సిస్కోతో ఏపీ ఒప్పందం.. ఐటీ, అడ్వాన్స్‌డ్ కోర్సులో 50 వేల మందికి శిక్షణ..
కూటమి ప్రభుత్వంలో ఐటీ, విద్యాశాఖల బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. విద్యారంగంలో పలు విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు మంత్రి నారా లోకేష్.. ఇప్పటికే పలు సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకోగా.. ఇప్పుడు ఐటీ, అడ్వాన్స్‌డ్ కోర్సుల్లో స్కిల్ డెవలప్‌మెంట్‌పై కూడా ఫోకస్ పెట్టారు.. దీని కోసం సిస్కోతో ఒప్పందం కుదుర్చుకున్నారు.. మంత్రి నారా లోకేష్ సమక్షంలో సిస్కో – ఏపీఎస్ఎస్ డీసీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.. ఒప్పందం ద్వారా 50 వేల మంది యువతకు డిజిటల్, ఐటీ నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత, వృత్తివిద్య అభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఐటీ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రఖ్యాత ఐటీ సంస్థ సిస్కోతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం జరిగిందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు మంత్రి నారా లోకేష్.. ఉండవల్లి తన నివాసంలో ఇరుపక్షాల ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు. విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను విస్తరించడానికి నెట్‌వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ వంటి రంగాలలో అత్యాధునిక కంటెంట్‌ను సిస్కో అందిస్తుందని.. ఈ ఒప్పందం ద్వారా 50వేల మంది యువతకు డిజిటల్, ఐటీ నైపుణ్యాభివృద్ధికి సిస్కో శిక్షణ అందించనుందని తెలిపారు. నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నైపుణ్యాల అంతరాన్ని తగ్గించడం, ఉపాధిని పెంపొందించడమే ఈ ఒప్పందం లక్ష్యంగా ట్వీట్ చేశారు మంత్రి నారా లోకేష్..
వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిసాయి.. దీంతో, తీర్పు రిజర్వ్ చేసింది సీఐడీ కోర్టు.. అయితే, వల్లభనేని వంశీ బెయిల్‌పై ఈ నెల 27వ తేదీన తీర్పు ఇవ్వనుంది సీఐడీ న్యాయస్థానం.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ ఇవ్వాలంటూ సీఐడీ కోర్టును ఆశ్రయించారు వంశీ.. మరోవైపు వంశీకి బెయిల్ ఇవ్వద్దని.. అతడికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న కోర్టులో వాదనలు వినిపించారు సీఐడీ తరపు న్యాయవాది.. ఇక, ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్ చేసింది.
కడప మేయర్‌పై ఎమ్మెల్యే మాధవి సంచలన వ్యాఖ్యలు.. చర్యలు తప్పవు..!
కడప మేయర్ సురేష్‌బాబుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే మాధవి.. అవినీతి అక్రమాలకు పాల్పడిన మేయర్ సురేష్ బాబు పై చర్యలు తప్పవని హెచ్చరించారు.. అధికారం ఉందని అవినీతికి పాల్పడితే సహించేది లేదన్నారు. మేయర్ అవినీతి అక్రమాలు చేశారని ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసుకు ఆయన సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. అయితే, తనకు ఇంత వరకు సోకాజ్ నోటీసు అందలేదని.. నోటీసులు అందిన వెంటనే స్పందిస్తానని పేర్కొన్నారు కడప మేయర్ సురేష్ బాబు.. తనపై కక్ష సాధింపు చర్యలలో భాగంగానే ఈ షోకాజ్ నోటీసు జారీ చేశారని ఆరోపించారు.. ఇంత వరకు తనకు మాత్రం నోటీసు అందలేదని, అయితే వాళ్ల ప్రభుత్వం కాబట్టి ఎమ్మెల్యే మాధవి.. బై హ్యాండ్ నోటీస్ తీసుకుని ఉండవచ్చనని అన్నారు.. కానీ, తనకు నోటీసు అందిన వెంటనే వాళ్లు చేసిన అవినీతి అక్రమాలను బయటపెడతానని వివరించారు కడప మేయర్ సురేష్ బాబు.. కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కడపలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.. ఎమ్మెల్యే వర్సెస్ మేయర్‌గా కడపలో పరిస్థితి తయారైన విషయం విదితమే..
వల్లభనేని వంశీకి మళ్లీ షాక్.. ఏప్రిల్ 8 వరకు..!
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి షాక్ తగిలింది.. వంశీకి రిమాండ్‌ను ఏప్రిల్ 8వ తేదీ వరకు పొడిగించింది విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు.. సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో ఇవాళ వల్లభనేని వంశీ రిమాండ్ ముగియడంతో.. ఆయన్ని కోర్టులో హాజరుపరిచారు జైలు అధికారులు.. ఈ కేసులో ఏ-1గా ఉన్న వల్లభనేని వంశీతో పాటు.. ఏ-4 గంటా వీర్రాజు.. ఏ-7 ఎలినేని వెంకట శివరామ కృష్ణ ప్రసాద్. ఏ -8 నిమ్మల లక్ష్మీపతి, ఏ-10 వేల్పూరు వంశీని కూడా కోర్టులో హాజరుపర్చారు.. అయితే, రిమాండ్‌ను ఏప్రిల్ 8వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చారు న్యాయాధికారి.. దీంతో.. వల్లభనేని వంశీకి మరోసారి షాక్ తగిలినట్టు అయ్యింది..
ఏదో రకంగా జగన్‌ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు..! మాజీ మంత్రి సంచలన ఆరోపణలు
ఏపీలో లేని లిక్కర్ స్కాం పేరు చెప్పి కూటమి ప్రభుత్వం ఏదో ఒక రకంగా తప్పుడు ఆరోపణలతో మాజీ సీఎం వైఎస్ జగన్ ను అరెస్ట్ చేయాలని చూస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజ మంత్రి పేర్ని నాని.. ఎక్సైజ్ శాఖలో ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి గతంలో తనను బెదిరిస్తున్నారని హైకోర్టు న్యాయమూర్తులకు విన్నవించారని.. ఇప్పుడు ఆయనను బెదిరించి తప్పుడు స్టేట్మెంట్ లు తీసుకున్నారన్నారు. అమాయకుల పేర్లు చెప్పి ఏదో ఒక రకంగా జగన్ ను ముద్దయిని చేయాలని చూస్తున్నారన్నారు.. ఏదో ఒక రకంగా జగన్ ను అరెస్ట్ చేయాలనే ఉద్దేశ్యమే వారిలో కనిపిస్తోందన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.. టీడీపీ గూటికి చేరి చిలక పలుకులు పలుకుతున్నారన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మీ పేరు లేకపోయినా.. ఎవరి పేరు మీద మీరు పెట్టుబడులు పెట్టారో మీ అంతరాత్మను తెలుసన్నారు.. తప్పుడు వాంగ్మూలాలతో కౌరవ సభలో మాట్లాడినంత మాత్రాన జంకేది లేదన్నారు నాని.. చిలక పలుకులు పలుకుతున్న కృష్ణదేవరాయలు స్కిల్ స్కాంలో చంద్రబాబుకి ఇచ్చిన ఈడీ, ఐటీ నోటీసులపై కూడా మాట్లాడాలని డిమాండ్ చేశారు పేర్ని నాని..
గుడ్‌న్యూస్ చెప్పిన మున్సిపల్ శాఖ.. 50 శాతం రాయితీ..
ఆస్తి పన్ను బకాయిదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేసేందుకు ఏపీ మున్సిపల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.. ఆస్తి పన్నుపై వడ్డీలో రాయితీ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు మున్సిపల్ శాఖ అధికారులు.. ఈ నెలాఖరు వరకు అంటే 31 ఏప్రిల్ 2025 దాకా పెండింగ్ ఉన్న వడ్డీ బకాయిల్లో 50 శాతం రాయితీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ మున్సిపల్ శాఖ.. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, పేరుకుపోయిన కోట్లాది రూపాయిల ఆస్తి పన్ను వసూలు కోసం.. రాయితీపై నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. కాగా, పేరుకుపోయిన మొండి బకాయిలను వసూలు చేసేందుకు ఆర్థిక సంవత్సరం ముగింపులో కొన్నిసార్లు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటూ వస్తోన్న విషయం విదితమే.. ఇప్పటికే తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోనూ ఈ తరహా స్కీమ్ తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూడా వడ్డీ రాయితీని ప్రకటించి.. చెల్లింపు దారులకు కొంత వరకు ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తోంది.
