YS Jagan Security Issue: ఏపీలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలన, అప్రజాస్వామిక విధానాలు, కక్షసాధింపులో భాగంగా అక్రమ కేసుల బనాయింపు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు భద్రత కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ.. విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది వైసీపీ ప్రతినిధుల బృందం.. శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున, పేర్ని వెంకట్రామయ్య, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు తాటిపర్తి చంద్రశేఖర్, బూసినె విరూపాక్షి, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, కల్పలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ తదితరులు గవర్నర్‌ను కలిసి, రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలపై, ప్రభుత్వం చట్ట విరుద్దంగా వ్యవహరిస్తున్న తీరుపై ఆయనకు వివరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.
Read Also: War2- coolie : 50 డేస్ కౌంట్ డౌన్.. ఏంటీ కొత్త ట్రెండ్..
ఇక, అనంతరం రాజ్‌భవన్ బయట శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చేస్తున్న అఘాయిత్యాలు, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు కల్పించాల్సిన భద్రతను విస్మరించడం, ఆయన పర్యటనల సందర్భంగా అక్రమ కేసులను బనాయిస్తున్న విధానాలపై గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లాం.. ఇవి అప్రజాస్వామికం, గతంలో ఎవరూ ఇటువంటి చర్యలకు పాల్పడలేదు, కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న వైనంపై గవర్నర్‌కు వివరించాం. ఇటీవల సత్తెనపల్లిలో జరిగిన వైయస్ జగన్ పర్యటన సందర్భంగా ఒక వాహనం ఢీ కొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ దుర్ఘటనపై సాక్షాత్తు పల్నాడు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ ప్రమాదానికి జగన్‌కు చెందిన కాన్వాయి వాహనాలు కారణం కాదు, వేరే ప్రైవేటు వాహనం ఢీ కొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చాలా స్పష్టంగా ప్రకటించారు. ఈ ప్రమాదంలో సింగయ్య గాయపడటంతో పోలీసులే అతడిని ఆసుపత్రిలో చేర్పించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తరువాత హటాత్తుగా పోలీసుల తీరు మారింది. ఈ సంఘటన జగన్ ప్రయాణించిన కారు ఢీకొనడం వల్లే జరిగిందటూ, ఎప్పుడూ చరిత్రలో జరగని విధంగా కారులో ప్రయాణిస్తున్న వారిపైన కూడా కేసులు నమోదు చేశారని మండిపడ్డారు.
Read Also: Atal Pension Yojana: ఈ పథకం అద్భుతం.. భార్యాభర్తలిద్దరు ప్రతి నెల రూ. 10 వేలు పొందే ఛాన్స్
అంతేకాదు, ఆ కారును కూడా సీజ్ చేసి తీసుకువెళ్ళారు. ఈ ప్రభుత్వం ఎటువంటి అరాచకంకు పాల్పడుతుందో దీని ద్వారా రాష్ట్రప్రజలందరికీ అర్థమవుతోందన్నారు బొత్స.. ఏదో ఒక విధంగా వైసీపీ నేతలను భయపెట్టాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఉంది. అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని అడ్డుకోవాలని చూడటం వారి అవివేకం. వైయస్ జగన్ దేశంలోనే అత్యంత ప్రజాధరణ కలిగిన నాయకుడు, ఆయన పర్యటనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఆయన ఎక్కడకు వెళ్ళినా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారనే సమాచారం, ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌లు ప్రభుత్వం వద్ద లేవా? ఎందకు దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేయడం లేదని ప్రశ్నిస్తున్నాం. పైగా జరిగిన ప్రతి దానిని వక్రీకరిస్తూ మాపైనే ఎదురుదాడి చేస్తున్నారు. సత్తెనపల్లి ఘటనపై మీకు మానవత్వం లేదా అని టీడీపీ నేతలు ప్రశ్నించడం చూస్తుంటే, ఇంతకంటే ఎదురుదాడి ఉంటుందా అనిపిస్తోంది. జగన్ పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయి చుట్టూ వందల మంది ప్రజలు ఉన్నారు. ఆయనకు పోలీస్ భద్రత ఇచ్చామని చెబుతుంటే, అంత మంది ఆయన ప్రయాణిస్తున్న కారుకు అత్యంత సమీపంలోకి ఎలా వస్తున్నారు? సింగయ్య నిజంగానే వైఎస్ జగన్ వాహనం కింద పడితే ఆ కారుకు ముందు ఉండాల్సిన పోలీస్ ఎస్కార్ట్ వాహనాలు, దానిలోని పోలీసులు, రోప్ పార్టీ ఎందుకు చూడలేదు? ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ఏ సమాచారం ప్రకారం మొదట వివరాలను వెల్లడించారు? ఈ కుట్రనే గవర్నర్ దృష్టికి తీసుకువచ్చామని బొత్స సత్యనారాయణ అన్నారు.