నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలపడంలో పూల బొకేలు కీలకపాత్ర పోషిస్తాయి. పలు రకాల పువ్వులతో ఈ బొకేలు తయారు చేస్తుంటారు. అయితే, పువ్వులకు ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం. కడియపులంక అంతర్ రాష్ట్ర పూల మార్కెట్లో తయారయ్యే ఈ బొకేలు దేశం నలుమూలకు సరఫరా అవుతున్నాయి. నూతన సంవత్సర పూల బొకేలు సిద్ధం అవుతున్నాయి.. కడియం నుంచి దేశం నలుమూలలకు సరఫరా అవుతున్నాయి.
టెంపుల్ సిటీలో హాట్ టాపిక్‌గా మారిపోయాయి పొలిటికల్ బొకేలు.. నూతన సంవత్సరం సందర్భంగా ఆయా నేతలకు ఇవ్వడానికి తిరుపతిలోని బొకేల షాపులు ఏర్పాటు చేసిన బొకేలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.. ఆయా పార్టీలకు సంబంధించిన రంగులన్న పూలతో తయారు చేసినా బొకేల్లో.. ఆ పార్టీలకు చెందిన నేతల ఫొటోలను కూడా పొందుపరిచారు..
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల ప్రక్రియ ప్రారంభమైంది.. కొత్త ఏడాది లో పనులు ప్రారంభం చెయ్యడానికి ప్రభుత్వం సిద్ధం అవుతోంది.. అనుకున్నట్టుగానే 1200 కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు పిలిచింది సీఆర్డీఏ. ప్రపంచ బాంక్.. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నిధులతో చేబడుతున్న పనులకు నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది.
ఏపీలో భూమి రిజిస్ట్రేషన్ విలువ పెంపుపై గత కొంతకాలంగా ప్రచారం సాగుతూ వచ్చింది.. జనవరి 1వ తేదీ నుంచి ధరలు పెరుగుతాయని సంకేతాలు వచ్చాయి.. అయితే, భూముల విలువ పెంపుకు కసరత్తు చేస్తోంది ఏపీ ప్రభుత్వం... ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇవి అమల్లోకి రాబోతున్నట్టు క్లారిటీ ఇచ్చింది.. గ్రోత్ సెంటర్ల ఆధారంగానే పెంపుదల చేయాలన్నది నియమంగా పెట్టుకుంది.. సగటున 15 నుండి 20 శాతం వరకు పెంపుదల ఉండే అవకాశం ఉంది..
అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం అమ్మకాలను అనుమతి ఇచ్చింది.. డిసెంబర్ 31వ తేదీతో పాటు.. జనవర్ 1వ తేదీన కూడా అర్ధరాత్రి 1 గంటల వరకు మద్యం అమ్మకాలను అనుమతి ఇచ్చింది సర్కార్.. అయితే, ఇప్పటికే బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయాలు జరిగితే బెల్ట్ తీస్తానంటూ సీఎం చంద్రబాబు హెచ్చరించిన విషయం విదితమే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్ చెప్పింది.. ఇయర్ ఎండ్‌లో ఒకరోజు ముందుగానే పెన్షన్‌దారులకు డబ్బులు అందబోతున్నాయి.. పల్నాడు జిల్లా యలమందలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది... డిసెంబర్ 31వ తేదీ సంవత్సర చివరలో , పెన్షన్ పండుగలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. వాస్తవానికి 1న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉండాల్సి ఉండగా, ఒకరోజు ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ, లబ్ధి దారులకు ప్రభుత్వం పెన్షన్ అందిస్తుంది.. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది..
పీఎస్ఎల్వీ సీ-60 ప్రయోగం విజయవంతం అయ్యింది.. పీఎస్ఎల్వీ ప్రయోగానికి 25 గంటలపాటు కౌంట్‌డౌన్ నిర్వహించారు.. ఆదివారం రాత్రి 8 గంటల 58 నిమిషాలకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఇది నిరంతరాయంగా కొనసాగిన తర్వాత ఈ రోజు రాత్రి 9 గంటల 58 నిమిషాలకు పీఎస్ఎల్వీ-సీ60 కక్ష్యలోకి దూసుకెళ్లింది.. నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది రాకెట్.. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో స్పేస్ డాకింగ్ టెక్నాలజీని సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది.. భవిష్యత్తులో మరిన్ని కీలక ప్రయోగాలకు నాంది.. అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటుతోపాటు ఇతర…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రేవంత్ కోరినట్టు టీటీడీ దర్శనాల కోసం తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సులకు ఆమోదం తెలుపుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు.. సోమవారం నుంచి గురువారం వరకు రెండు బ్రేక్ దర్శనం కోసం, రెండు ప్రత్యేక దర్శనం కోసం సిఫార్సు లేఖలను అనుమతి ఇస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..