PM Modi Amaravati Tour: ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. రాజధాని అమరావతి ప్రాంతంలో ఆయన పర్యటన కొనసాగనుంది.. రాజధాని పునఃనిర్మాణ పనులను ప్రారంభించబోతున్నారు భారత ప్రధాన మంత్రి.. ఇప్పటికే ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం.. అందులో భాగంగా.. ప్రధాని మోడీ ఏపీ పర్యటన ఏర్పాట్లకు సంబంధించి ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు దారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. మంత్రులు పొంగూరు నారాయణ, నారా లోకేష్, పయ్యావుల కేశవ్, సత్యకుమర్ యాదవ్, నాదెండ్ల మనోహర్.. కొల్లు రవీంద్ర సభ్యులుగా ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేసిన కూటమి సర్కార్.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చే సింది. ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్ల పరిశీలన.. సభ జరిగే ప్రాంతంలో ఏర్పాట్లు … ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని నిర్ణయాలు తీసుకోనుంది కమిటీ. ఇప్పటికే ప్రధాని మోడీ పర్యటన కోసం నోడల్ ఆఫీసర్‌గా వీర పాండ్యన్‌ను నియమించింది ప్రభుత్వం..
Read Also: Pushpa-2 : ఇదేం ట్విస్ట్.. పుష్ప-2 మొత్తం వీఎఫ్ ఎక్స్ మాయే..
రాజధాని అమరావతి నిర్మాణాల పునఃప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఇప్పటికే ఖరారైంది. మే 2వ తేదీన సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులను ప్రారంభించనున్నారు ప్రధాని.. పునఃప్రారంభోత్సవ కార్యక్రమం కోసం సచివాలయం వెనక బహిరంగ సభ వేదికను ఏపీ సర్కారు ఎంపిక చేసింది. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని ప్రభుత్వం నియమించింది. మరోవైపు భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్యవేక్షిస్తోంది. రాజధాని నిర్మాణాల పునఃప్రారంభోత్సవ కార్యక్రమంకు 5 లక్షల మంది హాజరవుతారనే అంచనాతో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించారు.