Kurnool Court: వైసీపీ మాజీ ఎమ్మెల్యే భర్త హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు..
- వైసీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో తీర్పు..
- 11 మందికి జీవిత ఖైదు విధించిన కర్నూలు జిల్లా కోర్టు..
- 2017 మే 21వ తేదీన హత్యకు గురైన నారాయణరెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurnool Court: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి భర్త చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో సంచలన తీర్పు వెలువరించింది కర్నూలు జిల్లా కోర్టు.. ఈ కేసులో నిందితులగా ఉన్న 11 మందికి జీవిత ఖైదు విధించింది.. ఈ మేరకు జిల్లా జడ్జి కబర్ది తీర్పు చెప్పారు. 2017 మే 21న వివాహానికి వెళ్లి వస్తుండగా కృష్ణగిరి మండలం రామకృష్ణాపురం శివారులో నారాయణరెడ్డి వాహనాన్ని అడ్డగించి నరికి హత్య చేశారు. ఈ హత్య కేసులో మొత్తం 19 మంది నిందితులు కాగా ఒకరు మృతి చెందారు. ఇద్దరిని కేసు నుంచి తొలగించారు. ఇక, 11 మంది నిందితులకు జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.వెయ్యి జరిమానా విధించింది కోర్టు.. రామాంజనేయులు, రామానాయుడు, రామకృష్ణ, బాలు, చిన్న ఎల్లప్ప, పెద్ద ఎల్లప్ప, వెంకట్రాముడు, గంటల శ్రీను, నారాయణ, బీసన్న గారి రామాంజనేయులు, పెద్ద బీసన్న కు జీవిత ఖైదు శిక్షపడిన వారిలో ఉన్నారు.
Read Also: Operation Sindoor: “ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు”: రాజ్‌నాథ్ సింగ్..
Also Read
- Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
- Kurnool Ganesh Immersion: వినాయక నిమజ్జనంపై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన.. కర్నూలులో ఎక్కడంటే?
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- Kurnool High Court Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్.. మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు
2017 మే 21న కృష్ణగిరి మండలంలో వైసీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకు గురయ్యారు.. ఈ కేసులో 29 మంది సాక్షులను విచారించింది కోర్టు.. అందులో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. మరోవైపు, ప్రస్తుత పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, దేవనకొండకు చెందిన కప్పట్రాళ్ల బుజ్జమ్మ పేర్లను గతంలోనే.. న్యాయస్థానం ఆదేశాల మేరకు తొలగించారు..
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?