Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తమ పార్టీ ఎమ్మెల్యేలతో వన్ టూ వన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో భాగంగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా చర్చలు జరిపారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌తో వన్ టూ వన్ సమావేశం ప్రారంభమైంది. ప్రతి నియోజకవర్గంలో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు అవుతున్న సంక్షేమ పథకాలు, కొనసాగుతున్న (ఆన్ గోయింగ్) ప్రాజెక్టుల వివరాలపై పవన్ కల్యాణ్ […]
Minister Nara Lokesh: తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో విద్యార్థులకు కీలక సూచనలు చేశారు మంత్రి నారా లోకేష్.. రాజమండ్రిలోని ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ‘హలో లోకేష్’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఆసక్తికరంగా, స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళల పట్ల గౌరవం, సమానత్వం ఎంతో అవసరమని లోకేష్ స్పష్టం చేశారు. మహిళలను అవమానపర్చేలా, కించపరిచేలా వ్యవహరించే చర్యలపై కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. […]
విజయవాడలో దారుణం.. రూ.10 కోసం వృద్ధుడి హత్య..! విజయవాడలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మందు తాగేందుకు కేవలం రూ.10 ఇవ్వలేదన్న కారణంతో ఓ వృద్ధుడిని మైనర్ బాలుడు కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్టీనగర్ లౌక్య బార్ సమీపంలో గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో జరిగింది. మైనర్ బాలుడు ప్రసాద్ మద్యం మత్తులో మందు కొనడానికి డబ్బులు సరిపోకపోవడంతో […]
Wild Cows: ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ పరిధిలోని చందర్లపాడు మండలంలో రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న అడవి ఆవుల సమస్యను జిల్లా కలెక్టర్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. కృష్ణా నది లంక ప్రాంతాల్లో సుమారు 2,000కు పైగా అడవి ఆవులు తిరుగుతూ పంట పొలాలను నాశనం చేస్తున్నాయని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. చందర్లపాడు మండలంలోని కృష్ణా నది లంక పొలాల్లో ఒకేసారి అడవి ఆవుల గుంపులు మేత […]
Gudivada Amarnath: మరోసారి కూటమి సర్కార్‌పై విమర్శలకు దిగారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గుడివాడ అమర్నాథ్.. విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్‌కు తీవ్ర భంగం కలుగుతోందన్న విమర్శలు ఊపందుకుంటున్నాయి. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఎమ్మెల్యేలు, అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు భూ కబ్జాలు, భూ వివాదాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాలు పెట్టుబడుల కోసం ముందుకొచ్చే ఇన్వెస్టర్లను భయపెడుతున్నాయని రాజకీయ వర్గాలు, పారిశ్రామిక వర్గాలు […]
TTD Parakamani Case: టీటీడీ పరకామణి చోరీ కేసుపై దాఖలైన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా స్వామివారి కానుకల లెక్కింపులో పారదర్శకత తప్పనిసరి అని న్యాయస్థానం స్పష్టం చేసింది. భక్తులు సమర్పించే ప్రతి పైసా లెక్క సరిగ్గా ఉండాలని, దొంగతనాలు, మోసాలు జరగకుండా చూసే పూర్తి బాధ్యత టీటీడీ బోర్డుపై ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో గత విచారణలో పరకామణి లెక్కింపు వ్యవహారంపై సలహాలు ఇవ్వమన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఈసారి టీటీడీ […]
Deputy CM Pawan Kalyan: ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం వేస్తోన్న కీలక అడుగుకు శుభ ముహూర్తం ఖరారైంది. 3 వేల 50 కోట్ల రూపాయలతో చేపట్టే వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు ఈ నెల 20న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా శంకుస్థాపన చేయనున్నారు. పెరవలిలోని ఎన్‌హెచ్ 216ఏ దగ్గర ఆర్కే రైస్ మిస్ సమీపంలో నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా అధునాతన […]
Srisailam: శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి భక్తులకు దేవస్థానం శుభవార్త అందించింది. భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని మల్లన్న స్పర్శ దర్శనాల స్లాట్లను పెంచుతున్నట్లు శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వాహక అధికారి (ఈవో) శ్రీనివాసరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త విధానం 2026 జనవరి నెల నుంచి అమల్లోకి రానుంది. ప్రతి వారం శని, ఆదివారాలు మరియు సోమవారాల్లో మల్లన్న స్పర్శ దర్శనాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ రోజుల్లో ప్రతి రెండు గంటలకు […]
Vijayawada Horror: విజయవాడలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మందు తాగేందుకు కేవలం రూ.10 ఇవ్వలేదన్న కారణంతో ఓ వృద్ధుడిని మైనర్ బాలుడు కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్టీనగర్ లౌక్య బార్ సమీపంలో గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో జరిగింది. మైనర్ బాలుడు ప్రసాద్ మద్యం మత్తులో మందు కొనడానికి డబ్బులు సరిపోకపోవడంతో అక్కడే ఉన్న వృద్ధుడు బుల్ […]
Storyboard: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవని స్పీకర్ తీర్పు ప్రకటించారు. చట్టం ప్రకారం స్పీకర్ చెప్పింది కరెక్టే. స్వచ్చందంగా గెలిచిన పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవడం.. అంటే రాజాసింగ్ లాగా పార్టీకి రాజీనామా చేయడం లేదా విప్ ను ధిక్కరించడం .. ఈ రెండు అంశాల్లో ఏదో ఒకటి చేస్తేనే అనర్హత వేటు పడుతుంది. ఆ ఎమెల్యేలు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరామని ఎప్పుడూ […]