారు.. ఈ సర్టిఫికేట్ రెండు సంవత్సరాల పాటు అర్హత ఇస్తుంది.. ఆ తరువాత మరోసారి FSSAI ఆడిట్ నిర్వహించి, మరోసారి కూడా అర్హత వస్తే ఈట్ రైట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందని అధికారులు తెలిపారు. మొత్తంగా అన్నవరం, గుంటూరు, నడికుడి, నాంపల్లి రైల్వే స్టేషన్‌లు దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) జోన్‌లో ‘ఈట్ రైట్ స్టేషన్’ సర్టిఫికేషన్ పొందాయని అధికారులు వెల్లడించారు..
28న నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహా ధర్నా..
ఈ నెల 28న నల్గొండలో బీఆర్ఎస్ (BRS) రైతు మహా ధర్నా నిర్వహించనుంది. అయితే.. ఈ నెల 21న నల్గొండలో రైతు మహా ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునివ్వగా.. పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ధర్నాకు అనుమతి నిరాకరణ అంశంపై బీఆర్‌ఎస్ పార్టీ పెద్దలతో చర్చించారు. అనుమతి నిరాకరణపై బీఆర్‌ఎస్ నేతలు సోమవారం(20వ తేదీ)న హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ధర్మాసనం ఈరోజు.. ధర్నాకు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. ఈ నెల 28న రైతు మహా ధర్నా ఏర్పాట్లకు సంబంధించి బీఆర్ఎస్ నిమగ్నమైంది. నల్గొండ టౌన్‌లోని క్లాక్ టవర్‌లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మహా ధర్నా చేపట్టనున్నారు. నల్గొండ టౌన్‌లో జరిగే బీఆర్ఎస్ రైతు మహా ధర్నాకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. కాగా.. రైతు భరోసా రూ.15 వేలు ఇవ్వాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్ మహా ధర్నా నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మభ్యపెడుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తూ మహా ధర్నా తలపెట్టింది.
మళ్ళీ కేసీఆర్ను సీఎంను చేసుకునే దాకా విశ్రమించకుండా పోరాడుదాం..
సత్తుపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును దగ్గర నుంచి గమనిస్తున్నాం.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరు ఏమిటో నిన్నటి గ్రామసభలను చూస్తే తెలుస్తుందని అన్నారు. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గ్రామ సభల్లో ప్రభుత్వాన్ని గ్యారంటీలపై నిలదీస్తున్నారని తెలిపారు. సత్తుపల్లిలో మళ్ళీ ఎగిరేది గులాబీ జెండానేనని కేటీఆర్ పేర్కొన్నారు. మళ్ళీ కేసీఆర్ను సీఎంను చేసుకునే దాకా విశ్రమించకుండా పోరాడుదాం అని తెలిపారు. ఉమ్మడి ఖమ్మంలో మళ్ళీ బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు 23 మంది బీఆర్ఎస్ నుంచి గెలిస్తే 17 మంది ఇంకా పార్టీలోనే కొనసాగుతుండటం పార్టీ పట్ల వారికున్న విధేయతకు నిదర్శనం అని కేటీఆర్ అన్నారు. మరోవైపు.. రైతుల సమస్యలపై అధ్యయన కమిటీ వేశాం.. రానున్న రోజుల్లో ప్రజావ్యతిరేక ప్రభుత్వంపై మరింత గట్టిగా పోరాడదామని పిలుపునిచ్చారు. త్వరలోనే సత్తుపల్లి నేతలతో కేసీఆర్ సమావేశమవుతారని కేటీఆర్ తెలిపారు.
కిడ్నీ రాకెట్ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్..
హైదరాబాద్‌లోని కిడ్నీ రాకెట్ కుంభకోణంపై ప్రభుత్వం సీరియస్ అయింది. సరూర్‌నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ పై ప్రభుత్వం నిజానిర్దారణ కమిటీ వేసింది. దీంతో.. కమిటీ గాంధీ ఆసుపత్రికి రానుంది. కిడ్నీ రాకెట్ ప్రధాన సూత్రదారులపై నిజానిజాలు తెలుసుకునేందుకు కమిటీని నియమించింది ప్రభుత్వం. ఉస్మానియా మాజీ సూపరిండెంట్ నాగేందర్ నేతృత్వంలో నెఫ్రాలజిస్ట్, యూరాలజిస్ట్‌లతో కలిపి హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో.. అలకనంద హాస్పిటల్‌ని కమిటీ పరిశీలించింది. హాస్పిటల్స్ సీజ్‌లో ఉండటంతో కమిటీ సభ్యులు గాంధీ హాస్పిటల్‌కు వెళ్లారు. మరోవైపు.. కిడ్నీ రాకెట్ వ్యవహారంపై రంగారెడ్డి జిల్లా డీఎం అండ్ హెచ్‌వో మాట్లాడుతూ.. అలకనంద సూపర్ స్పెషాలిటీ హాస్పటల్‌కి కేవలం ఆరు నెలల క్రితం 9 బెడ్స్‌కి అనుమతులు ఇచ్చామని తెలిపారు. కానీ ఈ ఆసుపత్రిలో దారుణంగా, ఇష్టారాజ్యంగా ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు చేస్తున్నారని అన్నారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఆస్పత్రి యాజమాన్యంపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటికే అలకనంద ఆస్పత్రిని సీజ్ చేసాం.. శాశ్వతంగా ఈ ఆస్పత్రిని మూసి వేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నామని చెప్పారు. ప్రభుత్వం, ఆరోగ్య శాఖ మంత్రి ఈ అంశం పై చాలా సీరియస్‌గా ఉన్నారని డీఎం అండ్ హెచ్‌వో తెలిపారు.
“కచ్చతీవు”పై ఇందిరా గాంధీని ప్రశంసించిన కాంగ్రెస్.. అన్నామలై తీవ్ర విమర్శలు..
లోక్‌సభ ఎన్నికల ముందు తమిళనాడులో చర్చనీయాంశంగా మారిన ‘‘కచ్చతీవు’’ దీవుల వ్యవహారం మరోసారి రాజకీయాంశంగా మారింది. 1974లో భారత సార్వభౌమాధికారం కింద ఉన్న కచ్చతీవు ద్వీపాన్ని అప్పటి ప్రధాని ఇండిరా గాంధీ శ్రీలంకకు అప్పగించింది. ఈ నిర్ణయాన్ని తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ కేఎస్ అళగిరి సెల్వపెరుంతగై ప్రశంసించారు. దీనిపై బీజేపీ తమిళనాడు చీఫ్ కే. అన్నామలై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు డీఎంకేల ఏకపక్ష, పేలవమైన ఆలోచన రహిత నిర్ణయాలని అన్నామలై విమర్శించారు. ఈ నిర్ణయం ద్వారా తమిళ జాలర్ల జీవనోపాధిని ప్రమాదంలో పడేసిందని దుయ్యబట్టారు. ఎక్స్‌లో కాంగ్రెస్, డీఎంకేలపై విరుచుకుపడ్డారు. ‘‘ కాంగ్రెస్, డీఎంకేల నిర్ణయం మన మత్స్యకారుల ప్రాణాలను బలిగొందని, నిరంతరం అరెస్టులు, మన ఫిషింగ్ బోట్లకు నష్టం కారణంగా చాలా మంది జీవనోపాధిని కోల్పోయారని సెల్వపెరుంతగై గ్రహించారా..?’’ అని ప్రశ్నించారు.
“భార్యతో సెల్ఫీ”.. మూల్యం చెల్లించుకున్న మావోయిస్ట్ నేత చలపతి..
మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్న చలపతి ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మందికిపైగా మావోయిస్టులు హతమయ్యారు. చలపతి చనిపోవడం భద్రతా బలగాలకు పెద్ద విజయంగా చెప్పొచ్చు. ఇతడిని రూ. 1 కోటి రివార్డు ప్రకటించిందంటే, ప్రభుత్వం ఇతడికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. చిత్తూర్ జిల్లా మదనపల్లెకు చెందిన చలపతి అసలు పేరు జయరాం రెడ్డి. భద్రతా దళాలపై జరిగిన అనేక దాడులకు చలపతి సూత్రధారిగా ఉన్నారు. ఇతడికి 8-10 మంది సెక్యూరిటీ ఉంటుంది. ఫిబ్రవరి 2008లో ఒడిశాలోని నయాగఢ్ జిల్లాలో 13 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన దాడికి ఇతను సూత్రధారిగా ఉన్నాడు. మావోయిస్టు అగ్రనేత ఆర్కేకి సన్నిహితుడు, ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న మావోయిస్ హిడ్మాకు చలపతి గురువుగా పరిగణించబడుతాడు. సల్వాజుడుం సృష్టికర్త మహేంద్ర కర్మని దాడి చేసి చంపిన కేసులో కూడా ఇతడి ప్రమేయం ఉంది. చలపతి తన భార్య అరుణ అలియాస్ చైతన్య వెంకట్ రవితో సెల్ఫీ తీసుకోవడమే అతడి ప్రాణాలను తీసినట్లు తెలిసింది. ఆంధ్ర ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ (AOBSZC) ‘డిప్యూటీ కమాండర్’ అయిన అతని భార్య అరుణతో తీసుకున్న సెల్ఫీ భద్రతా దళాలకు అతన్ని గుర్తించడంలో సహాయపడింది. మే 2016లో ఏపీలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత స్వాధీనం చేసుకున్న ఒక స్మార్ట్‌ఫోన్‌లో ఈ సెల్ఫీ కనుగొనబడింది.
డిగ్రీ పాసైన వారికి గోల్డెన్ ఛాన్స్.. 1129 పోస్టులతో.. సివిల్స్ నోటిఫికేషన్ రిలీజ్
దేశంలో ప్రతిష్టాత్మక సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కి క్రేజ్ ఎక్కువ. సివిల్స్ సాధించి దేశ సేవలో భాగం అవ్వాలని యూత్ కలలుకంటుంటారు. ప్రతి ఏటా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. తాజాగా యూపీఎస్సీ 1129 పోస్టులతో సివిల్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (UPSC CSE 2025) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ సంవత్సరం CSE కోసం మొత్తం 979, IFS కోసం 150 ఖాళీలను కమిషన్ నోటిఫై చేసింది. UPSC CSE ప్రిలిమినరీ పరీక్ష 2025 కోసం ఫిబ్రవరి 11, 2025 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్ (IDAS) ఇతర సర్వీస్‌లలో అధికారులను ఎంపిక చేస్తారు. IAS కోసం, అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.
ఈ మేడ్-ఇన్-ఇండియా కారు.. 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి..
