kavali Greeshma: ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కావలి గ్రీష్మ.. ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.. దీంతో.. ఏపీ మహిళా కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు గ్రీష్మ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె అయిన కావలి గ్రీష్మ.. ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.. ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన ఏపీ మహిళా కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తూ లేఖ సమర్పించారు గ్రీష్మ. ఇక, గ్రీష్మ రాజీనామాను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీచేసింది ప్రభుత్వం. మరోవైపు.. జీతభత్యాలు, అలెవెన్స్ లో కేటగిరి – బీలో ఉన్న మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని త్వరలో భర్తీ చేసే యోచనలో ఉంది కూటమి ప్రభుత్వం..
Read Also: Pumpkin Seeds: గుమ్మడికాయ గింజలతో ఇన్ని బెనిఫిట్సా.. తెలిస్తే వదలరు..!
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో.. అన్ని స్థానాలు ఏకగ్రీవమైన విషయం విదితమే.. ఐదు స్థానాలకు మొత్తం ఐదు నామినేషన్లు మాత్రమే దాఖలు అయ్యాయి.. దీంతో జనసేన నుంచి బరిలో నిలిచిన కొణిదల నాగబాబు, టీడీపీ నుంచి నామినేషన్లు వేసిన బీద రవిచంద్ర, బి.తిరుమల నాయుడు, కావలి గ్రీష్మ, బీజేపీ నుంచి పోటీ చేసిన సోము వీర్రాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించడం.. ఎన్నికైన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేసిన విషయం విదితమే..