Ayesha Meera Case: హైకోర్టులో ఆయేషా మీరా తల్లిదండ్రుల పిటిషన్.. తుది నివేదిక పరిశీలించండి..
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయేషా మీరా తల్లిదండ్రులు పిటిషన్..
- ఆయేషా హత్యపై సీబీఐ తుది నివేదిక పరిశీలించాలి..
- సీబీఐ విచారణ తుది నివేదికను మాకు ఇచ్చేలా..
- సీబీఐని ఆదేశించాలని పిటిషన్.. రేపు విచారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayesha Meera Case: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయేషా మీరా తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు.. ఆయేషా మీరా హత్యపై సీబీఐ ఏం విచారణ చేసిందో తుది నివేదిక పరిశీలించాలని.. ఆ పిటిషన్‌లో హైకోర్టుకు విన్నవించారు ఆయేషా తల్లి శంషాద్ బేగం.. అదే విధంగా సీబీఐ విచారణ తుది నివేదికను ఆయేషా మీరా తల్లిదండ్రులకు ఇచ్చేలా సీబీఐని ఆదేశించాలని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు.. ఇక, ఆయేషా మీరా తల్లిదండ్రుల దాఖలు చేసిన పిటిషన్‌పై రేపు విచారణ చేయనుంది ఏపీ హైకోర్టు..
Read Also: Relationship: ‘‘ ఫేస్‌బుక్ పరిచయం, లైంగిక సంబంధం కోసం ఒత్తిడి’’.. వివాహిత దారుణ హత్య..
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసిన విషయం విదితమే.. దీంతో, ఈ నెల 20వ తేదీన తుది నివేదికను సీల్డ్ కవర్‌లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సమర్పించారు సీబీఐ అధికారులు.. ఇక, ఈ కేసు విచారణ సందర్భంగా.. సీబీఐ కోర్టులోనూ ఆయేషా మీరా కేసుకు సంబంధించిన నివేదిక కాపీని అందించాలని.. సీబీఐ అధికారులను ఆదేశించింది హైకోర్టు.. మరోవైపు, ఈ కేసులో తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారు హైకోర్టు న్యాయమూర్తి.. అయితే, విజయవాడలోని ఓ హాస్టల్‌లో 17 ఏళ్ల ఆయేషా మీరా అనే ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన ఘటన.. అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించింది.. 2007 డిసెంబర్27వ తేదీన జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది.. హాస్టల్‌లోని బాత్‌రూమ్‌లో కత్తిపోట్లతో ఆయేషా మీరా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, 2018లో ఈ కేసును పునర్‌విచారణ చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.. తొలుత సిట్‌కి ఆ బాధ్యతలు అప్పగించిన హైకోర్టు.. సిట్ దర్యాప్తులో పురోగతి లేదని, ఈ కేసులో సీబీఐ విచారణకు ఆదేశించిది.. దీంతో, విచారణ పూర్తి నివేదికను సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు అందజేశారు సీబీఐ అధికారులు.. తాజాగా, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆయేషా మీరా తల్లిదండ్రులు..
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!