తెలంగాణలో అసెంబ్లీలో కీలక పరిణామం.. స్పీకర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో హరితహారం కార్యక్రమంపై ఆసక్తికరమైన చర్చ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో 200 కోట్ల మొక్కలు నాటామని, దీంతో రాష్ట్రంలోని అటవీ కవచం 7 శాతం పెరిగిందని వివరించారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందిస్తూ, హరితహారం పేరుతో నాటిన మొక్కల్లో ఆరోగ్యానికి హానికరమైన కోనోకార్పస్ చెట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ చెట్లు ఆక్సిజన్ ఉత్పత్తికి ముప్పుగా మారుతాయని, పైగా అవి పక్షులకు కూడా సహజ వాతావరణాన్ని అందించలేవని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ చెట్లు కొద్ది మాత్రమే నాటినట్లు సమర్థించగా, స్పీకర్ పెద్ద ఎత్తున నాటినట్లు స్పష్టం చేశారు. హైవేలు, డివైడర్లు సహా అనేక ప్రాంతాల్లో ఇవి కనిపిస్తున్నాయని, కాబట్టి వీటిని వెంటనే తొలగించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
వర్షాకాల సమావేశాల్లో కొత్త “ఇన్‌కమ్ టాక్స్ బిల్లు”..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లును చర్చకు తీసుకుంటామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం తెలిపారు. ఆమె లోక్‌సభలో ఆర్థిక బిల్లు 2025పై చర్చలపై సమాధానమిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఫిబ్రవరి 13న సభలో ప్రవేశపెట్టిన కొత్త ఇన్‌కమ్ టాక్స్ బిల్లు ప్రస్తుతం సెలెక్ట్ కమిటీ పరిశీలిస్తుందని ఆమె చెప్పారు. పార్లమెంట్ తదుపరి సమావేశాల మొదటిరోజు సెలక్ట్ కమిటీ తన నివేదిక సమర్పిస్తుందని నిర్మాలా సీతారామన్ అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సాధారణంగా జూలైలో ప్రారంభమై ఆగస్టు వరకు కొనసాగుతాయి. 1961 ఆదాయపు పన్ను చట్టంలోని పలు అంశాలను సరళీకృతం చేసి కొత్త బిల్లును తీసుకువస్తున్నట్లు ఆదాయ పన్ను శాఖ ఇంతకుముందు తెలిపింది. కొత్త బిల్లులో పదాల సంఖ్య 2.6 లక్షలు. ఐటీ చట్టంలోని 5.12 లక్షల కన్నా తక్కువ. ప్రస్తుతం చట్టంలో 819 సెక్షన్లకు గానూ సెక్షన్ల సంఖ్య 536గా ఉంది. చాప్టర్ల సంఖ్యను 47 నుంచి 23కి తగ్గించారు. కొత్తగా తీసుకువస్తున్న ఇన్‌కమ్ టాక్స్ బిల్ -2025లో పాత బిల్లులోని 1200 నిబంధనలు, 900 వివరణలను తొలగించారు.
రన్యా రావు కేసులో సంచలనం.. హవాలా డబ్బుతో బంగారం కొన్నట్లు వెల్లడి..
