What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* అమరావతి: ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ భేటీ.. ఈ సమావేశానికి కొంతమంది మంత్రులకు కూడా ఆహ్వానం.. ఇవాళ్టి సమావేశం తర్వాత కీలక నిర్ణయాలు ఉండే అవకాశం
* నేడు కరీంనగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి.. చొప్పదండిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ముఖ్యమంత్రి.. అనంతరం గుములాపూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్న రేవంత్
Also Read
- Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
- AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
* అమరావతి: ఇవాళ మధ్యాహ్నం. 3 గంటలకు జలవనరుల శాఖ ఆధ్వర్యంలో అమరావతిలో సాగునీటి సంఘాల అధ్యక్షులతో భారీ సమావేశం. రాయపూడి దగ్గర పెరేడ్ గ్రౌండ్ ప్రాంతంలో సమావేశం.. హాజరుకానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ఇరిగేషన్ వ్యవస్థ.. లోటుపాట్లు పై చర్చ.
* నేడు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన.. శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్న జగన్.. ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి భీమవరం చేరుకోనున్న జగన్.. అక్కడి నుంచి పెదఅమిరం చేరుకుని శ్రీ రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్‌లో వివాహ వేడుకలో పాల్గొంటారు.. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అక్కడినుంచి తిరుగుపయనమై తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
* రేపు ఇబ్రహింపట్నంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన.. దాడికి గురైన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబానికి పరామర్శ.. ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ఇబ్రహింపట్నం బయలుదేరుతారు.. 11 గంటలకు ఇటీవల దాడికి గురైన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు..
* హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్ ఇవాళ్టి షెడ్యూల్.. ఉదయం 10 గంటలకు అంబర్పేట్ నియోజకవర్గం, నల్లకుంట డివిజన్, వెంకటేశ్వర నగర్, నరసింహ బస్తీ లో కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన.. సాయంత్రం 4 గంటలకు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు .. సాయంత్రం 5.30కి సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు
* నేడు నిర్మల్, భైంసా లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల ప్రచార సభలు.
* తూర్పుగోదావరి జిల్లా: నేడు మండపేట నియోజకవర్గంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన .. పలు అభివృద్ధి, అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనంతరం నియోజకవర్గంలోని అధికారులతో సమీక్షా సమావేశం.. అలాగే స్థానిక ప్రజలతో ముఖాముఖి
* కర్నూలు: నేడు కోడుమూరులో వసంతోత్సవంతో ముగియనున్న శ్రీ చౌడేశ్వరిదేవి రథోత్సవం మహోత్సవాలు
* విజయవాడ: నకిలీ మద్యం తయారీ కేసులో జోగి బ్రదర్స్ బెయిల్ రద్దు చేయాలని సిట్ పిటిషన్ పై నేడు ఎక్సైజ్ కోర్టు విచారణ
* విజయవాడ: మాజీ మంత్రులు విడదల రజనీ, కాకాణి తమపై నమోదైన కేసులు క్వాష్ చేయాలని దాఖలు చేసిన పిటిషన్లు నేడు విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు.. మాజీ మంత్రి జోగి రమేష్ తనపై కేసులు క్వాష్ చేయాలని దాఖలు చేసిన పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు తీర్పు
* నంద్యాల: నేడు జూపాడు బంగ్లా మం పోతురెడ్డిపాడు వద్ద రాయలసీమ లిఫ్ట్ పనులు చేపట్టాలని వైసీపీ ఆందోళన.. భారీ బహిరంగ సభ.. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జీలతో ఇప్పటికే నిర్వాహక సమావేశాలు.. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి భారీ ఎత్తున పాల్గొననున్న వైసీపీ శ్రేణులు, అనుబంధ సంఘాలు, రైతులు
* అనకాపల్లి జిల్లా: నేడు పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి అనిత పర్యటన. ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డు ఆదర్శ పాఠశాలలో ‘విద్యాదీప్తి సంస్కార స్ఫూర్తి కార్యక్రమం’లో పాల్గొనున్న హోం మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నైతిక విలువలు) చాగంటి కోటేశ్వరరావు.. విద్యార్థులకు విద్య విలువలు, వ్యక్తిత్వంపై మార్గనిర్దేశం చేయనున్న చాగంటి కోటేశ్వరరావు.. సాయంత్రం ఉపమాక శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణలో చాగంటి ప్రవచనాల్లో పాల్గొనున్న హోం మంత్రి
* నేడు గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ.
* నంద్యాల: నేడు శ్రీశైలంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్ సమావేశం.. దేవస్థానంలోని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై అధికారులతో సమీక్ష
* కర్నూలు: నేడు టీడీపీ జిల్లా అధ్యక్షురాలుగా గుడిసె కృష్ణమ్మ, ప్రధాన కార్యదర్శిగా నాగరాజు ప్రమాణస్వీకారం
* తిరుమల: 9 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం .. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 68,586 మంది భక్తులు .. తలనీలాలు సమర్పించిన 24,764 మంది భక్తులు .. హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు
* కరీంనగర్ జిల్లా: నేడు హుజూరాబాద్ నియోజక వర్గం లో పర్యటించనున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఉదయం 10 గంటలకు హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో 11 గంటలకు జమ్మికుంట గాంధీ చౌక్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం లో పాల్గొనున్న మంత్రి.
* నేడు కరీంనగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి.. చొప్పదండిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ముఖ్యమంత్రి.. అనంతరం గుములాపూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్న రేవంత్
తాజావార్తలు
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!