TTD: తెలంగాణ ప్రజాప్రతినిధులకు శుభవార్త వినిపించింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి.. వారానికి రెండు సార్లు తెలంగాణ నేతల సిఫార్సు లేఖలు అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం.. టీటీడీ కూడా సిఫార్సు లేఖలకు అనుమతిస్తామని చెప్పినా.. అది కార్యరూపం దాల్చకపోవడంతో.. టీటీడీ సిబ్బందిపై విమర్శలు పెరిగాయి.. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ప్రజాప్రతినిధులకు శుభవార్త చెప్పింది టీటీడీ.. మార్చి 24వ తేదీ నుంచి తెలంగాణ ప్రజా ప్రతినిధులు సిఫార్సు లేఖలు స్వీకరించబోతోంది టీటీడీ.. అయితే, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై సోమవారం, మంగళవారాల్లో బ్రేక్ దర్శనాలు కల్పించనున్నారు టీటీడీ అధికారులు.. ఇక, బుధవారం ,గురువారం రోజుల్లో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను జారీ చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది.
Read Also: Crime: క్రైమ్ షోలు చూసి భార్యను చంపిన భర్త.. విచారణలో షాకింగ్ విషయాలు