అర్ధరాత్రి విద్యార్థినుల గదిలో దూరిన ప్రిన్సిపాల్.. ట్విస్ట్ ఏంటంటే..?
తిరుపతిలోని ఓ నర్సింగ్ కాలేజీలో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది.. లీలామహల్ సర్కిల్ లో ఉన్న వర్మ కాలేజీ నర్సింగ్ హాస్టల్‌లోకి ప్రవేశించిన ప్రిన్సిపాల్.. అర్థరాత్రి విద్యార్థినుల గదిలోకి దూరాడట.. అయితే, అప్రమత్తమైన విద్యార్థినులు తమ గదిలోకి దూరిన ప్రిన్సిపాల్ వర్మను నిర్భందించారు.. ఆ తర్వాత అలిపిరి పోలీసులకు సమాచారం అందించారు నర్సింగ్ విద్యార్థినులు.. దీంతో, రంగంలోకి దిగిన అలిపిరి పోలీసులు.. ప్రిన్సిపాల్ వర్మను అదుపులోకి తీసుకున్నారు.. ఇక, అలిపిరి పోలీస్ స్టేషన్ ఎదుట విద్యార్థినులు ఆందోళనకు దిగారు.. వర్మను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.. మరోవైపు.. పక్క భవనంలో దూకిన విద్యార్థిని నిలదీసిన ప్రిన్సిపాల్ వర్మ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు అంటూ కొందరు విద్యార్థినులు.. ప్రిన్సిపాల్‌కు బాసటగా నిలిచారు.. కేవలం రాత్రి సమయంలో వేరే చోటకు వెళ్తున్న వారిని నిలువరించేందుకు ప్రినిపాల్ వర్మను పిలిచినట్టు వారు చెబుతున్నారు.. దీంతో, ఈ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ వచ్చి చేరినట్టు కాగా.. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు విచారణ చేపట్టారు అలిపిరి పోలీసులు.. అయితే, విచారణ అనంతరం ప్రిన్సిపాల్ వర్మపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు అలిపిరి పోలీసులు.. మరోవైపు.. న్యాయం చేయాలంటూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు..
ఆంధ్రా to ఆంధ్రా వయా తెలంగాణ.. గళమెత్తిన కూటమిలోని మరో ఎమ్మెల్యే..!
ఆంధ్రా to ఆంధ్రా via తెలంగాణ.. ఇది విశాఖపట్నం వాసుల దుస్థితి అంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎక్స్ (ట్విట్టర్)లో పెట్టిన పోస్టు హాట్ టాపిక్‌గా మారింది.. అది కాస్తా వైరల్‌గా మారడంతో.. గంటా వ్యవహారంపై టీడీపీ అధిష్టానం సీరియస్‌గా స్పందించింది.. ప్రభుత్వం మనదే, విమానయాన మంత్రి మనవారే.. వారి దృష్టికి తీసుకురావొచ్చు కదా? అని ప్రశ్నించింది.. అంతేకాదు, మరోసారి ఇలాంటివి రిపీట్ కావొద్దు అంటూ హెచ్చరించింది.. అయితే, ఆంధ్రా టూ ఆంధ్రా వయా తెలంగాణ అంటూ కూటమిలోని మరో ఎమ్మెల్యే గళం ఎత్తారు.. మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ట్వీట్ తో ఏకీభవించారు బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు… ఉదయంపూట విజయవాడకు విమాన కనెక్టివిటీ లేదన్న ఆయన.. విజయవాడలో పార్టీ మీటింగ్ లు, ప్రభుత్వ అవసరాలకు వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు.. ఎమ్మెల్యేలను ముఖం మీద అడగలేకపోతున్నాయి.. కానీ, వ్యాపార వర్గాలు సహా అందరూ విశాఖను పూర్తిగా వదిలేశారని అభిప్రాయంతో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.. అసలు, రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా వుండి కూడా ఈ దుస్థితి ఎందుకో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు విష్ణుకుమార్ రాజు.. సమస్యను రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు..
ఎంపీ మిథున్‌రెడ్డికి సిట్ నోటీసులు.. హైకోర్టులో ఊరట..!
లిక్కర్ స్కాంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది సిట్.. ఈ నెల 19వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది సిట్.. ఇక, ఇదే కేసులో రేపు విచారణకు హాజరు కావాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చిన విషయం విదితమే.. కానీ, ఒకరోజు ముందుగానే సిట్ విచారణకు వస్తానని విజయసాయిరెడ్డి సమాచారం ఇవ్వడం.. సిట్ అంగీకరించడం జరిగిపోయాయి.. మరోవైపు, ఏపీ హైకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట దక్కింది.. ఎంపీ మిథున్‌రెడ్డి పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. లిక్కర్ స్కాంలో సిట్ విచారణకు న్యాయవాదిని అనుమతించింది.. అయితే, విచారణ సమయంలో స్టేట్‌మెంట్ రికార్డు చేయటంలో జోక్యం చేసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు.. స్టేట్‌మెంట్ ఆడియో, వీడియో రికార్డు చేయాలని ఎంపీ మిథున్ రెడ్డి లాయర్ కోరగా.. విజిబుల్ సీసీ కెమెరాలు ఉన్న చోట విచారణ జరపాలని ఆదేశించింది న్యాయస్థానం..