సినీ నటి, బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిన రన్యా రావు కేసులు సంచలనం నమోదైంది. బంగారం కొనుగోలుకు హవాలా మార్గాల్లో డబ్బును బదిలీ చేసినట్లు అంగీకరించింది. ఈ విషయాన్ని ఆమె బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ విషయాన్ని పేర్కొంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) న్యాయవాది మధురావు ఈ వాదనను వినిపించారు. నిందితురాలు అనధికార మార్గాల ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు అంగీకరించారని ఆయన కోర్టులో వాదించారు. ఈ విషయంపై న్యాయ విచారణ ప్రారంభించాలని అధికారులు సెక్షన్ 108 కింది నోటీసులు జారీ చేశారు. ఈ విచారణ న్యాయ విచారణలో భాగమని, పోలీసు విచారణ కాదని అధికారులు స్పష్టం చేశారు. ఆర్థిక అవకతవకలు ఎంత వరకు జరిగాయనేది, చట్టం ఉల్లంఘించారా..? లేదా..? అనేది గుర్తించడం ఈ దర్యాప్తు లక్ష్యం. 12 కోట్ల రూపాయల విలువైన 14.8 కిలోగ్రాముల బంగారాన్ని భారతదేశానికి అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై రన్యా రావును మార్చి 4, 2025న అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి తిరిగి వస్తుండగా బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడింది. నడుము బెల్టులో బంగారాన్ని తరలిస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) కనుగొంది. మొత్తం ఆమె నుంచి రూ. 17.29 కోట్ల విలువైన బంగారం, నగదుని స్వాధీనం చేసుకున్నారు. రన్యా రావు దాదాపుగా 30 సార్లు దుబాయ్‌కి వెళ్లి వచ్చినట్లు గుర్తించారు. ప్రతీ సందర్భంలోనూ ఆమె పెద్ద మొత్తంలో బంగారం స్మగ్లింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఆమె అక్రమంగా తరలించే ప్రతీ కిలో బంగారానికి లక్ష రూపాయాలు సంపాదించిందని, ఒక్కో ట్రిప్పుకు రూ. 12-13 లక్షలు సంపాదించేదని తెలిసింది. దీనికి తోడు ఆమె సవతి తండ్రి కర్ణాటక డీజీపీ(కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్) కే రామచంద్రారావు కావడంతో ఈ కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఈయనను కర్ణాటక ప్రభుత్వం సెలవులపై పంపింది.
స్టేడియంలోకి వెళ్లి కోహ్లీని హగ్ చేసుకున్న అభిమాని.. సీక్రెట్స్ వెల్లడి..!
ఐపీఎల్ 2025 ప్రారంభ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని కలవడానికి ఓ అభిమాని గ్రౌండ్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో 18 ఏళ్ల యువకుడు రీతుపర్ణో పఖిరా అనే యువకుడు కోహ్లీని కలవడానికి మైదానంలోకి పరుగెత్తుకొచ్చాడు. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ జరుగుతుండగా.. కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గ్రౌండ్‌లోకి వచ్చాడు. కోహ్లీ దగ్గరికి వచ్చి అతని పాదాలను తాకాడు. అంతేకాకుండా.. కోహ్లీని పైకెత్తి కౌగిలించుకున్నాడు. యువకుడు గ్రౌండ్ లోకి రావడం చేసి వెంటనే భద్రతా సిబ్బంది అతన్ని బయటికి తీసుకెళ్లారు. అతన్ని తీసుకెళ్లే ముందు.. కోహ్లీ అతనిని ఏమొనద్దని సూచించాడు. “నేను కోహ్లీ సర్ పాదాలను తాకిన వెంటనే ఆయన నా పేరు అడిగి, ‘జల్దీ సే భాగ్ జా (వేగంగా పారిపో)’ అని చెప్పారు. అంతేకాకుండా.. భద్రతా సిబ్బంది నన్ను కొట్టవద్దని కూడా కోరారు” అని రీతుపర్ణో పఖిరా టైమ్స్ ఆఫ్ ఇండియాకు వెల్లడించాడు.
డేవిడ్ వార్నర్ కు తెలుగు నేర్పిస్తున్న శ్రీలీల, నితిన్.. నవ్వులే నవ్వులు..
