రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్‌లో కలెక్టర్ డ్యాన్స్ వైరల్.. భార్యతో కలిసి మాస్ స్టెప్పులు
భారత 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. ప్రతీ ఊరు, వాడ, పల్లె, పట్నం.. ఇలా తేడా లేకుండా మువ్వన్నెల జెండా పండుగను అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేశారు.. ఈ సందర్భంగా సాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి.. కొన్ని చోట్ల విద్యార్థులు, యువజనులు ఉత్సాహంగా ఈ ఉత్సవాల్లో పాల్గొంటే.. మరికొన్ని చోట్ల వీఐపీలు సైతం కాలు కదిపారు.. ఇక, రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ కూడా డ్యాన్స్‌లు అదరగొట్టారు.. భార్యతో కలిసి సినిమా పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు కలెక్టర్ బాలాజీ.. ”గుండెల్లోన గుండెల్లోన నిన్ను దాచేసి.. గూడే కట్టి గువ్వలెక్క చూసుకుంటానే.. గుండెల్లోన గుండెల్లోన సంతకం చేసి.. పైనోడితో పర్మిషన్నే తెచ్చుకున్నానే.. ఏ గడవనే గడవదే నువ్వేలేని రోజే.. బుజ్జమ్మా బుజ్జమ్మా.. ఏ ఒడవనే ఒడవదే నీపై నాలో ప్రేమే.. బుజ్జమ్మా బుజ్జమ్మా..” అంటూ సాగే పాటకు కాలు కదిపారు.. అయితే, కలెక్టర్ బాలాజీ దంపతుల డ్యాన్స్ వీడియోను కొందరు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో వదలడంతో.. ఆ వీడియో కాస్తా వైరల్ గా మారిపోయింది.. మరోవైపు.. కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీకి 2024 సంవత్సరానికి బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డు లభించిన విషయం విదితమే.. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి ఈ మధ్యే ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతేడాది కృష్ణా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిగా 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనపరిచినందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డుకు డీకే బాలాజీని ఎంపిక చేసిన విషయం విదితమే కాగా.. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం రోజు ఆ అవార్డును ఆయన ప్రదానం చేశారు.
సుప్రీం కోర్టులో వైఎస్ జగన్‌కు భారీ ఊరట
సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి భారీ ఊరట లభించింది.. వైఎస్ జగన్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ.. మరోవైపు జగన్ పై ఉన్న కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు గతంలో వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.. రఘురామ కృష్ణం రాజు పిటిషన్ పై విచారణ జరిపింది జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం.. చివరకు ఆ పిటిషన్‌ను డిస్మస్ చేస్తున్నట్టు వెల్లడించింది.. ఇక, జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్ ను ఉపసoహరించుకున్నారు పిటిషనర్.. ఈ పరిణామాలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించినట్టు అయ్యింది.. ఇక, ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
నిబంధనలు పాటించలేదు..! డీజీపీ ఎంపికపై హైకోర్టులో పిటిషన్..
ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఎంపికను సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.. డీజీపీ ఎంపికలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, యూపీఎస్సీ నిబంధనలు పాటించలేదని పిల్ వేశారు.. నిబంధనల ప్రకారం డీజీపీ పోస్ట్ కి అర్హత కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాను ప్రభుత్వం యూపీఎస్సీ కి పంపాలని పిల్ లో పేర్కొన్నారు పిటిషనర్.. ఈ జాబితాలో ముగ్గురు అధికారుల లిస్ట్ ను యూపీఎస్సీ.. ప్రభుత్వానికి పంపగా ఒకరిని డీజీపీగా నిర్ణయించటం అనే రూల్స్ ని ప్రభుత్వం పక్కన పెడుతోందని పిల్‌లో పేర్కొన్నారు.. 3 నెలల ముందు పంపాల్సిన సీనియర్ ఐపీఎస్ జాబితాను ఇంకా పంపలేదని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.. ఇక, ఈ నెల 31వ తేదీన ప్రస్తుత డీజీపీ పదవీ విరమణ చేస్తున్నారని.. ఈ నేపథ్యంలో పిల్‌పై వెంటనే విచారణ జరపాలని హైకోర్టును కోరారు పిటిషనర్..
వైసీపీపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు.. లీడర్ల కంటే XXXలే ఎక్కువ..!
ఏపీలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటనపై అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ తరుణంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. వైసీపీలో లీడర్ల కంటే లోఫర్లు ఎక్కువ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. దావోస్ వెళ్లి పబ్జీ ఆడుకుని, బజ్జీలెక్కడ దొరుకుతాయో వెతుక్కుంటూ స్వెట్టర్ వేసుకుని తిరిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు.. దావోస్ పర్యటనపై వైసీపీ నాయకుల మాటలు పనీ పాటా లేని విమర్శలుగా కొట్టిపారేశారు.. రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఈ రాష్ట్రంలో వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి తీరుతో భయపడుతున్నారని ఆరోపించారు. ఇక, వైసీపీలో రెండవ స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి ఆకస్మికంగా ఆ పార్టీని వదిలి వెళ్ళారంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలని సూచించారు వసంత కృష్ణప్రసాద్.. వైఎస్ రాజశేఖరరెడ్డికి రామచంద్రరావు ఆత్మ అయితే, జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి ఆత్మగా అభివర్ణించిన ఆయన.. భవిష్యత్ లో చాలా మంది వైసీపీని వీడతారు, 3 నెలల్లో మిగిలిన లీడర్లు కూడా ఆ పార్టీ నుండి బయటకు వస్తారు అని జోస్యం చెప్పారు.. మునిగిపోయే పడవ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వస్తే ఇక్కడ వద్దని వేరే జిల్లాలకు పంపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్షేమం, అబివృద్ది రెండు కళ్లుగా ముందుకెళ్ళాలంటే కూటమి ప్రభుత్వానికే సాధ్యం అన్నారు.. ఇక, లోకేష్ డిప్యూటీ సీఎం అనేది సోషల్ మీడియా దుమారం, ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని అధిష్టానం నుండి ఆదేశాలు ఉన్నాయని.. అటువంటి నిర్ణయం ఉంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వెల్లడిస్తారని స్పష్టం చేశారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.
అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు ఊరట!
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్నకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. తిరుపతన్న బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. కేసు దర్యాప్తు, విచారణకి పూర్తిగా సహకరించాలని.. సాక్షులని ప్రభావితం చేయవద్దని తిరుపతన్నకు సుప్రీంకోర్టు కండిషన్స్ పెట్టింది. దాంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారి తెలంగాణ ప్రభుత్వంకు గట్టి షాక్ తగిలింది. గడిచిన 10 నెలలుగా తిరుపతన్న జైలులో ఉన్న విషయం తెలిసిందే. అదనపు ఎస్పీ తిరుపతన్న బెయిల్‌ను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తిరుపతన్న పాత్రపై దర్యాప్తుకు నాలుగు నెలల సమయం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా కోర్టుకు తెలిపారు. ఆధారాలు, డేటా ధ్వంసం చేసారని.. గూగుల్ సర్వర్ నుంచి సమాచారం తీసుకుంటున్నామని చెప్పారు. రాజకీయ నేతల ఆదేశాల మేరకు అందరి ఫోన్లను ట్యాప్ చేశారని, హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ఇందులో ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో మిగతా సాక్షులను విచారించాలని, దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో కీలక నిందితుడు తిరుపతన్నకు బెయిల్ ఇవ్వొద్దని లూత్రా కోర్టును కోరారు.
పూణేలో వింత వ్యాధి కలకలం.. గిలియన్ బార్ సిండ్రోమ్ భయాందోళన!
