YS Jagan: ఎవ్వరినీ వదలం.. ఎక్కడున్నా.. కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకోండి అని సూచించారు వైఎస్ జగన్.. వైసీపీ కేంద్ర కార్యాలయంలో అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలతో పాటు ఆయా జిల్లాల ముఖ్య నేతలతో ప్రత్యేకంగా భేటీ అయిన వైఎస్ జగన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మీ బాధలు చూస్తున్నాను.. హామీ ఇస్తున్నాను.. కేవలం వైసీపీని ప్రేమించినందుకు, పార్టీని అభిమానించినందుకు కార్యకర్తలు పడుతున్న బాధను చూశాను.. అందుకే జగన్ 2.0 లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాను. వారికి పూర్తి న్యాయం చేస్తాను.. ఎవ్వరినీ వదలం.. ఎక్కడున్నా.. కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకోండి.. అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడదామని హెచ్చరించారు.
Read Also: Kurnool Court: వైసీపీ మాజీ ఎమ్మెల్యే భర్త హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు..
ఈరోజు చంద్రబాబు, పోలీసులు చేస్తున్న దుర్మార్గం.. వారు ఏదైతే విత్తనం వేస్తున్నారో రేపు అదే పెరుగుతుందన్నారు జగన్.. అందుకే ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు.. ఆరోజు ఎక్కడున్నా, రిటైర్ అయినా, సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం.. అది మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చారు.. పశ్నించకూడదని నిరంకుశత్వం, డైవర్షన్.. ఈరోజు తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలు. సంబంధం లేకున్నా కేసుల్లో ఇరికిస్తున్నారు.. ఇలాంటి రాజకీయాలు గతంలో ఏనాడూ చూడలేదు.. చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే, ఆయన ప్రజల్లో చులకన అయ్యారు. హామీలు అమలు చేయడం లేదు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది.. ఎవరూ ప్రశ్నించకూడదని, రాష్ట్రంలో భయానక పరిస్థితి సృష్టిస్తున్నాడని పేర్కొన్నారు.. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ప్రజల్లో వ్యతిరేకత కనిపించినా, వెంటనే డైవర్షన్. ఒకరోజు తిరుపతి లడ్డూ అంటాడు. ఇంకోరోజు సినీ నటి కేసు అంటాడు.. వారికి ప్రజల్లో వెళ్లే ధైర్యం లేదు.. ప్రజలు అడిగే ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేడు. టీడీపీ వారు ఎక్కడికి వెళ్ళినా.. ఏం జరుగుతుంది.. నా 15 వేలు ఏమయ్యాయని పిల్లలు, మా 26 వేలు ఏమయ్యాయని రైతులు, అవ్వలు వారి 48 వేలు, యువత తమ 36 వేలు ఏమయ్యాయని అడుగుతారు.. ఎన్నికల ముందు మాట ఇచ్చి, మోసం చేయడంతో సమాధానం చెప్పలేని దుస్థితి. అన్ని వ్యవస్థలు నాశనం. నిర్వీర్యం చేశారని మండిపడ్డారు వైసీపీ అధినేత వైఎస్ జగన్..