ఆస్ట్రేలియా క్రికెటర్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు తెలుగునాట ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. ఆయన తాజాగా తెలుగు సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చేశాడు. నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా వస్తున్న రాబిన్ హుడ్ సినిమాలో ఆయన కీలక పాత్రలో నటిస్తున్నారు. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా ఆయన వచ్చారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముందు వార్నర్ కు నితిన్, శ్రీలీల కలిసి తెలుగు నేర్పిస్తున్న వీడియోను తాజాగా మూవీ టీమ్ విడుదల చేసింది. ఇందులో వార్నర్ కు వీరిద్దరూ కలిసి తెలుగు నేర్పిస్తున్న విధానం నవ్వులు పూయిస్తోంది. ‘వార్నర్ భాయ్.. నువ్వు స్టేజి మీదకు వచ్చిన తర్వాత నితిన్ అంటే నాకు పిచ్చి అని చెప్పాలి’ అంటూ నితిన్ చెప్పాడు. దానికి డేవిడ్ కూడా నాకు నితిన్ అంటే పిచ్చి అంటూ చెప్పుకొస్తాడు. అటు శ్రీలీల కూడా.. ‘నాకు శ్రీలీల అంటే ఎవరూ నచ్చరు’ అని డేవిడ్ తో పలికించింది. వార్నర్ కూడా అదే ప్రాక్టస్ చేసాడు. ఇలా వీరిద్దరూ తమకు కావాల్సిన వాటిని వార్నర్ నుంచి చెప్పించుకోవడం వీడియోలో కనిపిస్తోంది. అయితే వాటి అర్థాలను కూడా వారు తప్పుగా చెప్తారు. తెలుగు ఆడియెన్స్ అంటే నీకు ఇష్టం అనే అర్థం వస్తుంది అన్నట్టు వార్నర్ కు చెప్పడంతో అతను నమ్మేస్తాడు. ఇలా ఫన్నీగా ఈ వీడియో సాగిపోతుంది. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. వార్నర్ ను బాగా వాడేస్తున్నారంటూ ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. వార్నర్ పాత్ర ఎలా ఉంటుందో అని చాలా మంది సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. వార్నర్ గతంలో చాలా తెలుగు సినిమాల పాటలకు ఫ్యామిలీతో కలిసి డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే.
మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ విడుదల వాయిదా
తెలుగు సినిమా ప్రియులకు ఎంతో ఆసక్తికరమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచిన “మ్యాడ్ స్క్వేర్” సినిమా ట్రైలర్ రిలీజ్ వాయిదా పడింది. ఈ చిత్రం గతంలో విడుదలైన “మ్యాడ్” సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది, మరియు దీని ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజా నిర్ణయంతో ట్రైలర్ విడుదల కొంత ఆలస్యం కానుంది. ఈమేరకు నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశారు. ఈరోజు విడుదల కావాల్సిన #MadSquareTrailer విదేశాల్లో ప్రింట్ డిస్పాచ్‌ల కారణంగా కొంచెం ఆలస్యమవుతోంది. సినిమాకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో, మేము ట్రైలర్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది! ఆలస్యానికి క్షమాపణలు. MADMAXX ట్రైలర్ రేపు ఉదయం విడుదల అవుతుంది! అని ఆయన రాసుకొచ్చారు. “మ్యాడ్ స్క్వేర్” సినిమా యువతను ఆకట్టుకునే కథాంశంతో, హాస్యం మరియు ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన చిత్రంగా రూపొందుతోంది. మొదటి భాగం “మ్యాడ్” విజయం సాధించిన నేపథ్యంలో, ఈ సీక్వెల్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతోంది.
డేవిడ్ వార్నర్ కు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు
రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటకిరీటి రాజేద్రప్రసాద్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. రాజేంద్ర ప్రసాద్, డేవిడ్ వార్నర్‌ను ఉద్దేశించి, “రేయ్ డేవిడ్, వచ్చి క్రికెట్ ఆడవయ్యా అంటే పుష్ప స్టెప్పులు వేస్తావా, దొంగ ము** కొడకా, నువ్వు మామూలోడివి కాదు రోయ్ వార్నరూ” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. ఎంతో అనుభవం గల నటుడు స్టార్ క్రికెట్ పై ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటని ఏకిపారేశారు. ఈ నేపథ్యంలో ఈ వివాదానికి చెక్ పెట్టేందుకు నటుడు రాజేంద్రప్రసాద్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వార్నర్ కు బహిరంగ క్షమాపణలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్లందరికి నమస్కారం. రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈ వెంట్ లో డేవిడ్ వార్నర్ పై అనుకోకుండా నోటి నుంచి మాట దొర్లింది. అది ఉద్దేశ్య పూర్వకంగా మాట్లాడింది కాదు. ఈవెంట్ కంటే ముందు అంతా కలిసే ఉన్నాం. ఎంతో సరదాగా గడిపాము. నితిన్ ను, వార్నర్ ను మీరంతా నా పిల్లల్లాంటి వారు అని అన్నాను. మేమంతా ఒకరికొకరం క్లోజ్ అయిపోయాం. ఐలవ్ వార్నర్.. ఐ లవ్ క్రికెట్.. డేవిడ్ వార్నర్ లవ్ అవర్ ఫిలిమ్స్.. లవ్ అవర్ యాక్టింగ్.