Annavaram Satyanarayana Temple: అన్నవరం సత్యదేవుని ఆలయం భక్తులకు ఎంతో నమ్మకం.. రోజు వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు.. కార్తీక మాసం పర్వదినాలలో అయితే ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది.. అయితే, అన్నవరం సన్నిధిలో అపచారం జరిగింది.. స్వామివారికి సంబంధించిన సత్య నికేతన్ సత్రంలో మందు బాటిల్స్ కనిపించాయి.. ఒక్కసారి ఆకస్మిక తనిఖీలు చేస్తేనే ఇలా బయటపడ్డాయంటే ఇక ప్రతి చోట పరిస్థితులు ఎలా ఉంటాయో అనేది అర్థమవుతుంది.. ఇప్పటికైనా పూర్తిస్థాయి నిఘా పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు.. అయితే, స్వామివారికి కొండమీద, కింద కాటేజీలు ఉన్నాయి.. అవి భక్తులకు 24 గంటలకు కేటాయిస్తారు.. ఆన్ లైన్ లో కూడా బుక్ చేసుకునే సౌలభ్యం ఉంది.. ఈవో సుబ్బారావు ఆకస్మికంగా సత్రం గదులను తనిఖీ చేయడంతో.. సత్య నికేతన్ లో ఖాళీ మద్యం సీసాలు కనిపించాయి.. ఎంతో విశిష్టత, ప్రాముఖ్యత గల ఆలయంలో ఇటువంటి వ్యవహారాలకి కారణం ఎవరి అనేది ఇంకా తెలియలేదు.. అయితే, ప్రస్తుతం అన్ సీజన్ కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు నామమాత్రంగానే వస్తున్నారు.. దాంతో సత్రం గదులకు అంత డిమాండ్ లేదు.. కేవలం కొండపైన మాత్రమే ఫుల్ అవుతున్నాయి.. కొండ కింద ఉన్న సత్యనికేతన్ లో 7 గదులలో గత కొద్ది రోజులుగా ఆలయ సిబ్బంది బందోబస్తుకు వచ్చిన పోలీసులు ఉంటున్నారు.. వారిలో ఎవరు ఈ విధంగా మద్యం బాటిల్స్ తీసుకుని వచ్చారు అనేది తేలాల్సి ఉంది.. దేవస్థానంకు సంబంధించిన సత్రం గదులలో ఇటువంటి అపచారం పనులు చేసిన వారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.
Read Also: Mitraaw Sharma: బ్యాంకాక్ పారిపోయిన హర్షసాయి.. మిత్రాశర్మ సంచలనం!
అనధికారికంగా గదులు ఏ విధంగా కేటాయిస్తారు అనేది కూడా తేల్చాల్సి ఉంది. భక్తులకు ఒక రోజుకి ఒక గదికేటాయించాలంటే సవాలక్ష నిబంధనలు ఉంటాయి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు సత్రం గదులు పోలీసులకు దేవస్థానం సిబ్బందికి ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి.. అసలు అక్కడ ఉన్న మద్యం సీసాలు ఎవరు తీసుకుని వచ్చారు.. అనేది కూడా విచారణ చేస్తున్నారు.. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు.. దానిపై పూర్తిస్థాయి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఈవో అధికారులను ఆదేశించారు.. స్వామివారి సన్నిధిలో ఇటువంటి పాపపు పనులు చేసిన వారిపై చర్యలు తీసుకోనున్నారు.. సామాన్య భక్తులని కట్టడి చేయాల్సిన దేవస్థానం సిబ్బంది పోలీసులు ఈ విధంగా వ్యవహరించారు.. మిగతా చోట్ల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా అయోమయంగా మారింది.. ఇటువంటి వ్యవహారాలు ఎప్పటినుంచి జరుగుతున్నాయనేది శాఖా పరంగా విచారణ చేయాల్సి ఉంది.. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వ్యవహరించడంతో ఆలయ ప్రతిష్ట అంతకంతకు దిగజారుతుంది.. సామాన్యులకు చుక్కలు చూపించే అధికారులు ఇంటి దొంగలను మాత్రం పట్టలేకపోతున్నారు.. స్వయంగా జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్న పరిస్థితులు మాత్రం మారడం లేదు.. దానిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు..