ఏపీలో తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి.. ఆ తుది జాబితా ప్రకారం ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,14,40,447కు పెరిగింది.. అందులో పురుష ఓటర్ల సంఖ్య 2,03,52,816గా ఉండగా.. మహిళా ఓటర్ల సంఖ్య 2,10,84,231గా ఉంది.. ఇక, థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య 3400గా ప్రకటించింది ఈసీ.. వెలగపూడి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం నుంచి ఈ జాబితాను విడుదల చేశారు..
తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని లేనిపక్షంలో కారుణ్య ఆత్మహత్యకు అయినా అనుమతించాలని కోరుతూ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన నక్క సునీత అనే మహిళ ప్రజావాణిని ఆశ్రయించింది. ముగ్గురు మానసిక దివ్యాంగులైన పిల్లలతో ఉపాధి లేక పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. ముగ్గురు పిల్లలు మానసిక దివ్యాంగులు కావడంతో తన భర్త ఉపాధి కొరకు గల్ఫ్ దేశానికి వలస వెళ్లినట్లు సునీత తెలిపింది.
మరోసారి తనకు ముఖ్యమంత్రి పదవి ఎలా వచ్చింది అనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, ప్రస్తుత బీజేపీ నేత నల్లారి కిరణ్కుమార్ రెడ్డి.. నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఈ సందర్భంగా వివిధ అంశాలపై మాట్లాడారు.. నేను ముఖ్యమంత్రి పదవి ఎవరినీ అడగలేదు అన్నారు.. అందుకోసం ఎవరికీ కనీసం కప్పు టీ కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు.. కానీ, పదవి వచ్చినప్పుడు ప్రజలకు ఎలా మేలు చేయాలనేది ఆలోచించాను.. అంతేకాదు.. ప్రజలకు మేలు చేయాలనే తలంపుతోనే ముఖ్యమంత్రి…
రోడ్లు వేయకుండా అడ్డుకుంటే ఊరుకోబోమని సర్పంచ్లను హెచ్చరించారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి.. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలో ఈరోజు పర్యటించిన ఆమె.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
శ్రీశైలంలో రద్దీ రోజులలో మల్లన్న స్పర్శదర్శనంలో మార్పులు చేస్తూ నిర్ణయించింది.. సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తూ స్పర్శదర్శనంలో మార్పులు చేసింది దేవస్థానం.. ఇక, మీదట ప్రతి శనివారం, ఆదివారం, సోమవారం ప్రభుత్వ సెలవు రోజుల్లో రోజుకు 2 విడతలుగా మాత్రమే స్పర్శ దర్శనం కల్పించనున్నారు.. రద్దీ రోజుల్లో ప్రతి విడతకు 500 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంచనుంది దేవస్థానం.. ఈ సమయంలో ఉదయం 7:30 గంటలకు.. తిరిగి రాత్రి 9 గంటలకు మాత్రమే శ్రీస్వామివారి స్పర్శ దర్శనం కల్పించనున్నారు..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లో ఓ పాము హల్చల్ చేసింది.. అమలాపురంలోని కలెక్టర్ కార్యాలయంలో పాము కనిపించడంతో ఉద్యోగులు, సిబ్బంది హడలిపోయారు.. అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశమయ్యే గోదావరి భవన్లోకి భారీ పాము చేరడంతో ఉద్యోగులను హడలెత్తించింది.
ముంబై తరహాలో ఏపీకి విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా మారుతుందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నేవీ డే సందర్భంగా వైజాగ్లోని ఆర్కే బీచ్లో భారత నౌకాదళ విన్యాసాలను తిలకించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ రక్షణ, విపత్తుల నిర్వహణలో తూర్పు నావికాదళం సేవలు అద్భుతమైనవి అన్నారు.. ఈస్ట్ కోస్ట్ లో ఎకనామిక్ యాక్టివిటీ పరిరక్షణ బాధ్యత నేవీ తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు..
నేవీ డే సందర్భంగా వైజాగ్లోని ఆర్కే బీచ్లో భారత నౌకాదళ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. విశాఖలో నేవీ వేడుకలు అబ్బురపరిచాయి.. నేవీదళ విన్యాసానాలతో ఆర్కే బీచ్ యుద్ధ భూమిని తలపించింది.. శక్తి యుక్తులు ప్రదర్శించాయి అత్యాధునిక యుద్ధ విమానాలు, నౌకలు.. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఎయిర్ షో నిలిచింది..
పోలవరం ఏ ఒక్క ప్రాంతానికో వరం కాదు.. రాష్ట్ర రైతాంగానికి ఇదో గొప్ప వరం అన్నారు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. కన్న తల్లికి దణ్ణం పెట్టలేని జగన్.. తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరమని దుయ్యబట్టిన ఆయన.. 9 వేల మంది పోలవరం నిర్వాసితులకు దాదాపు వెయ్యి కోట్లు.. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా, సీఎం చంద్రబాబు నాయుడు సూచనలతో విడుదల చేశాం అన్నారు.