AP Cabinet Meeting: కాసేపట్లో ఏపీ కేబినెట్.. అజెండా ఇదే..
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ..
- కేబినెట్ ముందు కీలక అంజెండా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Meeting: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మరి కాసేపట్లో సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.. మొత్తం 20 అంశాల ఎజెండాతో ఏపీ కేబినెట్ సమావేశం అవుతుంది.. SIPB లో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తేలపనుంది కేబినెట్. CRDA అధారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది మంత్రి మండలి.. అమరావతి లో సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది కేబినెట్.. సీఆర్డీఏ ఆథారిటీలో ఆమోదించిన 37,702 కోట్ల టెండర్ల గాను పనులు చేపట్టేందుకు ఆమోదం తెలపనుంది కేబినెట్.. ఇక, కేబినెట్ ఆమోదంతో టెండర్లు దక్కించుకున్న సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు జారీ చేయనుంది సీఆర్డీఏ.. ప్రస్తుతం సీఆర్డీఏ చేపట్టనున్న రూ.22,607 కోట్ల విలువైన 22 పనులకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.. అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపట్టిన రూ.15,081 కోట్ల విలువైన 37 పనులకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం.. అమరావతిలో పను సంస్థలకు భూ కేటాయిoపులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది..
Read Also: Pakisthan: పాకిస్తాన్ రైలు హైజాక్.. జాతీయ భద్రతపై కీలక సమావేశం
Also Read
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
మరోవైపు, మున్సిపల్ శాఖలోని పనుల ఏజెండాలకు ఆమోదం తెలపనుంది ఏపీ కేబినెట్.. గత ఎస్ఐపీబీ మీటింగ్ ఆమోదం తెలిపిన వాటికి ఆమోదముద్ర వేయనుంది.. 10 సంస్థల ద్వారా వచ్చే రూ.1,21,659 కోట్ల పెట్టుబడులపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది.. ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ నెల్లూరు జిల్లా నాయుడుపేట – రూ.1,742 కోట్ల పెట్టుబడులు కు ఆమోదం తెలపనుండగా.. దాల్మియా సిమెంట్ సంస్థ కడప జిల్లాలో – రూ.2,883 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.. ఇక, లులూ గ్లోబల్ ఇంటర్నేషనల్ సంస్థ విశాఖపట్నం నగరంలో రూ. 1,500 కోట్ల పెట్టుబడులతో ఇంటర్నేషనల్ కన్వెషన్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం.. సత్యవీడు రిజర్వ్ ఇన్ఫ్రాసిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ శ్రీసిటీలో, రూ. 25,000 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది.. ఇండోసాల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.58,469 కోట్ల పెట్టుబడులకు ఆమోద ముద్ర పడనుండగా.. బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.1,175 కోట్లు పెట్టుబడులకు ఆమోదం తెలపనున్నారు..
Read Also: Khakee The Bengal Chupur : బెంగాల్ టైగర్ ‘ఖాకీ’గా సౌరభ్ గంగూలీ
ఇక, ఏపీ ఎన్జీఈఎల్ హరిత్ అమ్రిత్ లిమిటెడ్ కంపెనీ.. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలలో రూ.22,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది కేబినెట్.. ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.. అన్నమయ్య, కడప జిల్లాలలో – రూ.8,240 కోట్లు పెట్టుబడులకు ఆమోద ముద్ర పడనుంది.. మేఫెయిర్ బీచ్ రిసార్ట్స్, కన్వెన్షన్ సంస్థ రూ. 400 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.. ఒబేరేయ్ విలాస్ రిసార్ట్ రూ. 250 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది.. ఈ పెట్టుబడుల ద్వారా 80 వేల ఉద్యోగ మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండగా.. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు.. ముందుగా 26 జిల్లాల్లో ఏర్పాటుకు అమోదం తెలపనుంది మంత్రివర్గం.. నెల రోజుల్లో రాష్ట్రంలో ఐదు చోట్ల 5 రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలు ఏర్పాటు.. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు కూడా ఇవాళ్టి కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపనున్నారు..
తాజావార్తలు
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!