మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఉండవల్లి.. ఏపీకి పవన్ కల్యాణ్ ఆశాజ్యోతిగా కనిపిస్తున్నారని పేర్కొన్నారు.. ఇప్పుడు రాష్ట్ర అవసరాలు, విభజన హామీలు సాధించుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి..
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముక్కు సూటి. మోనార్క్ ఎవరంటే...టక్కును గుర్తొచ్చే పేరు బొల్లా బ్రహ్మనాయుడు. ఆ మాజీ ఎమ్మెల్యేపై వైసీపీ నాయకులు తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. వినుకొండ ఎమ్మెల్యేగా పని చేసిన బ్రహ్మనాయుడు...అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీ నాయకులనే కాదు...సొంత పార్టీ నాయకులను ఓ రేంజ్లో ఆడుకున్నారు.
అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి.. బీఆర్ఎస్ పాలనలో రెండుసార్లు మంత్రిగా పని చేశారు. దేవాదాయ, ఉమ్మడి జిల్లాలోనే ఆయన కీలకంగా వ్యవహరించారు. బీఆర్ఎస్ పాలనలో ఆయన చెప్పిందే వేదం అన్నట్టు సాగింది. మంత్రి పదవే కాదు...ఏ ఎన్నికలు వచ్చినా...పార్టీ ఏది చెప్పినా ఆయనే ముందు వరుసలో ఉండేవారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత మహేశ్వర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకే పార్టీ మారేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు...ఇంద్రకరణ్ రెడ్డి రాకను వ్యతిరేకించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ పాలన సాగుతోంది. కూటమి ప్రభుత్వంగా ఒక్కటిగా ఉన్నా.. పార్టీల పరంగా ఎవరిదారిలో వారు వెళ్తున్నారు. రాజకీయంగా బలపడే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా ఇటీవలే బీజేపీ కొన్ని చేరికలపై దృష్టి పెట్టింది... మొన్న రాజ్యసభలో కృష్ణయ్య కు అవకాశం ఇచ్చింది.. అలాగే కొంతమంది నేతలను చేర్చుకునే పనిలో పడింది బీజేపీ. అ
ఏపీ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటిషన్ దాఖలు చేశారు.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కాసరనేని వెంకట పాండురంగారావు పై గత ఏడాది జరిగిన దాడికి సంబంధించి నమోదైన కేసులో పోలీసులు తనను ఇరికించే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు వంశీ..
మెగా బ్రదర్ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారని కొంతకాలంగా ఏపీ పాలిటిక్స్‌లో చర్చ జరిగింది. ఆ ఊహాగానం నిజమే అని స్వయంగా సీఎం చంద్రబాబు ఆ మధ్య క్లారిటీ ఇచ్చారు. దానికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు రాజకీయ చరిత్రలో ఒక వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకుంటామని సీఎం మీడియాకు నోట్ ఇచ్చిన సందర్భాలు బహుశా లేవేమో! ఒక్క నాగబాబు విషయంలోనే ఇలా జరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు.. అన్ని పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలు పనితీరుపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది..
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలోని పూతరేకులు తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు నిర్వహించారు. కల్తీ నెయ్యితో కొందరు దుకాణదార్లు పూతరేకులు తయారు చేస్తున్నట్లుగా గుర్తించడం సంచలనంగా మారింది. దాడుల్లో ఎటువంటి బ్రాండ్ లేని 160 కేజీల కల్తీ నెయ్యి సీజ్ చేసి ఎనిమిది షాపులపై కేసులు నమోదు చేశారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూతరేకు స్వీట్ లో కొందరు అధిక లాభాల కోసం కల్తీ నెయ్యిని కలుపుతున్నట్లుగా ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులు దాల్ నిర్వహించడం సంచలనంగా మారింది..
దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు.. అభివృద్ధికి సూచికలు అని వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తిరుపతి వేదికగా 2వ ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పోను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్‌తో కలిసి ప్రారంభించారు చంద్రబాబు.. మూడు రోజుల పాటుఈ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో కొనసాగనుంది.. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 55 కోట్లు మంది కుంభమేళాలో పవిత్రమైన స్నానాలు ఆచరించారు.. అంటే, దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు.. అభివృద్ధికి…
జనసేన ఆవిర్భావ వేడుకలపై అధికారికంగా ఓ ప్రకటన చేసింది జనసేన పార్టీ.. వచ్చే నెల 14న జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నారు.. ఈ సారి పిఠాపురంలో ఆవిర్భావ వేడుకల నిర్వహణకు జనసేనాని నిర్ణయం తీసుకుంది.. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నాయి జనసేన శ్రేణులు.. ఈ మేరకు పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు..