Vallabhaneni Vamsi Case: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి షాక్ తగిలింది.. వంశీకి రిమాండ్‌ను ఏప్రిల్ 8వ తేదీ వరకు పొడిగించింది విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు.. సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో ఇవాళ వల్లభనేని వంశీ రిమాండ్ ముగియడంతో.. ఆయన్ని కోర్టులో హాజరుపరిచారు జైలు అధికారులు.. ఈ కేసులో ఏ-1గా ఉన్న వల్లభనేని వంశీతో పాటు.. ఏ-4 గంటా వీర్రాజు.. ఏ-7 ఎలినేని వెంకట శివరామ కృష్ణ ప్రసాద్. ఏ -8 నిమ్మల లక్ష్మీపతి, ఏ-10 వేల్పూరు వంశీని కూడా కోర్టులో హాజరుపర్చారు.. అయితే, రిమాండ్‌ను ఏప్రిల్ 8వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చారు న్యాయాధికారి.. దీంతో.. వల్లభనేని వంశీకి మరోసారి షాక్ తగిలినట్టు అయ్యింది..
Read Also: Telangana Assembly : తెలంగాణలో అసెంబ్లీలో కీలక పరిణామం.. స్పీకర్ సంచలన వ్యాఖ్యలు
కాగా, వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిసాయి.. దీంతో, తీర్పు రిజర్వ్ చేసింది సీఐడీ కోర్టు.. అయితే, వల్లభనేని వంశీ బెయిల్‌పై ఈ నెల 27వ తేదీన తీర్పు ఇవ్వనుంది సీఐడీ న్యాయస్థానం.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ ఇవ్వాలంటూ సీఐడీ కోర్టును ఆశ్రయించారు వంశీ.. మరోవైపు వంశీకి బెయిల్ ఇవ్వద్దని.. అతడికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న కోర్టులో వాదనలు వినిపించారు సీఐడీ తరపు న్యాయవాది.. ఇక, ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్ చేసిన విషయం విదితమే..