టీటీడీని అపవిత్రం చేసేందుకు వైసీపీ నేతల యత్నం..! మంత్రి ఆనం ఫైర్
టీటీడీ ఎస్వీ గోశాల వ్యవహారంపై పొలిటికల్ హీట్ పెరిగింది.. పాలక, ప్రతిపక్షాలు సవాళ్లు, ప్రతిసవాళ్లతో తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి ఆనం రామానారాయణరెడ్డి.. వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. టీటీడీని అపవిత్రం చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులను నిర్వీర్యం చేసి.. పాలక మండలిని అవమానకరంగా దూషించాలని తిరుపతి తిరుమలలో అదేపనిగా చేస్తున్నారు. ఏదైనా ఒక మంచి కార్యక్రమం వస్తే దాన్ని అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు.. కొత్త కార్యక్రమాలను ఇంకా బాగా చేసేందుకు సలహాలు సూచనలు ఇవ్వడం లేదు.. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు సలహాలు ఇవ్వరు.. కానీ, ఎదో ఒక బురద చల్లి.. వాతావరణాన్ని కలుషితం చేసేందుకే వైసీపీ నేతలు పనిచేస్తున్నారు.. బ్రహ్మోత్సవాల సమయంలో ఒక రకమైన నిందలు వేశారు.. ముక్కోటి ఏకాదశి నాడు మరో రకంగా చేశారు.. ఒంటిమిట్టలో గతంలో ఎన్నడూ లేనంత విధంగా కోదండ రామస్వామి కళ్యాణాన్ని చేస్తుంటే గోశాల గురించి మాట్లాడుతున్నారు.. ఇవన్నీ చూస్తుంటే వైసీపీ నాయకులకు ఈ ప్రభుత్వం మీద నిందలు మోపడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది అని మండిపడ్డారు.
తెలంగాణలో మరో భారీ పెట్టుబడి.. వ్యాపార దిగ్గజం మారుబెనీతో ఒప్పందం
సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే కీలకమైన పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. జపాన్ కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెనీ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేసేందుకు మారుబేని కంపెనీ సంసిద్ధత తెలిపింది. టోక్యోలో ఆ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు. దాదాపు రూ. 1,000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో మారుబెనీ కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. దశల వారీగా ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో ప్రపంచ స్థాయి, నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసుకుంది. అందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వ అధికారులు, కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు. జపాన్ కంపెనీలతో పాటు ఇతర మల్టీ నేషనల్ కంపెనీలు హైదరాబాద్‌లో తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేస్తారు. దీంతో దాదాపు రూ. 5,000 కోట్లకు పైగా పెట్టుబడును ఆకర్షించే అంచనాలున్నాయి.
కుంభమేళాలో కుల వివక్ష చూపించారు.
నేషనల్ హెరాల్డ్ కేసు చార్జ్‌షీట్‌లో రాహుల్ గాంధీ, సోనియాగాంధీల పేర్లు చేర్చడంపై కాంగ్రెస్ శ్రేణులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ వెంకట్, మాజీ ఎంపీ విహెచ్‌తో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ, కాంగ్రెస్ పార్టీ తప్పుడు వ్యవహారాలపై పోరాటం చేస్తుందని ప్రకటించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీకి తగిన సందేశాన్ని పంపినట్లు ఆమె తెలిపారు. “బీజేపీని ఓడగొట్టడమే మా లక్ష్యం,” అని ఆమె చెప్పారు. మీనా నటరాజన్ మాట్లాడుతూ, “మోడీ సర్కార్ కక్షపూరిత రాజకీయాలు చేస్తూ, రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు దేశంలో ఆందోళన పరిస్థితి నెలకొంది. భవిష్యత్తు తరానికి మంచి జరుగుతుందో లేదో అనే భయం ప్రజల మదిలో పెరిగింది.” ఆమె కుంభమేళా సందర్భంలో కూడా కుల వివక్ష చూపించారని మండిపడ్డారు. “హిందూ రాష్ట్రంలో పేద గుడిసెలో నివసించే ప్రజలను చెత్త వేసేదగ్గర, డంపింగ్ యార్డ్ వద్ద ఉంచుతారు. ఈ సమయములో వారు హిందువులా కాకుండా మానవత్వాన్ని కోల్పోతారు,” అంటూ ఆమె అన్నారు.
డ్రైవర్ల పనిగంటలపై ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఇటీవల కాలంలో భారతదేశంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరుగుతన్నాయి. ఈ ప్రమాదాలు జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో పని గంటలు కూడా ఓ కారణం. ఎక్కువ సేపు డ్రైవింగ్ చేయడం వల్ల డ్రైవర్లు అలసిపోతుంటారు. నిద్రలోకి జరుకోవడం, తీవ్ర నీరసం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డ్రైవర్లకు పనిగంటల విధానం అమలుపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని కేంద్ర రోడ్డు రవాణ, రహదారుల మంత్రిత్వ శాఖకు సుప్రీంకోర్టు సూచించింది. ప్రమాదంలో గాయపడిన వారికి సత్వరమే చికిత్స అందించేందుకు వీలుగా మార్గదర్శకాలను రూపొందించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఇందుకోసం ఆరు నెలల గడువును విధించింది. ఈ మేరకు జస్టిస్ అభయ్ ఒకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌తో కూడిని ద్విసభ్య ధర్మాసనం చెప్పింది. “దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో గాయపడినవారిలో చాలా మందికి సత్వరం చికిత్స అందడం లేదు. ఇంకా కొన్ని ఘటనల్లో గాయపడకపోయినా వాహనాల్లోనే చిక్కుకుపోతున్నారు. అందుకే వీరిని వేగంగా సాయం అందించే విధంగా ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం నిబంధనలు రూపొందించాలి.” అని సుప్రీంకోర్టు పేర్కొంది.
అత్త తన కోడలిపై గృహ హింస కేసు పెట్టవచ్చా? క్లారిటీ ఇచ్చిన హైకోర్టు!
అత్త తన కోడలిపై గృహ హింస కేసు పెట్టవచ్చా? అలహాబాద్ హైకోర్టులో ఈ ప్రశ్న ఉత్పన్నమైంది. అలహాబాద్ హైకోర్టులో ఓ అత్త తన కోడలు గృహ హింసకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు చేసింది. తాజాగా కోర్టులో ఈ కేసుపై విచారణ జరిగింది. విచారణ సమయంలో.. అత్తగారు తన కోడలిపై ఇలాంటి కేసు పెట్టవచ్చా? అనే ప్రశ్న తలెత్తింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గరిమా తన కోడలితో పాటు 5 గురు కుటుంబీకులపై ఈ ఫిర్యాదు చేసింది. ఈ ప్రశ్నపై హైకోర్టు స్పందించింది. అత్త తన కోడలిపై గృహ హింస చట్టం, 2005 కింద ఫిర్యాదు చేయవచ్చని హైకోర్టు పేర్కొంది. కోడలు, ఆమె కుటుంబంపై లక్నోలోని దిగువ కోర్టు జారీ చేసిన సమన్లను సమర్థిస్తూ జస్టిస్ అలోక్ మాథుర్ ఈ తీర్పును వెలువరించారు. చట్టంలోని సెక్షన్ 12ని పరిశీలించిన తర్వాత.. ఉమ్మడి కుటుంబంలో గృహ సంబంధంలో బాధిత స్త్రీ ఎవరైనా ఈ నిబంధన కింద ఫిర్యాదు చేయవచ్చని కోర్టు తెలిపింది. అత్త కోడలిపై గృహ హింస కేసు పెట్టలేరనే వాదనను కోర్టు తోసిపుచ్చింది.
జపాన్ పరిశోధకురాలిపై ప్రొఫెసర్ లైంగికంగా వేధింపులు.. తర్వాత ఏమైందంటే?
ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విదేశీ మహిళా పరిశోధకురాలిపై ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) విచారణ చేపట్టింది. ఆరోపణలు నిజమని తేలడంతో ప్రొఫెసర్‌ను తొలగించారు. ఈ వేధింపుల సంఘటన కొన్ని నెలల క్రితం ఒక విశ్వవిద్యాలయ కార్యక్రమంలో జరిగింది. నిందితుడైన ప్రొఫెసర్‌పై గతంలో కూడా అనేక ఫిర్యాదులు ఉన్నట్లు సమాచారం. జపాన్‌కు చెందిన ఓ విద్యార్థిని విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తోంది. యూనివర్సిటీ కార్యక్రమంలో భాగంగా ఆమెపై ఓ ఫ్యాకల్టీ సభ్యుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె జపాన్ తిరిగి వెళ్లిన అనంతరం ఈ విషయాన్ని దౌత్య మార్గాల ద్వారా భారత రాయబార కార్యాలయం దృష్టికి తీసుకెళ్లింది. అధికారిక ఫిర్యాదును దాఖలు చేసింది. ఈ అంశాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ, విశ్వవిద్యాలయం దృష్టికి తీసుకొచ్చింది.
