శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మీదికి మరో అస్త్రం సంధించారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. వైసీపీలో ఉన్న శిల్పా.. జనసేనలో చేరేందుకు లోలోపల ప్రయత్నాలు చేసుకుంటున్నారంటూ పెద్ద బాంబే పేల్చారు. టీడీపీతోనూ మంతనాలు జరుపుతున్నారని, ఆయన మీద కేసులు పడకుండా కొందరు తెలుగుదేశం నాయకులు రక్షిస్తున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల్లో ఇప్పుడిదే చర్చనీయాంశం అయింది
టీడీపీ విమర్శలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. బిగ్ బ్లాస్ట్ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేసింది.. వంశీ అరెస్టు లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ కుట్రలు చేస్తుందని.. గన్నవరం కేసులో కట్టుకథలు, కల్పితాలు, తప్పుడు సాక్ష్యాలు, అక్రమ అరెస్టులు అంటూ ఆరోపించింది.. కోర్టు ముందు సత్యవర్ధన్ స్టేట్మెంటే అందుకు నిదర్శనం.. చంద్రబాబు సర్కార్ కుట్రను బయటపెట్టిన సత్యవర్దన్ ఫిబ్రవరి 10, 2025 నాటి స్టేట్మెంట్ ఇచ్చారు..
ఆంధ్రప్రదేశ్‌లో ఓ యూట్యూబర్ అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు.. అనంతపురం జిల్లాలో ఈ ఘటన జరిగింది.. గుంతకల్ మండలం బుగ్గ సంఘాల గ్రామ సమీపంలో గత రెండు రోజుల క్రితం అదృశ్యమైన యూట్యూబర్ తిరుమలరెడ్డి.. మంగళవారం కసాపురం గ్రామ సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద శవమై తేలాడు..
"నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందనే శాపం మీకేమైనా ఉందా జగన్ రెడ్డి గారు?'' అంటూ ఎద్దేవా చేశారు.. పచ్చి అబద్దాలను కాన్ఫిడెంట్ గా చెప్పడంలో మీరు పీహెచ్డీ చేసినట్టు ఉన్నారు అంటూ దుయ్యబట్టారు.. మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనే భ్రమలోంచి ఇకనైనా బయటకు రండి అని సూచించారు.. 100 మందికిపైగా వైసీపీ రౌడీలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి చేయడం కోట్లాది ప్రజలు కళ్లారా చూశారని గుర్తుచేశారు..
విజయవాడ జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ను పరామర్శించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్.. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.. అయితే, జగన్ వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్‌కు దిగింది తెలుగుదేశం పార్టీ.. టీడీపీ సీనియర్ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.. ఆ సమావేశంలో సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసిన దృశ్యాలు విడుదల చేశారు..
ప్రతిపక్షం అసెంబ్లీకి రాకపోయినా సమావేశాలను సీరియస్ గా తీసుకోవాలని సీఎం చంద్రబాబు మంత్రులు ఎమ్మెల్యే లకు చెబుతున్నారు.... ప్రతిపక్షం లేదని లైట్ తీసుకోవద్దన్నారు సీఎం...అధికార ప్రతిపక్ష పాత్ర రెండూ కూటమి నుంచే ఉండాలని ఆదేశాలు వెళ్లాయి
వల్లభనేని వంశీ మోహన్ కేసులో మరో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. కేసులో కీలకంగా ఉన్న సత్యవర్థన్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.. ఈ నెల 11వ తేదీన వల్లభనేని వంశీ, సత్యవర్దన్ సహా ఐదుగురిపై FIR రిజిస్టర్ చేశారు పోలీసులు.. 84/2025 కేసులో ఏ5గా ఉన్నారు సత్యవర్థన్.