AP High Court: ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఎంపికను సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.. డీజీపీ ఎంపికలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, యూపీఎస్సీ నిబంధనలు పాటించలేదని పిల్ వేశారు.. నిబంధనల ప్రకారం డీజీపీ పోస్ట్ కి అర్హత కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాను ప్రభుత్వం యూపీఎస్సీ కి పంపాలని పిల్ లో పేర్కొన్నారు పిటిషనర్.. ఈ జాబితాలో ముగ్గురు అధికారుల లిస్ట్ ను యూపీఎస్సీ.. ప్రభుత్వానికి పంపగా ఒకరిని డీజీపీగా నిర్ణయించటం అనే రూల్స్ ని ప్రభుత్వం పక్కన పెడుతోందని పిల్‌లో పేర్కొన్నారు.. 3 నెలల ముందు పంపాల్సిన సీనియర్ ఐపీఎస్ జాబితాను ఇంకా పంపలేదని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.. ఇక, ఈ నెల 31వ తేదీన ప్రస్తుత డీజీపీ పదవీ విరమణ చేస్తున్నారని.. ఈ నేపథ్యంలో పిల్‌పై వెంటనే విచారణ జరపాలని హైకోర్టును కోరారు పిటిషనర్..
కాగా, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త పోలీస్ బాస్‌ను నియమించారు.. ఆయనే డీజీపీ ద్వారకా తిరుమలరావు.. అయితే, ఆయన పదవీ విరమణ చేయనుండటంతో, ఈ పదవికి ఎవరు వస్తారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోన్న సమయంలో.. రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమించనున్నట్లు తెలుస్తోంది. 1992 బ్యాచ్‌కు చెందిన హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఏపీ డీజీపీగా పని చేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది.. సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం హరీష్‌ను డీజీపీగా నియమించిన విషయం విదితమే..