Perni Nani: ఏపీలో లేని లిక్కర్ స్కాం పేరు చెప్పి కూటమి ప్రభుత్వం ఏదో ఒక రకంగా తప్పుడు ఆరోపణలతో మాజీ సీఎం వైఎస్ జగన్ ను అరెస్ట్ చేయాలని చూస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని.. ఎక్సైజ్ శాఖలో ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి గతంలో తనను బెదిరిస్తున్నారని హైకోర్టు న్యాయమూర్తులకు విన్నవించారని.. ఇప్పుడు ఆయనను బెదిరించి తప్పుడు స్టేట్మెంట్ లు తీసుకున్నారన్నారు. అమాయకుల పేర్లు చెప్పి ఏదో ఒక రకంగా జగన్ ను ముద్దయిని చేయాలని చూస్తున్నారన్నారు.. ఏదో ఒక రకంగా జగన్ ను అరెస్ట్ చేయాలనే ఉద్దేశ్యమే వారిలో కనిపిస్తోందన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.. టీడీపీ గూటికి చేరి చిలక పలుకులు పలుకుతున్నారన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మీ పేరు లేకపోయినా.. ఎవరి పేరు మీద మీరు పెట్టుబడులు పెట్టారో మీ అంతరాత్మను తెలుసన్నారు.. తప్పుడు వాంగ్మూలాలతో కౌరవ సభలో మాట్లాడినంత మాత్రాన జంకేది లేదన్నారు నాని.. చిలక పలుకులు పలుకుతున్న కృష్ణదేవరాయలు స్కిల్ స్కాంలో చంద్రబాబుకి ఇచ్చిన ఈడీ, ఐటీ నోటీసులపై కూడా మాట్లాడాలని డిమాండ్ చేశారు పేర్ని నాని..
Read Also: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. వరంగల్ వాసితో సహా ముగ్గురు మావోయిస్టులు హతం..
ఏపీలో లిక్కర్ వ్యాపారం జరిగినప్పుడు ఏం తప్పులు జరిగాయని మీరు అనుకుంటున్నారు.. ఆ సమయంలో మీరు వైసీపీలో ఉన్నారు.. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు.. గతంలో డిస్టలరీలకు చెల్లించిన రేటెంత.. ఇప్పుడు చెల్లిస్తున్న రేటెంత..అంటూ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుపై ప్రశ్నల వర్షం కురిపించారు పేర్నినాని.. ఇవాళ మద్యం షాపులను వచ్చిన వారి దగ్గర నుంచి బెదిరించి లోబరచుకున్నారని ఆరోపించిన ఆయన.. ఎమ్మెల్యే నుంచి సీఎం వరకు దండుకుంటున్నారు.. ఆఖరికి గీత కార్మికులకు ఇచ్చిన షాపులు కూడా బలవంతంగా లాక్కుంటున్నారని విమర్శించారు.. మీ సీఎం చంద్రబాబుకు ఇచ్చిన ఐటీ నోటీసులపై కూడా మాట్లాడాలి.. ఈడీ నోటీసు సగంలో ఎందుకు పక్కనపెట్టారో చెప్పాలి.. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ లీలలు కూడా అడగండి.. స్కిల్ స్కాం స్టార్ట్ అవగానే ఆయన ఏమై పోయారు.. అప్పుడు ఎక్కడికి వెళ్ళారు.. ఎప్పుడు వచ్చారు.. ఏం చేస్తున్నారు.. ఇవన్నీ అడగాలని సూచించారు మాజీ మంత్రి పేర్నినాని..