Janasena: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ పీఠం అవిశ్వాస పరీక్షపై ఉత్కంఠ కొనసాగుతోంది.. ఆఖరి కొద్దిగంటల్లో వ్యూహాలు, ప్రతివ్యూహాలతో నేతల బుర్రలు వేడెక్కిపోతున్నాయి.. విదేశాల్లో క్యాంప్ ఎత్తేసి కార్పొరేటర్లను తెలుగుదేశం వెనక్కి రప్పించే స్తుండగా.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.. వైసీపీకి గుడ్‌బై చెప్పి.. జనసేన కండువా కప్పుకున్నారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌కి చెందిన పలువురు వైసీపీ కార్పోరేటర్లు.. మంత్రి, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు..
Read Also: RK Roja: తిరుమల మెట్లు అన్నీ కడగండి.. పవన్ కల్యాణ్‌కు రోజా సూచన
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో.. జనసేన పార్టీలో చేరారు.. గ్రేటర్ విశాఖ వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, జీవీఎంసీ కో ఆప్షన్ సభ్యులు బెహరా భాస్కరరావు, గాజువాక 74వ డివిజన్ కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి, గ్రేటర్ విశాఖ వైసీపీ యువజన విభాగం నాయకులు ఆళ్ల శివ గణేష్.. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీరంతా జనసేనలో చేరారు.. జీవీఎంసీ 91, 92 డివిజన్ల కార్పొరేటర్లు అయిన కుంచె జ్యోత్స్న, బెహరా స్వర్ణలత శివదేవి జనసేన తీర్థం పుచ్చుకున్నారు..