మారుతీ సుజుకి ఇండియాకు చెందిన ఇ-విటారా ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇది సుజుకి మోటార్ కార్పొరేషన్ యొక్క మొట్టమొదటి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం (BEV). ఈ గ్లోబల్ మోడల్ కారు.. ఇ-విటారా మొత్తం మారుతీ సమూహానికి చాలా ముఖ్యమైనది.ఈ కారును మారుతీ కంపెనీ గుజరాత్ ప్లాంట్‌లో తయారు చేస్తుంది. దీన్ని జపాన్‌తో సహా 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇది యూరోపియన్ దేశాలకు కూడా ఎగుమతి చేయబడుతోంది. ఫోర్డ్ ఫిగో తర్వాత భారతదేశం నుంచి జపాన్‌కు ఎగుమతి చేయబడుతున్న రెండవ మారుతి ఎస్‌యూవీ ఇది. ఈ ఏడాది నుంచే మారుతీకి చెందిన ఇ-విటారా ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ ప్రముఖ కార్ల తయారీ సంస్థ తన గుజరాత్ ప్లాంట్‌లో ప్రత్యేకంగా ఈవీలను అందించడానికి నాల్గవ లైన్‌ను ఏర్పాటు చేసింది. గుజరాత్ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 7,50,000 యూనిట్లు. ఈవీ యొక్క నాల్గవ లైన్ గురించి మారుతి నుంచి ఇంకా అధికారిక ప్రకటన లేదు. అయితే.. భారతదేశంలో ఈవీల తయారీలో నంబర్ వన్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కారులో మీరు ప్రత్యేక ఫీచర్ల గురించి తెలుసుకుందాం.. ఇ-విటారా ముందు భాగంలో Y-పరిమాణ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ లను కలిగి ఉంది. వెనుకవైపు 3-పీస్ లైటింగ్ ఎలిమెంట్‌తో కనెక్ట్ చేస్తూ..ఎల్‌ఈడీ టెయిల్ లైట్‌ని అమర్చారు. దీని ముందు బంపర్ పెద్దగా ఆకర్శణీయంగా ఉంది. ఇందులో ఫాగ్ లైట్లు ఉన్నాయి. క్యాబిన్ లోపల, విభిన్న టెర్రైన్ మోడ్‌ల కోసం రోటరీ డయల్ కంట్రోల్‌తో కూడిన సెంటర్ కన్సోల్, సన్‌రూఫ్, హిల్ హోల్డ్, ఆల్ వీల్ డ్రైవ్ అందించారు. ఈ ఇ-విటారా గ్లోబల్ స్పెక్ వెర్షన్‌లో కనిపించే మోడల్‌ను పోలి ఉంటుంది. ఈ కారులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా అందించారు.
నష్టాలకు బ్రేక్.. భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్‌లో నష్టాలకు బ్రేక్ పడింది. భారీ లాభాలతో సూచీలు ముగిశాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ బుధవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరి దాకా గ్రీన్‌లో కొనసాగాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 566 పాయింట్లు లాభపడి 76, 404 దగ్గర ముగియగా.. నిఫ్టీ 130 పాయింట్లు లాభపడి 23, 155 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 25 పైసలు పెరిగి రూ.86.33 దగ్గర ముగిసింది. నిఫ్టీలో విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా అత్యధికంగా లాభపడగా.. భారత్ ఎలక్ట్రానిక్స్, టాటా మోటార్స్, ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ నష్టపోయాయి. మిడ్‌క్యాప్ మరియు స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 1.5 శాతం తగ్గాయి.
ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ కి హగ్ ఇచ్చిన సైఫ్
సైఫ్ అలీఖాన్‌ను లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ కోరిక నెరవేరింది. భజన్ సింగ్ రాణా అనే ఆటో డ్రైవర్‌ని డిశ్చార్జ్ చేయడానికి ముందు సైఫ్ కలుసుకుని కౌగిలించుకున్నాడని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇంతకుముందు డ్రైవర్ ఇంటర్వ్యూలో సైఫ్ ను తాను ఆసుపత్రికి తీసుకువెళ్లినా ఆయన్ను కలిసి అవకాశం దొరకలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఆ సమయంలో తాను ఆసుపత్రికి తీసుకువెళ్లింది నటుడు సైఫ్ అలీఖాన్ అని ఆటో డ్రైవర్ కి తెలియదట. ఆంధ్ర మాట్లాడుతూ సైఫ్ తో తన ఫోటో దిగాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు. ఇప్పుడు సైఫ్ కూడా తనతో ఫోటో దిగాలనే అతని కోరికను తీర్చాడు. సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగినప్పుడు, అతని ఇంట్లో కారు సిద్ధంగా లేదు. ఆటో డ్రైవర్ అతన్ని లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఈ ఘటనను ఆటో డ్రైవర్ ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. సైఫ్‌ను త్వరగా ఆస్పత్రికి తరలించేందుకు షార్ట్‌కట్ తీసుకున్నానని, డబ్బులు కూడా తీసుకోలేదని పేర్కొన్నాడు. ఇప్పుడు వీరి ఫోటో బయటకు వచ్చింది. ఇందులో సైఫ్ హాస్పిటల్‌లో ఆటో డ్రైవర్‌తో కనిపించాడు. డ్రైవర్ భజన్ సింగ్ రానాను సైఫ్ కౌగిలించుకుని కృతజ్ఞతలు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇది మాత్రమే కాదు, తనకు ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే తెలియజేయమని సైఫ్ చెప్పినట్లు భజన్ లాల్ మీడియాకు తెలిపారు. ఆ రాత్రి ఒక మహిళ తన ఆటోను ఆపిందని భజన్ సింగ్ చెప్పాడు. సైఫ్‌ను ఆటోలో కూర్చోబెట్టి చూడగా మెడ, వీపు నుంచి రక్తం కారుతోంది, తెల్లని కుర్తా ఎర్రగా మారిపోయింది. ఇక ఆసుపత్రికి తీసుకు వెళ్లినందుకు తాను ఎలాంటి ఛార్జీలు తీసుకోలేదని, ఎవరికైనా సహాయం చేయడానికి సంతోషంగా ఉంటానని భజన్ సింగ్ చెప్పాడు. భజన్ సింగ్ తన ఆటో ఎక్కింది సైఫ్ అనే విషయం తెలియదని, అలాంటి పరిస్థితుల్లో సెల్ఫీ కూడా తీసుకోలేనని చెప్పాడు.
సుకుమార్ ఇంట ఐటీ రైడ్స్.. వెలుగులోకి కీలక అంశాలు
స్టార్ డైరెక్టర్ ఇటీవల పుష్ప 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సుకుమార్ ఇంట ఐటి రైడ్స్ జరుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా జరుగుతున్న పలువురు నిర్మాతల ఇళ్లపై ఐటి రైడ్స్ లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అధికారులు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్, రవి శంకర్ లను ప్రశ్నించారు. ఇక పుష్ప 2 సినిమా డైరెక్ట్ చేసినందుకు సుకుమార్ రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా తీసుకున్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు. పుష్ప 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. వసూళ్లకు తగ్గట్టు ఐటీ చెల్లింపులు జరగలేదని ఐటీ నిర్ధారించింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యాంకు లావాదేవీలను ప్రస్తుతానికి అధికారులు తనిఖీ చేస్తున్నారు. మరో పక్క మరో నిర్మాత నివాసంలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల భారీ వసూళ్లు సాధించిన సినిమాల నిర్మాతలను టార్గెట్ చేసింది ఐటీ శాఖ.
బిగ్గెస్ట్ ఎవర్ సినిమా “సిండికేట్” చేస్తున్నా
సత్య చిత్రంపై నా కన్ఫెషన్ నోట్‌కు కొనసాగింపుగా, నేను ఎప్పటికైనా అతిపెద్ద చిత్రాన్ని రూపొందించాలని నిర్ణయించుకున్నాను ఆ సినిమా పేరు సిండికేట్ అంటూ పేర్కొన్నారు రామ్ గోపాల్ వర్మ. ఇది భారతదేశ అస్తిత్వానికే ముప్పు కలిగించే భయంకరమైన సంస్థ గురించి అని అంటూ రాసుకొచ్చాడు. 70వ దశకం వరకు విజృంభించిన స్ట్రీట్ గ్యాంగ్‌లు కరడుగట్టిన రాజకీయ పార్టీలలోకి ప్రవేశించాయి. తరువాత ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారం మొదలైన వాటికి విపరీతమైన డిమాండ్ కారణంగా స్మగ్లర్లు పెరిగినప్పుడు, వాటిని కూడా ఆర్థిక సంస్కరణలు నాశనం చేశాయి, ఆపై ఘోరమైన కార్పొరేట్ ముఠాలు మరోసారి విజయం సాధించడానికి D COMPANY మొదలైనవి వచ్చాయి.