మహారాష్ట్ర పశ్చిమ ప్రాంతమైన పూణేలో ఒక వింత వ్యాధి అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. ఈ వ్యాధి గత వారం నుండి పూణేలో వ్యాపిస్తోంది. ఈ మర్మమైన వ్యాధి పేరు గిలియన్-బార్ సిండ్రోమ్(GBS).. ఇప్పటివరకు ఈ వ్యాధి కారణంగా పూణేలో 70 మందికి పైగా ఆసుపత్రిలో చేరారు. ఇందులో 15 మందికి పైగా రోగులు వెంటిలేటర్ సపోర్టు పై చికిత్స తీసుకుంటున్నారు. ఈ తీవ్రమైన వ్యాధికి సంబంధించి పూణే మునిసిపల్ కార్పొరేషన్ ఒక సలహా జారీ చేసింది. పూణేలోని కమలా నెహ్రూ ఆసుపత్రిలో ఈ వ్యాధితో బాధపడుతున్న రోగులకు ఉచిత చికిత్స అందించాలని మున్సిపల్ కమిషనర్ రాజేంద్ర భోసలే నిర్ణయించారు. పూణేలోని ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు రూ. 2 లక్షల వరకు ప్రభుత్వ వైద్య బీమాను అందించనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పూణేలో ఈ వ్యాధి కారణంగా 70 మందికి పైగా అనారోగ్యంతో ఉన్నట్లు సమాచారం. వీరిలో 12 మందికి పైగా వెంటిలేటర్లపై ఉన్నారు. పూణే చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా రోగులు చికిత్స కోసం పూణేకు వస్తున్నారు కాబట్టి విషయం చాలా తీవ్రమైనది. ఇది క్యాంపిలోబాక్టర్ జెజుని బ్యాక్టీరియాతో ముడిపడి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇది నీరు లేదా ఆహారం ద్వారా వ్యాపిస్తుంది.
ప్రయాగ్‌రాజ్ చేరుకున్న హోంమంత్రి అమిత్ షా.. మరికొద్ది సేపట్లో సంగంలో పవిత్ర స్నానం
హోంమంత్రి అమిత్ సోమవారం ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. అమిత్ షా ఈరోజు మహా కుంభమేళా 2025లో పాల్గొని పవిత్ర స్నానం చేయనున్నారు. ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్ X లో పోస్ట్ చేస్తూ, “సనాతన సంస్కృతి నిరంతరాయ ప్రవాహానికి మహా కుంభమే ఒక ప్రత్యేక చిహ్నం” అని అన్నారు. అమిత్ షా తన కుటుంబంతో కలిసి పవిత్ర నగరానికి చేరుకున్నారు. ప్రయాగ్‌రాజ్ చేరుకున్న ఆయనకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆయన మంత్రివర్గం పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అమిత్ షా తన సోషల్ మీడియా హ్యాండిల్ X లో పోస్ట్ చేస్తూ, “కుంభమేళా సామరస్యం ఆధారంగా మన శాశ్వత జీవిత తత్వాన్ని ప్రతిబింబిస్తుంది” అని అన్నారు. ఈ రోజు మతపరమైన నగరమైన ప్రయాగ్‌రాజ్‌లో స్నానం చేసి సాధువుల ఆశీర్వాదాలను పొందాలని ఆసక్తిగా ఉన్నాను’’ అని అన్నారు.
ఈ దేశంలో మహిళలకు సైకిల్ తొక్కే స్వేచ్ఛ కూడా లేదు
ఇరాన్ తన మహిళా వ్యతిరేక విధానాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అపఖ్యాతి పాలైంది. అది మహిళలపై బలవంతంగా హిజాబ్ విధించడం కావచ్చు లేదా చిన్న వయసులోనే బాలికల వివాహం కోసం ఆదేశాలు జారీ చేయడం కావచ్చు. ఇరాన్‌లో చాలా కాలంగా మహిళల హక్కుల గొంతు వినిపిస్తోంది. కానీ ఆ గొంతు వినడానికి బదులుగా అక్కడి ప్రభుత్వం తన చెవులు, కళ్ళు మూసుకుంది. ఈసారి ఇరాన్ ప్రభుత్వం కళ్ళు తెరిచి చూసేసరికి, ఇద్దరు అమ్మాయిలు తమ డ్యాన్స్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ ఒక్క డ్యాన్స్ వీడియో ఆధారంగా పోలీసులు ఎవరూ ఊహించని ఒక అడుగు వేశారు. డ్యాన్స్ వీడియోను షేర్ చేసిన ఇద్దరు బాలికలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు ఇచ్చిన కారణం వస్త్రధారణ. ఇరాన్ నైతిక పోలీసులు ఈ అమ్మాయిల దుస్తులను అసభ్యకరంగా ప్రకటించారు. అరెస్టు తర్వాత ఈ ఇద్దరు బాలికల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు కూడా క్లోజ్ అయ్యాయి. ఇద్దరు అమ్మాయిలలో ఒకరు జీన్స్, పుల్ ఓవర్ వేసుకుని ఉండగా, మరొక అమ్మాయి జీన్స్, టాప్, దానిపై హూడీ వేసుకుని ఉంది.