ఐపీఎల్ లో ఫిక్సింగ్ ఆరోపణలపై పోలీసుల ఆరా..
ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగిపోతోంది. క్రికెట్ లవర్స్ కు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో ఫిక్సింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. భారత క్రికెట్ బోర్డ్ సైతం ఫిక్సింగ్ వ్యవహారంపై ఐపీఎల్ లోని 10 జట్లకు హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు 5 హాట్ ఫేవరేట్ టీమ్ ప్రాంచైజీలను కాంటాక్ట్ చేసినట్లు బీసీసీఐ ఆధారాలు సేకరించినట్లు టాక్ వినిపిస్తోంది. ఐపీఎల్ లో ఫిక్సింగ్ ఆరోపణలపై పోలీసుల ఆరా తీస్తున్నారు. ఆధారాలు ఇవ్వాలని పోలీసులు బీసీసీఐని కోరారు. ఐపీఎల్ మ్యాచుల్లో ఫిక్సింగ్ కి పాల్పడే అవకాశం ఉందని ఇప్పటికే బీసీసీఐ హెచ్చరించింది. హైదరాబాద్ కి చెందిన వ్యాపారవేత్తతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ కి చెందిన వ్యాపారవేత్త ఎవరు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఐసీసీ, బీసీసీఐ, స్థానిక క్రికెట్ క్లబ్లతో కాంటాక్ట్ ఉన్న వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ కి చెందిన ఐదుగురు వ్యాపారవేత్తలను పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని సదరు వ్యాపారవేత్త కాంటాక్ట్ అయి ఉండొచ్చని అనుమానిస్తు్న్నారు.
ఎలాంటి అప్ డేట్ లేకుండా.. సైలెంట్ గా OTT లోకి ‘శివంగి’
యంగ్ హీరోయిన్ ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘శివంగి’. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ థ్రిల్లర్ మూవీలో ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ లు అందించారు. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకుల్ని కట్టిపడేసే స్క్రీన్ ప్లే తో ఈ చిత్రం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇందులో భాగంగా తాజాగా ఎలాంటి ప్రకటన లేకుండా ఈ మూవీ సడెన్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘శివంగి’ మూవీ గురువారం నుంచి అంటే నేటి నుండి ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళ్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆహా ఓటీటీ సంస్థ వెల్లడించింది.. అలాగే ‘ఒకరోజు. జీవితాంతం పోరాటం. సత్యభామ కథ మిమ్మల్ని ప్రతిదానికి ప్రశ్నించేలా చేస్తుంది. అది హత్యా లేక ఆత్మహత్యా?’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
‘కూలీ’ తెలుగు హక్కుల కోసం భారీ డిమాండ్..
సూపర్ స్టార్ రజనీకాంత్ నుండి సినిమా వస్తుందంటే చాలు ఇండియా వైడ్‌గా ఆడియెన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. చాలా కాలం తర్వాత ‘జైలర్’ సినిమాతో సత్తా చాటి.. రజనీ మార్కెట్‌ని ఇండస్ట్రీకి తిరిగి పరిచయం చేశాడు. చివరగా ‘వేట్టయాన్’ చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాగా ఇప్పుడు ‘కూలీ’ చిత్రంతో రాబోతున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నా ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావచ్చింది. ఇప్పటికే రజనీకాంత్ కూడా తన షూటింగ్ పార్ట్ ను ముగించేశారు. బ్యాలెన్స్ షూటింగ్ పార్ట్ ను లోకేష్ కనగరాజ్ త్వరగా పూర్తి చేసే పనిలో నిమగ్నం అయ్యి ఉన్నారు.ఈ మూవీలో నాగార్జున ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే తాజాగా ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కానున్నట్లు చిత్రం బృదం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించగా.‘కూలి’ పై తెలుగు ప్రేక్షకులో కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానితో టీం ఈ సినిమా తెలుగు హక్కుల కోసం అత్యంత భారీ ధరను డిమాండ్ చేస్తున్నట్లు టాక్. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా తెలుగు వర్షన్ హక్కుల కోసం ఏకంగా రూ.40 కోట్ల వరకు మేకర్స్ డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం ఎంతుందో తెలిదు కానీ ఒకవేల వారు డిమండ్ చేసినట్లుగా రూ.40 కోట్లకు అమ్మినట్లయితే, దాదాపు ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ.80 కోట్లకు మించిన గ్రాస్ కలెక్షన్లను వసూలు చేయాలి. అలా అయితేనే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ స్టేటస్‌ను అందుకునే అవకాశం ఉంటుంది.