ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం జిల్లాలో పర్యటిస్తున్నారు.. రెండో రోజు బిజీబిజీగా గడపనున్నారు సీఎం చంద్రబాబు.. పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో పాల్గొననున్నారు..
పల్నాడు జిల్లాలో తృటిలో రైలు ప్రమాదం తప్పింది.. దాచేపల్లి మండలం శ్రీనివాసపురం రైల్వే గేటు వద్ద పట్టాలు తప్పింది గూడ్స్ రైలు... నడికుడి నుండి పొందుగుల మధ్యలో ఈ ఘటన జరిగింది..
శ్రీశైలంలో ఈనెల 11 నుండి 17 వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు.. పంచాహ్నికదీక్షతో 7 రోజులపాటు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.. ప్రతి సంవత్సరం సంక్రాంతి, శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం దేవస్థానం ఆనవాయితీగా వస్తుంది.. అయితే, ప్రతీ ఏడాది సంక్రాంతి బ్రహ్మోత్సవాల తర్వాత.. శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించే విషయం విదితమే..
హెచ్ఎంపీవీ వైరస్ పై ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు అంటున్నారు సీనియర్ వైద్య నిపుణులు.. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని చెబుతున్నారు.. ఇక, అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలును తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.. అన్ని చర్యలు చేపట్టాలని ఆరోగ్య శాఖను ఆదేశించారు.. హెచ్ఎంపీవీ వైరస్ పై హెల్త్ డిపార్ట్మెంట్ కు దిశా నిర్దేశం చేశారు..
ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం దృష్టి పెట్టింది.. రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ ఆథారిటీలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులపై మంత్రి నారాయణ డ్రైవ్ నిర్వహించారు.. ప్రతి దరఖాస్తుకు సంబంధించి పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు పెండింగ్ లో ఎందుకు పెట్టాల్సి వచ్చిందో అధికారులను వివరణ అడిగారు మంత్రి.. భవనాలు, ప్లాట్లు కొనుగోలుచేసేవారు ప్రకటనలు చూసి మోసపోకుండా ఉండేలా చూడటమే రెరా లక్ష్యం అన్నారు..
HMPVపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఈ టెలీ కాన్ఫెరెన్స్‌లో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. HMPVకు సంబంధించి ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ముందుకెళ్లాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు.. వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉంది.. ప్రస్తుతం ఏ రాష్ట్రాల్లో కేసులు నమోదు చేశారనే వివరాలను సీఎం చంద్రబాబుకు వివరించారు అధికారులు..
విచారణ అనంతరం ఈడీ కార్యాలయం దగ్గర మీడియాతో మాట్లాడారు విజయసాయిరెడ్డి.. కాకినాడ సీ పోర్ట్ విషయంలో ఈడీ నన్ను విచారించింది.. 25 ప్రశ్నలు అడిగారు.. కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు చేసింది.. కేవీ రావు నాకు తెలియదు అని చెప్పాను.. అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు... కాకినాడ సీ పోర్ట్ విషయంలో కేవీ రావుకు ఎక్కడ నేను ఫోన్ చేయలేదని స్పష్టం చేశారు.
మరోసారి తన సొంత జిల్లా.. ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. కుప్పం గ్రామీణ మండలం నడుమూరులో పీఎం సూర్య ఘర్ యోజన పథకం కింద ప్రజలకు రాయితీతో ప్రతి ఇంటికి సౌర విద్యుత్ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సీఎం చంద్రబాబు..