పాక్ గడ్డపై 35 ఏళ్ల తర్వాత వెస్టిండీస్ సంచలనం
ముల్తాన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు పాకిస్తాన్‌పై 120 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో కేవలం సిరీస్‌ను గెలుచుకోవడమే కాదు. 35 ఏళ్ల తర్వాత ముల్తాన్‌లో సుల్తాన్ గా పేరొందిన పాకిస్తాన్ జట్టుకు సొంత గడ్డపై వెస్టిండీస్ జట్టు చుక్కలు చూపించింది. 1990 తర్వాత పాక్ గడ్డపై వెస్టిండీస్ గెలిచిన ఇదే తొలి టెస్టు కావడం విశేషం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వెస్టిండీస్ నిర్దేశించిన 254 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు పాకిస్తాన్ జట్టు బరిలోకి దిగింది. సొంత మైదానం, అనుకూల పిచ్ పరిస్థితులున్నప్పటికీ పాక్ జట్టు కరీబియన్ బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. పాక్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 133 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక ఈ టెస్టులో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దానితో మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 163 పరుగులకే ఆలౌటైంది. దీనికి సమాధానంగా పాక్ తొలి ఇన్నింగ్స్‌లో కూడా తేలిపోయింది. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 154 పరుగులకే పరిమితమైంది. దీంతో వెస్టిండీస్ 9 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లో కరీబియన్ జట్టు 244 పరుగుల మోస్తరు స్కోర్ చేయడం ద్వారా పాకిస్తాన్ ముందు 254 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే లక్షాన్ని చేధించే క్రమంలో పాకిస్తాన్ కేవలం 133 పరుగులకే కుప్పకూలింది. దీనితో వెస్టిండీస్ 120 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో వెస్టిండీస్ పాక్ గడ్డపై ఘనత సాధించడమే కాకుండా, 2 టెస్టుల సిరీస్‌ను 1-0 తో సిరీస్ను కైవసం చేసుకుంది.
కన్నప్ప రెబల్ స్టార్ ఫస్ట్ లుక్ రిలీజ్ ఆ రోజే
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రం భారీ ఎత్తున రూపొందుతోంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 25, 2025న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌ను ఇటీవల బెంగుళూరులో ప్రారంభించాడు చిత్ర హీరో మంచు విష్ణు. కాగా ఈ చిత్రంనుండి ఇప్పటికే హీరో మంచు విష్ణు, మోహన్ బాబు, మలయాళ స్టార్ మోహన్ లాల్ తో పాటు తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ అలాగే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ విడుదల చేసారు మేకర్స్. అయితే ఈ సినిమాలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. దాదాపు 40 నిమిషాల పాటు ప్రభాస్ ఈ సినిమాలో దర్శనమిస్తాడని తెలుస్తోంది. అసలు ఈ సినిమాలో ప్రభాస్ ఎలా ఉంటాడు లుక్ ఎలా ఉంటది అని ఎదురుచూసిన రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు కన్నప్ప మేకర్స్. ఫిబ్రవరి 3న రెబల్ స్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నామని అఫీషియల్ గా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. విష్ణు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ పై మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా భాషలలో నిర్మిస్తున్నారు.
