ఆంధ్రప్రదేశ్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. "సాస్కి-2024-25 (Special Assistance to States for Capital Investment)"ద్వారా తొలి విడత నిధులు విడుదల చేసింది.. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ కార్యాలయం.. ఏపీలో పర్యాటక అభివృద్ధికి నూతనోత్తేజం.. మంత్రి కందుల దుర్గేష్ కృషితో, ప్రత్యేక చొరవతో కేంద్రం నుండి నిధులు విడుదల అయ్యాయని.. రాష్ట్ర పర్యాటక రంగానికి ఊతమిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకమైన "సాస్కి-2024-25 (Special Assistance to States for Capital…
ప్రజాదర్బార్ లో వచ్చే సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.. ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను సంబంధిత శాఖలకు పంపి త్వరితగతిన పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 47వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. మంత్రిని స్వయంగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు లోకేష్..
పవన్ కల్యాణ్‌కు ఆర్జీవీ వ్యవహారంపై ప్రశ్నలు ఎదురయ్యాయి.. గతంలో పోలీసులు ఎక్కడున్నా పట్టుకునేవాళ్లు.. ఇప్పుడు ఆర్జీవీ ఎందుకు దొరకడం లేదు..? ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అనే తరహాలో మీడియా నుంచి ప్రశ్నలు వచ్చాయి.. దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్.. నా పని నేను చేస్తున్నా.. పోలీసులు పని వాళ్లు చేస్తున్నారని పేర్కొన్నారు.. లా అండ్ ఆర్డర్ హోం మంత్రి చూస్తారు.. నేను చెయ్యడం లేదు అంటూ నవ్వుతూ బదులిచ్చారు పవన్ కల్యాణ్..
నైరుతి బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలో మీటర్ల వేగంతో కదులుతూ తీవ్రవాయుగుండంగా రూపాంతరం చెందినట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.. ప్రస్తుతానికి ట్రింకోమలీకి ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో, నాగపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 590 కిలో మీటర్లు, పుదుచ్చేరికి దక్షిణ-ఆగ్నేయంగా 710 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణ-ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనన తీవ్ర వాయుగుండం..
ఏపీకి ముంచుకొస్తున్న తుఫాన్ ముప్పు..! ఆంధ్రప్రదేశ్ రైతులకు వాయుగుండం ముప్పు ముంచుకు వస్తోంది. కోత దశలో భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా వుండమని హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం దక్షిణ బంగాళా ఖాతంలో వున్న వాయుగుండం తమిళనాడు – శ్రీలంక దిశగా కదులుతూ బలపడుతోంది. “దాన” తీవ్ర తుఫాన్ తర్వాత మరోసారి తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర రూపం దాల్చింది. వాయువ్య […]
విద్యా శాఖలో వచ్చే ఏడాది నుంచి, ప్రతి విద్యార్ధికి బాలల భారత రాజ్యాంగం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. పిల్లలకు అర్ధమయ్యేలా రాజ్యాంగం గురించి ఇందులో వివరిస్తాం. రాజ్యాంగ ప్రతిని పిల్లలకు అర్ధమయ్యేలా అందుబాటులోకి తేవాలని సూచించారు మంత్రి నారా లోకేష్..
ఓటు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నాం.. ఎవరైనా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తే ఓటుతో ప్రజలు సమాధానం చెబుతారని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ సెక్రటేరియట్ లో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, సవిత, ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్, వివిధ శాఖల ఛీఫ్ సెక్రెటరీలు, సెక్రెటరీలు పాల్గొన్నారు..
తన పర్యటనలో భాగంగా కాసేపటి క్రితం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్‌తో సమావేశం అయ్యారు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెంట.. జనసేన ఎంపీలు వల్లభనేని బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు.. ఇక, ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. తనకు గజేంద్ర సింగ్ షెఖావత్ అంటే అపారమైన గౌరవం అన్నారు.. ఆయన కేంద్ర జలశక్తి మంత్రిగా పోలవరం ప్రాజెక్టుకు సహకరించారని గుర్తుచేశారు.. ఇక, ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో 7 ప్రాజెక్టులపై ప్రతిపాదనలు అందించామని…
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన ఆచూకీ లభిస్తే అరెస్టు చేసేందుకు ఒంగోలు పోలీసులు సిద్ధమయ్యారు. డిజిటల్ మోడ్ లో విచారణకు హాజరవుతానని ఆర్జీవీ చేసిన రెక్వెస్ట్ ను తోసిపుచ్చారు పోలీసులు.. రెండు సార్లు విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇచ్చినా ఆర్జీవీ సద్వినియోగం చేసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. నోటీసులను ధిక్కరించారు కాబట్టే అరెస్ట్ వరకు వెళ్ళాల్సి వచ్చిందంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీలో బిజీబిజీగా గడపనున్నారు.. ఈ పర్యటన కోసం సోమవారం ఢిల్లీ చేరుకున్నారు పవన్ కల్యాణ్.. అయితే, ఈ రోజు వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. పెండింగ్ ప్రాజెక్టులు.. ఇతర అంశాలపై చర్చించనున్నారు..