Minister Nara Lokesh: అది రాష్ట్ర చరిత్రను మార్చిన రోజు.. ప్రజాస్వామ్యం గెలిచిన రోజు.. జూన్ 4వ తేదీ చరిత్రలో నిలిచిపోయే రోజు అన్నారు మంత్రి నారా లోకేష్.. రాజధాని అమరావతిలో సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై “సుపరిపాలనలో తొలి అడుగు” పేరిట నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. గెలిచింది కూటమికాదు.. ప్రజలు అని పేర్కొన్నారు.. విధ్వంసపాలనపై ప్రజా తిరుగుబాటుగా అభిర్ణించారు.. అయితే, ఐదేళ్లలో సాధించలేనిది ఏడాదిలోనే సాధించాం.. ఉద్యోగులే ప్రభుత్వానికి గుండెకాయ.. ప్రజలకు చేరువగా వెళ్లి సేవలందించండి.. అంటూ సుపరిపాలన – తొలిఅడుగు సభలో మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు..
Read Also: Dil Raju: ఐకాన్ లో అల్లు అర్జున్ లేడు?
రాష్ట్ర చరిత్రను మార్చిన రోజు, ప్రజాస్వామ్యం గెలిచిన రోజు.. బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం గొప్పతనం ఏంటో మరోసారి తెలిసిన రోజు జూన్ 4 అన్నారు ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్… అందరూ కూటమి గెలిచింది, టిడిపి గెలిచింది, జనసేన గెలిచింది, బిజేపి గెలిచింది అంటున్నారు. కానీ, గెలిచింది కూటమి కాదు గెలిచింది ప్రజలు.. 94 శాతం స్ట్రైక్ రేట్ ..164 అవుట్ ఆఫ్ 175.. ప్రజలు రికార్డులు బద్దలు కొట్టారు. చరిత్రను తిరగరాసారు. ఇది ప్రజా విజయంగా అభివర్ణించారు.. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలు చేసేవారు చెడ్డవారు అయితే చెడ్డ ఫలితాలే వస్తాయని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు.. మనం గత ఐదేళ్లు విధ్వంస పాలన చూశాం అన్నారు.. 10 లక్షల కోట్లు అప్పు చేసారు.. ఆంధ్రప్రదేశ్ ను అప్పులప్రదేశ్ గా మార్చేసారు. ఒక్క కొత్త కంపెనీ తీసుకురాలేదు.. ఉన్న కంపెనీలను తరిమేసారు. దేశంలో ఎక్కడైనా పెట్టుబడులు పెడతాం.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పెట్టుబడులు పెట్టం అని ఒక పెద్ద కంపెనీ అధినేత ప్రకటించారు. ఆ రోజు పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడానికి అదో ఉదాహరణగా పేర్కొన్నారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ రికార్డు మెజార్టీలతో గెలుస్తుంది..!
ఐదేళ్లలో ఒక్క రోడ్డు వెయ్యలేదు.. కనీసం రోడ్డుపై గుంతలు పూడ్చలేదు.. ఒక్క సాగునీటి ప్రాజెక్టు కట్టలేదు.. రాయలసీమకు వరం లా ఉన్న డ్రిప్ ఇరిగేషన్ ను కూడా రద్దు చేసారని దుయ్యబట్టారు లోకేష్.. ఇక, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం ఇచ్చారు అంటూ ఎద్దేవా చేశారు.. కప్పుడు నీళ్లు పోసి కుప్పంకు నీరు ఇచ్చాం అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కు రెండుసార్లు శంకుస్థాపన చేసారే తప్ప ఒక్క ఇటుక పెట్టలేదు. విశాఖపట్నంలో 700 కోట్లతో రాయల్ ప్యాలస్ కట్టుకున్నారే తప్ప రైల్వే జోన్, విశాఖ ఉక్కు గురించి పట్టించుకోలేదు. ఐదేళ్లు అరాచక పాలన సాగింది. దళిత బిడ్డల్ని చంపి డోర్ డెలివరీ చేసారు. మాస్క్ అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్ ను వేటాడి, వెంటాడి చంపేసారు. అక్క ను వేధించిన వారిని ప్రశ్నించినందుకు బీసీ బిడ్డ అమర్నాధ్ గౌడ్ పై పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్..