ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపిస్తూ (ఎక్స్‌లో పోస్టు) ట్వీట్ చేశారు పవన్ కల్యాణ్.. ‘మోడీ నాపై చూపే అభిమానం.. ఆప్యాయత ఎంతో విలులైనది.. పార్లమెంటు సమావేశాల మధ్య తన విలువైన సమయాన్ని నా కోసం కేటాయించారు.. గాంధీనగర్‌లో మోడీతో నా తొలి సమావేశం నుంచి ఈ భేటీ వరకు, మోడీకి పని పట్ల నిబద్ధత, దేశం పట్ల ప్రేమ నిజంగా స్ఫూర్తిదాయకం’ అంటూ ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు.. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం…
నార్కోటిక్ కట్టడిపై సబ్ కమిటీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్.. గంజాయి విక్రయించే వారి కుటుంబానికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు కట్ చేస్తామని హెచ్చరించారు.. గంజాయి, డ్రగ్స్ పై ఇక యుద్ధమే అని ప్రకటించిన మంత్రి లోకేష్.. నిర్మూలనకు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఉక్కుపాదం మోపుతాం అన్నారు.. నార్కోటిక్స్ నియంత్రణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్.. ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఇకపై ఈగల్ గా మారుస్తున్నట్టు వెల్లడించారు.. పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు,…
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదంపై ఆరా తీశారు సీఎం చంద్రబాబు నాయుడు.. బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.. బాధితులకు ప్రభుత్వ పరంగా అండగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. అయితే, హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్ అయిన ఘటనలో ఒకరు చనిపోగా, ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని... వారిని క్రిటికల్ కేర్ సెంటర్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సీఎం చంద్రబాబుకు తెలిపారు అధికారులు.
బూడిద లోడింగ్, తరలింపు వ్యవహారం కూటమి నేతల మధ్య చిచ్చు పెట్టింది.. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య బూడిద తరలింపు, సరఫరాపై వివాదం రోజురోజుకు ముదురుతోంది.. బూడిద తరలింపు విషయంలో రాజకీయ వివాదంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇరు పార్టీల నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా నేతల వ్యవహారం ఉందని మండిపడ్డారు..
ఆంధ్రప్రదేశ్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. "సాస్కి-2024-25 (Special Assistance to States for Capital Investment)"ద్వారా తొలి విడత నిధులు విడుదల చేసింది.. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ కార్యాలయం.. ఏపీలో పర్యాటక అభివృద్ధికి నూతనోత్తేజం.. మంత్రి కందుల దుర్గేష్ కృషితో, ప్రత్యేక చొరవతో కేంద్రం నుండి నిధులు విడుదల అయ్యాయని.. రాష్ట్ర పర్యాటక రంగానికి ఊతమిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకమైన "సాస్కి-2024-25 (Special Assistance to States for Capital…
ప్రజాదర్బార్ లో వచ్చే సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.. ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను సంబంధిత శాఖలకు పంపి త్వరితగతిన పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 47వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. మంత్రిని స్వయంగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు లోకేష్..
పవన్ కల్యాణ్‌కు ఆర్జీవీ వ్యవహారంపై ప్రశ్నలు ఎదురయ్యాయి.. గతంలో పోలీసులు ఎక్కడున్నా పట్టుకునేవాళ్లు.. ఇప్పుడు ఆర్జీవీ ఎందుకు దొరకడం లేదు..? ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అనే తరహాలో మీడియా నుంచి ప్రశ్నలు వచ్చాయి.. దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్.. నా పని నేను చేస్తున్నా.. పోలీసులు పని వాళ్లు చేస్తున్నారని పేర్కొన్నారు.. లా అండ్ ఆర్డర్ హోం మంత్రి చూస్తారు.. నేను చెయ్యడం లేదు అంటూ నవ్వుతూ బదులిచ్చారు పవన్ కల్యాణ్..
నైరుతి బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలో మీటర్ల వేగంతో కదులుతూ తీవ్రవాయుగుండంగా రూపాంతరం చెందినట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.. ప్రస్తుతానికి ట్రింకోమలీకి ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో, నాగపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 590 కిలో మీటర్లు, పుదుచ్చేరికి దక్షిణ-ఆగ్నేయంగా 710 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణ-ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనన తీవ్ర వాయుగుండం..
ఏపీకి ముంచుకొస్తున్న తుఫాన్ ముప్పు..! ఆంధ్రప్రదేశ్ రైతులకు వాయుగుండం ముప్పు ముంచుకు వస్తోంది. కోత దశలో భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా వుండమని హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం దక్షిణ బంగాళా ఖాతంలో వున్న వాయుగుండం తమిళనాడు – శ్రీలంక దిశగా కదులుతూ బలపడుతోంది. “దాన” తీవ్ర తుఫాన్ తర్వాత మరోసారి తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర రూపం దాల్చింది. వాయువ్య […]