సంక్రాంతికి వస్తున్నాం 13 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్
యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫెస్టివల్ సీజన్లో బాక్సాఫీస్ వద్ద చెరగని ముద్ర వేసింది. పొంగల్‌కు విడుదలైన ఈ సినిమా అంచనాలను మించి చరిత్రను తిరగరాస్తూ రికార్డులు బద్దలు కొట్టింది. సంక్రాంతికి వస్తున్నాం కేవలం 13 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 276 కోట్లకు పైగా వసూలు చేసిందని అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. పండుగ కాలంలో విడుదలైన అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రం ప్రాంతీయ సినిమాగా నిలిచింది. అటు ఓవర్సీస్ లోను ఈ చిత్రం దూసుకెళ్తోంది. నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 2.7 మిలయన్ కు పైగా వసూలు చేసింది మరియు వెంకటేష్, అనిల్ రావిపూడి మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ల హ్యాట్రిక్ కాంబో లో USAలో ఆల్-టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. వినోదాత్మక కథాంశంతో, అనిల్ రావిపూడి యొక్క ట్రేడ్‌మార్క్ వినోదభరితమైన కథనం మరియు వెంకటేష్ యొక్క ఆకర్షణీయమైన నటనతో, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తూ సినిమా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. మరోవైపు చిత్ర యూనిట్ విజయోత్సవ యాత్రలో భాగంగా ఏపీలోని థియేటర్స్ ను విజిట్ చేస్తున్నారు. తాజాగా గడచిన ఆదివారం భీమవరంలో ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో హీరో వెంకటేష్ తో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్స్ మీనాక్షి చౌదరి,ఐశ్వర్య రాజేష్ తో పాటు ఇతర నటీనటులు పాల్గొన్నారు.
మీ ప్రేమ దీవెనలు ఎప్పుడు ఇలాగే ఉండాలి : రవితేజ
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ సినిమాలంటే కామెడీ, యాక్షన్, రొమాన్స్ అని ఉంటాయి. ఫ్యామిలీ ఎలిమెంట్లు కథని బట్టి ఒక్కోటి యాడ్ అవుతూ ఉంటాయి. కొంత సెంటిమెంట్ కూడా తోడవుతుంది. ఇలా తన ప్రతి ఒక సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెడుతుంటారు రవితేజ. ప్రధానంగా ఎంటర్టైన్‌మెంట్, మాస్ ఎలిమెంట్లకి కొదవ ఉండదు. అలా వచ్చిన సినిమాలన్నీ దాదాపు హిట్ అయ్యాయి. కానీ ఈ మద్యకాలంలో ట్రాక్ తప్పాడు రవితేజ. తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ని వదిలేసి యాక్షన్ సినిమాల వెంట పరిగెడుతూ..ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నారు. కానీ అవన్నీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. ఇక ఇప్పుడు తిరిగి తన ఫామ్ లోకి తను వచ్చింనట్లున్నాడు.. తాజాగా ఆయన నటిస్తున్న సినిమా ‘మాస్ జాతర’. భాను బోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇక తాజాగా ఈ మూవీ గ్లింప్స్ ని విడుదల చేశారు మేకర్స్. ఇందులో పోలీస్‌గా కనిపించాడు రవితేజ.మాస్ ప్రేక్షకులు మెచ్చే విధంగా ఆకర్షణీయంగా ఈ గ్లింప్స్ ను మలిచారు.పవర్ ఫుల్ డైలాగ్స్ తో పాత రవితేజను గుర్తుచేశాయి. గ్లింప్స్ ఎండ్ లో రవితేజ అద్దంలో చూసుకుంటూ తనను తాను తిట్టుకునే సన్నివేశంతో ‘వెంకీ’ మూవీని గుర్తుచేసింది. భీమ్స్ సిసిరోలియో అందించిన బీజియం రవితేజ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా ఉండటం ఈ గ్లింప్స్ కు ప్రధాన బలంగా నిలిచింది.