Minister TG Bharat: ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో చిన్న చిన్న విభేదాలు ఉన్నట్టు.. కొన్నిసార్లు బహిర్గతం అవుతూనే ఉంది.. రాష్ట్రస్థాయిలో ఉన్న విభేధాలు తెరపైకి రాకపోయినా.. కొన్ని జిల్లాలు, ప్రాంతాల్లో పలు సందర్భాల్లో గొడవలకు దారి తీసిన సందర్బాలు కూడా ఉన్నాయి.. అయితే, కూటమిలో విభేదాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి టీజీ భరత్.. ఇంఛార్జ్ మంత్రిగా అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్టీఏ పార్టీల మధ్య చిన్న, చిన్న విబేధాలు సహజం అన్నారు.. ఇవన్నీ ఒక కుటుంబంలో సభ్యుల మధ్య జరుగుతున్నవే.. అవన్నీ చర్చించుకుని అందరం ఐక్యంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.
కొన్ని సమస్యల్ని కలెక్టర్, ఎస్పీల దృష్టికి తీసుకెళ్తాం అన్నారు టీజీ భరత్.. అయితే, వైసీపీ నుంచి వచ్చే వారిని పార్టీల్లో చేర్చుకునే వాటిపై వివా ఉందన్నారు టీజీ భరత్.. కానీ, మా ఎన్డీఏ పార్టీలు అన్నీ కలిసి చర్చించుకున్న తర్వాత చేరికలు ఉంటాయని వెల్లడించారు.. ఇక, జూన్ లోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తవుతుంది.. నామినేటెడ్ పోస్టుల విషయంలో చిన్న, చిన్న అసంతృప్తులు సహజమే అన్నారు.. అవన్నీ పార్టీలో చర్చించుకుని పరిష్కరించుకుంటామని వెల్లడించారు మంత్రి టీజీ భరత్.. మరోవైపు.. టీటీడీ ఎస్వీ గోశాల వ్యవహారంపై స్పందించిన మంత్రి.. పని లేని వారే గోశాల గురించి దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు.. తిరుమల గోశాలలో ఎలాంటి నిర్లక్ష్యం లేదు.. సహజంగా ఎక్కడైనా గోశాలలో ఆవుల సహజ మరణాలుంటాయి అని పేర్కొన్నారు మంత్రి టీజీ భరత్..