ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు.. మాజీ సీఎం వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్.. గుంటూరులో మీడియాలో మాట్లాడిన ఆయన.. జగన్ ఒక్క ఛాన్స్ మాత్రమే అడిగారు.. రెండో ఛాన్స్ లేదు.. అడిగినా ప్రజలు అవకాశం ఇవ్వరు అని పేర్కొన్నారు.. మళ్లీ ఏపీలో జగన్ బలపడే అవకాశం లేదని జోస్యం చెప్పారు.. ఇక, జమిలి వస్తే చంద్రబాబుకు నష్టం.. అందుకే జమిలి ఎన్నికలకు చంద్రబాబు ఒప్పుకోరని పేర్కొన్నారు..
ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు తన పదవీ విరమణ ఫేర్వెల్ పరేడ్‌లో భావోద్వేగానికి గురయ్యారు.. నా జీవితంలో ఇవి ఉద్విగ్నభరిత క్షణాలు.. సర్వీసులో ఉన్నపుడు చేసిన పనులు నా జ్ఞాపకాలు.. దశాబ్దాలుగా నన్ను అంటిపెట్టుకుని ఉన్న యూనిఫాం ఇకపై ఉండదు అనేది ఎమోషన్‌గా అనిపించిందని పేర్కొన్నారు.. ఇన్నాళ్ల పాటు సర్వీసులో ఉన్న నాకు అనేక మంది సహకరించారు.. సర్వీసులో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సవాళ్లను చూశాను అన్నారు..
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తుపాకీతో కాల్చుకొని సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) మృతి చెందిన ఘటన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ రోజు చోటుచేసుకుంది. రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పని పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి.. ఇటీవల పలు ఆరోపణలు నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు. అయితే, ఈరోజు ఉదయం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆయన.. తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు.
తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయా..? పాత తరం నేతలను పక్కన పెట్టేసి.. యువతరానాకి పెద్దపీట వేయనున్నారా? ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.. ఇవాళ టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం జరగనుంది.. సాయంత్రం టీడీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం కానుంది పొలిట్‌బ్యూరో.. పార్టీ పదవుల విషయంలో మంత్ర నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలతో టీడీపీ పొలిట్‌బ్యూరోకు ప్రాధాన్యత ఏర్పడింది.
ఒకప్పుడు ప్రశాంతతకు నిలయంగా ఉండే కోనసీమ జిల్లాలో ఇప్పుడు గంజాయి వినియోగం కలకలం రేపుతోంది. జిల్లా కేంద్రం అమలాపురం నుంచి మారుమూల లోతట్టు గ్రామాల వరకు విచ్చలవిడిగా గంజాయి లభ్యమవుతోంది. కళాశాలలు, విద్యాసంస్థల వద్ద యదేచ్చగా గంజాయి అమ్మకాలు సాగుతున్నాయి. ఇటీవల జరిగిన పలు చోరీలు, నేరాలకు సంబంధించి గంజాయి వినియోగమే ప్రధాన కారణమన్న అంశం గూఢీ అవుతోంది. తాజాగా బైక్‌లను చోరీ చేస్తున్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పోలీసులకు తలతిరిగే సమాచారం అందుబాటులోకొచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో పర్యటించనున్నారు.. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజును పురస్కరించుకుని ఇక్కడ ప్రత్యేక పూజలు చేయనున్నారు సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు..
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?