YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వాచ్‌మెన్ రంగన్న మృతి ఇప్పుడు చర్చగా మారింది.. ఇవాళ ఏకంగా ఏపీ కేబినెట్ భేటీలోనూ ఈ వ్యవహారం చర్చకు వచ్చింది.. ఇప్పటివరకు వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షులుగా, నిందితులుగా ఉన్నవారిలో నలుగురు చనిపోవడంపై డీజీపీ వివరణ కోరింది కేబినెట్.. అయితే, ఒక్కో మరణం గురుంచి కేబినెట్ కు వివరించారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. దీంతో, ఆ మరణాలు అనుమానాస్పదంగా ఉన్నాయని, పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించింది కేబినెట్ సమావేశం.. వివేకా హత్యను తొలుత గుండెపోటుగా చిత్రీకరించినట్లే.. రంగయ్యను పోలీసులు చంపారంటూ ప్రసారం కావటంపై మంత్రివర్గంలో అనుమానాలు వ్యక్తం చేశారు.. జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. అందుకే తాను పదే పదే చెప్తూ వస్తున్నాను అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మరోవైపు, పరిటాల రవి హత్య కేసులో సాక్షులు ఇలానే చనిపోతూ వచ్చారనే విషయాన్ని గుర్తుచేశారు ఏపీ సీఎం.. ఇక, వాచ్‌మెన్ రంగయ్య మృతి ముమ్మాటికీ అనుమాన్పదమే అన్నారు సీఎం చంద్రబాబు.. అనుమానాస్పద మృతేనని పోలీసుల విచారణలోనూ నిర్ధారణ అయినట్టు తెలిపారు కేబినెట్‌కు వివరణ ఇచ్చారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా..
Read Also: Posani Krishna Murali Case: పోసానికి షాకిచ్చిన నరసరావుపేట కోర్టు..
కాగా, వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షులుగా ఉన్న నలుగురు వ్యక్తులు అనారోగ్యంతో మృతి చెందడంపై తాజాగా కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అనుమానం వ్యక్తం చేసిన విషయం విదితమే.. కీలక సాక్షిగా ఉన్న రంగన్న.. కడప రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. రంగన్న భార్య సుశీల తన భర్త మృతిపై అనుమానం వ్యక్తం చేయడం.. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. అయితే, ఇటీవల కేసులో సాక్షిగా వైఎస్ అభిషేక్ రెడ్డి, కువైట్ గంగాధర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి మృతిపై కూడా అనుమానాలు ఉన్నాయయని.. వీటిపై లోతుగా దర్యాప్తు చేపడతాం అంటూ ఎస్పీ అశోక్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. అసలు, వైఎస్ వివేకా కేసులో సాక్షులుగా ఉన్న వ్యక్తులు ఎందుకు మరణిస్తున్నారో తెలియాల్సి ఉందన్నారు ఎస్పీ అశోక్ కుమార్. ఇప్పుడు, కేబినెట్‌లోనూ ఈ వ్యవహారంపై చర్చ సాగడం.. పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించడం కీలకంగా మారింది.